కర్నూలు జిల్లా: కర్నూలు కార్పొరేటర్ల సేవలు ప్రసంశనీయమని వైయస్ఆర్‌సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. కర్నూలులోని ఎస్వీ కాంప్లెక్స్‌లో నిర్వహించిన కార్పొరేటర్ పదవి విరమణ కార్యక్రమం అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు, కర్నూలు సమన్వయకర్త , మాజీ ఎమ్మెల్యే ఎస్.వి. మోహన్ రెడ్డి గారు, ఎస్.వి. విజయ మనోహరి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్.వి. మోహన్ రెడ్డి మాట్లాడుతూ, పదవి విరమణ చేస్తున్న కార్పొరేటర్ ప్రజలకు అందించిన సేవలు ప్రశంసనీయమని తెలిపారు. ఆయన ప్రజాసేవలో చూపిన అంకితభావం, కృషి ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. ప్రజల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలను ఎప్పటికీ మరవలేమని అన్నారు. అలాగే ఎస్.వి. విజయ మనోహరి మాట్లాడుతూ, ప్రజాసేవలో నిజాయితీతో పనిచేసిన నాయకులకు పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని తెలిపారు. భవిష్యత్తులో కూడా సమాజానికి సేవలు అందిస్తూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు, పాణ్యం, కొడుమూరు ప్రాంతాలకు చెందిన కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు మరియు మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.