పుట్టపర్తిలో ఎస్పీ కార్యాలయానికి వైయ‌స్ఆర్‌సీపీ నేతల వినతి

మహిళలపై అనుచిత వ్యాఖ్యలపై కఠిన చర్యలు తీసుకోవాలి 

పుట్టపర్తి :  మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు డిమాండ్ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ సతీష్ కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, శ్రీ సత్యసాయి జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షురాలు, పెనుకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ మహిళల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. సమాజంలో విషప్రచారం చేస్తున్న వ్యక్తులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే దుద్దెకుంట శ్రీధర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, హిందూపురం సమన్వయకర్త దీపికా, మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి, మాజీ ఎమ్మెల్యే అత్తర్ చాంద్ బాషా, వైయ‌స్ఆర్‌సీపీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
చట్టం ముందు అందరూ సమానమేనని, మహిళలపై అవమానకర వ్యాఖ్యలు చేసే వారిని ఉపేక్షించరాదని నేతలు స్పష్టం చేశారు. పోలీసులు వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
 

Back to Top