రైతులు ఆనందంగా ఉంటే ఈనాడుకు కడుపుమంట

రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు  

దళారీ వ్యవస్థను నిర్మూలించేందుకే ఆర్బీకెలు

రైతు దగ్గర ప్రతి గింజా కొంటాం

రామోజీ మొసలికన్నీరు రాతల్ని ఎవడూ పట్టించుకోరు

అమరావతి రాజధాని పేరిట 50వేల ఎకరాల పంటల ధ్వంసం రామోజీకి కనపడలేదా..?

సూటిగా ప్రశ్నించిన మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు

బీసీలే టీడీపీకి సమాధికడతారు..

పార్టీలేదు.. బొక్కాలేదన్న అచ్చెన్న మాటలే నిజమవుతాయి

తాడేపల్లి: రైతులు ఆనందంగా ఉంటే ఈనాడుకు కడుపుమంట అని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మండిప‌డ్డారు.  ఈనాడు రామోజీరావు సరికొత్త అవతారం ఎత్తారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు మీద ఉన్నటువంటి ప్రేమను.. ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ఉన్న అక్కసును ప్రజలకు ఏవిధంగా తేటతెల్లం చేయాలనే ఆలోచనలో భాగంగా తన పత్రిక ద్వారా రోజుకో వంట వండివారుస్తున్నారు. రాష్ట్రంలో రైతులు, ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రామోజీరావు తెగ బాధపడిపోతున్నట్లు కథనం అల్లాడు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రాష్ట్రంలో రైతులు నష్టపోతున్నారని..మిల్లర్లు బాగుపడుతున్నారని రాసుకొచ్చారు. ‘చూడు రామోజీ..! నాడు రాజధాని అమరావతి పేరిట 50 వేల ఎకరాల పచ్చని పంటపొలాల్ని చంద్రబాబు నాశనం చేశాడు కదా.. సీపీఐ, సీపీఎం, పవన్‌ కళ్యాణ్‌ కూడా పంటల్ని నాశనం చేస్తున్నారంటూ ఆనాడు పోరాటం చేశారు కదా... రాజధాని భూముల్లో మీరు కూడా 120 ఎకరాలు కొన్నారన్నారే.. అందుకే బహుశా మీలో అప్పుడు చలనం కలగలేదేమో..’  మరి, రాజధాని ప్రాంతాల పంటభముల్ని విధ్వంసానికి పాల్పడినప్పుడు అప్పట్లో రైతులు గురించి మాట్లాడని.. కథనాలు రాయని మీరు.. ఈరోజెందుకు రైతుల గురించి మొసలికన్నీరు కారుస్తూ తెగ బాధపడి పోతున్నారు...? చంద్రబాబు వ్యవసాయం దండగ అని మాట్లాడితే మీకు నోరు పడిపోయింది. కైకలూరు పర్యటనలో ‘వ్యవసాయం వేస్టు.. ఇండస్ట్రీస్‌ బెస్ట్‌’ అని చంద్రబాబు పిలుపునిస్తే మీకు వినిపించదు. కనిపించదు. మీరు మెచ్చుకునే చంద్రబాబు తన అధికార హయాంలో రైతులకు మేలు జరిగే పని ఒక్కటైనా చేశాడా..? 2014లో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు ఇవ్వాల్సిన పంటనష్టం ఇన్‌పుట్‌ సబ్సిడీని కనీసం 2019కి ముందు అధికారంలో నుంచి దిగేటప్పుడైనా ఇస్తాడనుకుంటే.. మొండిచెయ్యి చూపెట్టాడు. అదికూడా మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టాక రైతులకు అందజేశారు. రైతుల పట్ల జగన్‌ గారి సహృదయత గురించి ఈనాడు పత్రికలో ఎప్పుడూ రాయరు. రైతులకు పెద్దపీట వేసి మేలు చేస్తుంటే రామోజీ కళ్లకు కనబడదు. చెవులకు వినపడదు. 

రైతు ప్రభుత్వమిది..

ఈరోజు రాష్ట్రంలో రైతులకు సంబంధించి పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పిస్తున్నాం. ధాన్యం సేకరణలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. ధాన్యం సేకరణ లక్ష్యం తగ్గించారనే ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పౌరసరఫరాల సంస్థ కోసం నాబార్డ్‌ తెచ్చిన నిధుల్ని పసుపు..కుంకుమ పేరుతో చంద్రబాబు పంచారు. ఆ బకాయిలను మేం చెల్లించాం.  ఈ రాష్ట్రంలో రైతులకు పంట దిగుబడుల అమ్మకాల్లో న్యాయం జరగాలని.. రైతుకు మిల్లర్‌కు సంబంధం లేకుండా ఆర్బీకే కేంద్రాలను అందుబాటులోకి తెచ్చాం. దళారీవ్యవస్థ లేకుండా ఒక్క రూపాయి కూడా రైతు నష్టపోకుండా గిట్టుబాటు ధరను ఇస్తున్నాము . గతంలో రూ.170 నుంచి రూ.200 వరకు దళారులు లాభం మిగుల్చుకునే వారూ.అలాంటిది ఈరోజు నేరుగా మద్దతు ధర మొత్తంను పంట కొనుగోలు చేసిన 21 రోజుల్లోగానే వారి ఖాతాల్లోకి ప్రభుత్వం జమచేస్తుంది. గన్నీబ్యాగ్స్, హమాలీలు, రవాణా ఖర్చులు అన్నింటినీ ప్రభుత్వమే భరిస్తుంది. గన్నీబ్యాగ్స్‌కే రూ.2 కోట్లు .. హమాలీలు, రవాణాకు మరో రూ. 5 కోట్లు ఖర్చుచేస్తున్నాం. . వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మూడున్నరేళ్లలో రూ.50,699 కోట్లు ధాన్యం కొనుగోళ్లకు కేటాయిస్తే.. చంద్రబాబు హయాంలో ఐదేళ్లలో రైతులకు కేటాయించిoది నామ మాత్రమే. రైతులంతా ధాన్యం కొనుగోళ్లకు సంబంధిం చాలా సంతోషంగా ఉంటే మీకెందుకు బాధ కలుగుతుందో అర్ధంకావడంలేదు రామోజీ.. రైతుకు మేలు జరిగితే మీకేమైనా కడుపుమంట..? బాబు పాలనలో సకాలంలో వర్షాలు లేవు. పశువులకు కూడా గడ్డి ఉండదు. కరువు రాజ్యమేలుతుంది.అదే.. వైఎస్‌ఆర్‌ సీపీ అధికారంలోకి రాగానే వరుణుడు కరుణిస్తాడు. సకాలంలో వానలు పడతాయి. కాలువలు నిండుతాయి. పంటలు బాగా పండుతాయి. మేం వ్యవసాయాన్ని, రైతును కంటికి రెప్పలా కాపాడుకుంటాము కనుకే.. మాకు ప్రకృతి కూడా అనుకూలిస్తుంది. మేము ఈ రాష్ట్రంలో రైతులు ఎంత పండించినా కొనడానికి మేం సిద్ధంగా ఉన్నాం. మీరు బాధ పడాల్సిన అవసరం లేదు. ఏ ఒక్క రైతు నష్టపోకుండా ప్రతీ గింజా కొనుగోలు చేస్తాం. రేషన్‌ విషయంలో కూడా చంద్రబాబు ఐదేళ్లలో పేదలకు ఏం ఇచ్చాడో.. మేం మూడున్నరేళ్లల్లోనే రెట్టింపు అందజేస్తున్నాం. కనుక, ఇప్పటికైనా చంద్రబాబు హయాంలో ఎలా ఉందో.. జగనన్న పరిపాలనలో ఏ విధంగా రైతులు మేలు పొందు తున్నారనే వాస్తవాల్ని బేరీజు వేసుకుని పత్రికల్లో రాతలు రాయండి. 

బీసీల ఆత్మగౌరవ వేదిక ‘వైఎస్‌ఆర్‌సీపీ’

బీసీ జనగణనను వెలికిదీసి బీసీలకు గౌరవం కల్పించడంలో మా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. బీసీల ఆత్మగౌరవ వేదికగా పనిచేస్తుంది. 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అన్ని బీసీ సామాజికవర్గాలకు గుర్తింపునిచ్చాం. ఈరోజు మీరు దుష్ప్రచారం చేస్తున్నట్లు కార్పొరేషన్లకు ఫండ్స్‌ ఇవ్వలేదనేది శుద్ధ అబద్ధం. మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారు బీసీలకు రూ.1.67 లక్షల కోట్లు ఇస్తే.. చంద్రబాబు కేవలం 20వేల కోట్లు కూడా ఇవ్వలేదు. కార్పొరేషన్లకు నిధులివ్వడమే కొలమానంగా చూడకూడదు. ఆయా బీసీ సామాజికవర్గాలకు సమ ప్రాధాన్యం కల్పించాం . వారి సమస్యల్ని నేరుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి.. వాటన్నింటినీ పరిష్కరించుకునేందుకు వేదికలుగా కార్పొరేషన్లు చురుకైన పాత్ర పోషించాయి. 

రాజ్యసభకు ఒక్క బీసీని అయినా బాబు పంపాడా...?
టీడీపీ నుంచి రాజ్యసభకు ఒక్క బీసీని కూడా పంపారా...? పంపలేదు. అదే.. మా జగన్‌గారు నలుగురు బీసీల్ని రాజ్యసభకు పంపారు. బీసీల గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదు. టీడీపీలో బీసీ తోకలు ఆరుగురే మిగిలారు. బాబు వల్ల మేం జనాల దగ్గర తలెత్తుకుని తిరగలేకపోతున్నామని వాళ్లు బాధపడుతున్నారు. ఆ ఆరుగురు బీసీ నేతలు బాబు స్క్రిప్టు చదవడమే గానీ వాళ్లకూ అక్కడ ఉండాలనే పెద్ద ఇంట్రస్ట్‌ లేదు. ‘స్వయంగా మీ పార్టీ అధ్యక్షుడు అచ్చెన్ననే అన్నాడు కదా.. పార్టీలేదు. బొక్కాలేదు..అని’ ఈ సంగతి బాబుకు తెలియదా..? ‘బాబు.. నీ కొడుకునే నువ్వు మంగళగిరిలో గెలిపించుకోలేకపోయావు. ఇప్పుడేమో.. నీ పప్పు చేత కుప్పం నుంచి పాదయాత్ర చేయిస్తావా..?’ కుప్పం నుంచి పాదయాత్ర మొదలు పెట్టగానే బీసీలు పప్పును నిలదీసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆనాడు ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీలిచ్చిన 600 వాగ్దానాలను ఏమేరకు అమలు చేశావు చంద్రబాబ..? సమాధానం నువ్వు చెబుతావా..? నీ పప్పు చెబుతాడా..?  పప్పులోకేష్‌ ఏ మొఖం పెట్టుకుని పాదయాత్ర చేస్తాడో.. 

బీసీలే టీడీపీకి సమాధి కడతారు..

చంద్రబాబు బీసీలకు ఏం చేశాడనేది ధైర్యంగా చెప్పుకోలేడు. బీసీల్ని తీవ్రంగా అవమానించి.. తోకలు కత్తిరిస్తానని బెదిరించిన చంద్రబాబును 2024లో టీడీపీని బీసీలే సమాధి కడతారు. ఈ మూడున్నరేళ్లలోనే బీసీల్లో ఎంతో పేరు సంపాదించిన జగన్‌ గారిని చూసి టీడీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారు. అందుకే, బాబు తనకు వత్తాసు పలికే పచ్చమీడియాతో పిచ్చిరాతలు రాయిస్తున్నాడు. అవినీతికి తావులేకుండా జగన్‌గారు బటన్‌నొక్కి కులాలు, మతాలకు అతీతంగా సంక్షేమపథకాలు అందిస్తున్నారు. బీసీలకు వివిధ పథకాల ద్వారా ఒక్క డిబిటి ద్వారానే దాదాపు  రూ. 86వేల కోట్లు  అందజేశారు. దాదాపు రూ.51 వేల కోట్లు వెచ్చించి 31 లక్షలమందికి ఇళ్లపట్టాలు పంపిణీ చేశారు.  తడిసిన ధాన్యాన్ని కూడా మేం కొంటున్నాం. ఎక్కడా రైతులకు ఇబ్బందులు లేవు. ఎంఎస్‌పీ రేటు కన్నా తక్కువ కాకుండా కొనుగోలు చేస్తున్నాం. చంద్రబాబు.. సీఎంకు లేఖ రాసే దమ్మూధైర్యం కూడా లేదు. ఈ రాష్ట్రంలో రైతులంతా బాగున్నారని చంద్రబాబు, పచ్చమీడియా  జీర్ణించుకోలేకపోతున్నారు. కాబట్టి.. ‘రామోజీ.. నువ్వు రాసే ప్చిరాతలను ప్రజలు నమ్మేరోజులు పోయాయి. ఇకనైనా బుద్ధితెచ్చుకుని నీ గౌరవాన్ని కాపాడుకో..’.అని మంత్రి కారుమూరి హెచ్చరించారు.

తాజా వీడియోలు

Back to Top