గజపతినగరంలో జ‌న‌సేన‌కు షాక్

విజయనగరం జిల్లా:  గజపతినగరం నియోజకవర్గం లో జ‌న‌సేన పార్టీకి పెద్ద షాక్ తగిలింది. గజపతినగరం నియోజకవర్గం దత్తీరాజేరు మండలం పెదకాద గ్రామంలో జనసేన పార్టీ కి చెందిన నాయకులు వైయ‌స్ఆర్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. కూటమి ప్రభుత్వ సిద్ధాంతాలు నచ్చక, దత్తీ రాజేరు మండలంలో జనసేన పార్టీ కి తగిన ప్రాధాన్యత లేకపోవడం పార్టీకి రాజీనామా చేశారు..పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం కష్టపడి పని చేసామని,,కూటమి ప్రభుత్వం వచ్చాక గుర్తింపు లేదని తెలిపారు. జనసేన మండల సీనియర్ నాయకులు సామిరెడ్డి లక్ష్మణ ఆధ్వర్యంలో  35 కుటుంబాలు మాజీ శాసనసభ్యులు బొత్స అప్పలనరసయ్య సమక్షంలో ,వారి ఇంటి వద్ద వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు.పెదకాద మాజీ ఉపసర్పంచ్ మత్స్య వెంకన్న,మాజీ వార్డు సభ్యులు సామిరెడ్డి తవిటీ నాయుడు, వైకుంఠం శ్రీరామ్, మాజీ చైర్మన్ సామిరెడ్డి కుర్మినాయుడు తదితరులు పార్టీలో చేరారు. 

Back to Top