మైనార్టీలను ఎదగనివ్వకుండా అణ‌చివేస్తారా?

కూటమి ప్రభుత్వంపై షేక్ నూరి ఫాతిమా తీవ్ర ఆగ్ర‌హం

గుంటూరు:  మైనారిటీల‌ను ఎద‌గ‌నివ్వ‌కుండా అణ‌చివేస్తారా అంటూ గుంటూరు ఈస్ట్ నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  కూట‌మి ప్ర‌భుత్వ పాల‌న‌లో మైనారిటీల‌కు, వారి ఆస్తుల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోయింద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.  మంగ‌ళ‌వారం ఆమె మీడియాతో మాట్లాడుతూ..కాకానిలో ఉన్న 71 ఎకరాల మైనార్టీ భూమిని ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో లాక్కోవడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని త‌ప్పుప‌ట్టారు. అలాగే అంజుమన్ ఆస్తులను కూటమి ప్రభుత్వం హరిస్తుంటే గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ చూస్తూ ఊరుకున్నారని విమర్శించారు. గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే ప్రజా సమస్యలపై స్పందించని  పెద్ద దద్దమ్మ గా మారారని ఘాటుగా వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం ప్రజలను పిచ్చోళ్లను చేస్తోందని, మైనార్టీల ఆస్తుల విషయంలో వెంటనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని షేక్ నూరి ఫాతిమా హెచ్చరించారు. మైనార్టీల హక్కుల పరిరక్షణ కోసం వైయ‌స్ఆర్‌సీపీ పోరాటం కొనసాగిస్తుందని ఆమె స్పష్టం చేశారు.

Back to Top