ప్రొద్దుటూరులో టీడీపీకి షాక్‌.. వైయ‌స్ఆర్‌సీపీలోకి 40 కుటుంబాల చేరిక

 రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరిన మాజీ కౌన్సిలర్‌ వై.ఎస్‌. హమీద్‌ కుటుంబ సభ్యులు

ప్రొద్దుటూరు: పట్టణంలోని 13వ సచివాలయం పరిధిలో వైయ‌స్ఆర్‌సీపీలోకి భారీగా చేరికలు జరిగాయి. వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో దివంగత మాజీ కౌన్సిలర్‌ వై.ఎస్‌. హమీద్‌ కుటుంబ సభ్యులతో పాటు సుమారు 40 కుటుంబాలు టీడీపీని వీడి వైయ‌స్ఆర్‌సీపీలో చేరాయి.

ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి సాదరంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ విభాగాల సభ్యులు, మహిళా నాయకురాళ్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Back to Top