కర్నూలు జిల్లా: ఆదోనిలో బీజేపీకి షాక్ తగిలింది. నార్త్ మండల బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు యువరాజ్ వైయస్ఆర్‌సీపీలో చేరారు. ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా యువరాజ్ మాట్లాడుతూ ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి వ్యవహరిస్తున్న తీరుపై అసంతృప్తితో బీజేపీని వీడినట్లు తెలిపారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఎమ్మెల్యే వ్యవహారశైలి నచ్చక వైయస్ఆర్‌సీపీలో చేరినట్లు పేర్కొన్నారు. బీజేపీ ఎమ్మెల్యే అనుసరిస్తున్న విధానం తనకు నచ్చలేదని, పార్టీపై విశ్వాసం కోల్పోయి వైయస్ఆర్‌సీపీలో చేరినట్లు యువరాజ్ తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌రెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి వైయస్ఆర్‌సీపీలోకి ఆహ్వానించారు.