తాడేపల్లి: వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు నాలుగు దశల్లో రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో…, పేరుతో చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ…కార్యక్రమం నిర్వహించాలని పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు (కోఆర్డినేషన్), పార్టీ జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్ నియోజకవర్గాల పరిశీలకులు, రాష్ట్ర కార్యదర్శులు (కోఆర్డినేషన్), ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జ్‌లతో పార్టీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. టెలికాన్ఫరెన్స్‌లో సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నారంటే... వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్ గారు కూటమి ప్రభుత్వ ఈ ఏడాది పాలనపై, చంద్రబాబు ప్రజలకిచ్చిన హామీలు విస్మరించి పాలన సాగించడం, సంక్షేమ పథకాలు ఎగ్గొట్టి ప్రజలకు ఎంత బకాయిలు పడ్డారనేది, దీనిపై ప్రజలను చైతన్యపరచడంపై విస్తృతస్ధాయి సమావేశంలో వివరించారు. మొత్తం నాలుగు దశల్లో రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో…, చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ…కార్యక్రమాన్ని ఎలా చేయాలనేది అందరం చర్చించాం, ఈ కార్యక్రమం రాష్ట్రస్ధాయి నుంచి గ్రామస్ధాయి వరకూ వెళ్ళాలి. మొదటి దశలో రీజినల్ కో ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు స్థాయిలో జరుగుతుంది, ఇందులో రీజినల్ కోఆర్డినేటర్ - జిల్లా అధ్యక్షుడు – జిల్లాలోని పార్టీ మండలాధ్యక్షులు, ఇతక క్రియాశీలక పదవుల్లో ఉన్నవారిని, నియోజకవర్గాల సమన్వయ కర్తలు, అలాగే పార్లమెంటు పరిశీలకులు వీరంతా హాజరు కావాలి. ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరుకావాలి. సమావేశంలో క్యూఆర్ కోడ్ ద్వారా డాక్యుమెంట్ రిలీజ్ చేయడంతోపాటు చంద్రబాబు ఇచ్చిన బాండ్లు గురించి, జగనన్న పథకాలు ఎలా ఎగరగొడుతున్నారు, అలాగే చంద్రబాబు మోసాల వల్ల నష్టం ఎంత, దీనికి సంబంధించిన ఫార్మాట్‌ను ఎలా నింపాలన్నదానిపై చెప్పాలి. అంతేకాకుండా జగన్‌గారి 35 నిమిషాల వీడియోనుకూడా ప్లే చేయాలి. మొదటి దశ కార్యక్రమం జిల్లా కేంద్రాల్లో జులై 3 లోగా పూర్తి అవ్వాలి, ఇందుకు అవసరమైన సమన్వయం చేసుకోవాలి, విస్తృతస్ధాయి సమావేశాలు నిర్వహించుకోవాలి. జులై 4 నుంచి 12 వరకు రెండో దశలో అసెంబ్లీ స్థాయిలో విస్తృత స్థాయి సమావేశం పెట్టుకోవాలి. నియోజకవర్గంలోని కీలక మైన నాయకులు అంతా హాజరు కావాలి. ఇందులో మండల పార్టీ అధ్యక్షులు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, సర్పంచులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, అధికార ప్రతినిధులు, అలాగే ఆ కమిటీల సభ్యులు హాజరుకావాలి. జులై 13 నుంచి 20 వరకు మూడోదశలో మండలాల్లో లేదా డివిజన్ స్ధాయిలో నియోజకవర్గ సమన్వయ కర్త ఆధ్వర్యంలో మండలస్థాయిలో విస్తృత సమావేశాలు జరగాలి. ఇందులో మండల పార్టీ అధ్యక్షుడు సహా, పార్టీ మండల కమిటీలు. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, సర్పంచులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, కీలక నాయకులు, అలాగే ఆ కమిటీల సభ్యులు హాజరుకావాలి. జులై 21 నుంచి ఆగష్టు 4 వరకు నాలుగో దశలో గ్రామస్థాయిలో జరుగుతుంది. మండలస్థాయిలో ఏర్పాటు చేసిన రెండు కమిటీలు ప్రతిరోజూ ప్రతి గ్రామాన్ని సందర్శించి గ్రామ పార్టీ అధ్యక్షుడు సహా ఇతర కార్యకర్తలు, కమిటీ మెంబర్లు సమక్షంలో పై విధంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. గ్రామంలో ఎంపిక చేసిన ప్రాంతంలో రచ్చ బండ మాదిరిగా కుర్చీలు వేసుకుని, వారికి వివరించేలా చేయాలి. జగన్‌గారి 35 నిమిషాల వీడియో లేదా, ఆడియోను వారికి వినిపించాలి. అలాగే బాండ్లను చూపించడంతోపాటు, ఎంత నష్టం కలిగిందీ అన్న ఫార్మాట్‌ను కూడా వివిధ కుటుంబాల చేత నింపించి, వాటిని పార్టీ కార్యాలయానికి అప్‌లోడ్ చేయాలి. అంతేకాకుండా రచ్చబండ విజువల్స్, ఫొటోలను కూడా పంపాలి. ఎమ్మెల్యే లేదా నియోజకవర్గ సమన్వయ కర్త కనీసంగా నాలుగు గ్రామాల్లో క్షేత్రస్థాయి కార్యక్రమాల్లో పాల్గొనాలి. జిల్లా కేంద్రాలు అయిపోయిన వెంటనే నియోజకవర్గ కేంద్రాలు, తర్వాత వెంటనే మండల కేంద్రాలు, తర్వాత వెంటనే గ్రామస్ధాయి వరకు వెళ్ళిపోవాలి. పార్టీ అధ్యక్షులు జగన్ గారు చెప్పినట్లు మండల, గ్రామ కమిటీలు వెంటనే పూర్తి చేసుకోవాలి. కమిటీలు పూర్తయితేనే కార్యక్రమం విజయవంతం అవుతుంది. గ్రామస్ధాయిలో కార్యక్రమం కోసం వీలైనంత ఎక్కువ సమయం కేటాయించాలి. ఈ కార్యక్రమానికి సంబంధించిన టెక్నికల్ సపోర్ట్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. ఐటీ వింగ్, సోషల్ మీడియా కూడా మీకు అందుబాటులో ఉంటుంది. జగన్ గారి ప్రభుత్వంలో లబ్ధిపొందిన ప్రతి ఒక్కరి ఇంటికి చేరాలి, చంద్రబాబు ఎలా మోసగించింది వారికి తెలియజేయాలి. వాళ్ళంతా ఎలా నష్టపోయింది వివరించాలి, ఈ కార్యక్రమం ఎంత విస్తృతంగా జరిగితే ప్రజల్లో అంత చైతన్యం వస్తుంది, అప్పుడే తప్పుడు హామీలు ఇవ్వడానికి భయపడతారు. ప్రతి పథకం గురించి స్పష్టంగా చెప్పాలి, చంద్రబాబు ఇస్తానంటూ మోసం చేయడం వల్ల వారికి జరిగిన నష్టం తెలియాలి. జులై 8న వైయస్ఆర్ గారి జయంతి కార్యక్రమం జరిగే రోజు ఏదో ఒక నియోజకవర్గంలో ఆ కార్యక్రమం పూర్తి చేసి తర్వాత దీనిని కొనసాగించాలి. చంద్రబాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అన్నది ప్రజల్లోకి వెళ్ళాలి. టీడీపీ నాయకులు ప్రజల వద్దకు వచ్చినప్పుడు వారిని నిలదీయాలి, జగన్ గారి ప్రభుత్వంలో లబ్ధిపొందిన 1.60 కోట్ల కుటుంబాలు కూటమి నేతలను నిలదీసేలా మనం చైతన్యం చేయాలి. దీంతోపాటు సాక్షితో పాటు మరికొన్ని చానల్స్ ప్రసారాలు రాకుండా చేసిన దుర్మార్గపు చర్యపై కూడా కేబుల్ ఆపరేటర్‌ను నిలదీసి ఆ ఛానల్స్ ప్రసారాలు అందుబాటులోకి వచ్చేలా చేయాలని సజ్జల రామకృష్ణారెడ్డి దిశానిర్ధేశం చేశారు.