తాడేపల్లి: అమరావతి భూ కుంభకోణంలో దర్యాప్తు నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టులో సవాలు చేస్తామని వైయస్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. అమరావతి భూ కుంభకోణంలో మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్‌ను మొదటి నిందితునిగా, సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి కుమార్తెలిద్దరితో పాటు మొత్తం 13 మందిని నిందితులుగా పేర్కొంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) నమోదు చేసిన కేసులో ఏకంగా దర్యాప్తు, విచారణను హైకోర్టు నిలిపేసింది. అంతేకాక ఈ కేసులో ఏ ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకోవద్దని ఏసీబీని ఆదేశించింది. అమరావతి భూ కుంభకోణంపై ఏసీబీ నమోదు చేసిన కేసుకు సంబంధించి ఎటువంటి విషయాలను బహిరంగంగా ప్రచురించడం, ప్రసారం చేయడానికి వీల్లేదని పత్రికలను, టీవీలను, సోషల్ మీడియాను ఆదేశించింది. ఈ విషయాలపై సజ్జల రామకృష్ణారెడ్డి బుధవారం మీడియాతో మాట్లాడారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నారంటే.. ప్రతిపక్షం మీడియా స్వేచ్ఛను హరించడం విడ్డూరంగా ఉంది మీడియాలో కథనాలు ప్రసారం చేయూడదని కోర్టుకు వెళ్తున్నారు గతంలో అధికార పార్టీ మీడియా స్వేచ్ఛను హరించిందని విన్నాం ఇప్పుడు ప్రతిపక్షమే మీడియాలో కథనాలు రాకూడదంటూ కోర్టుకెళ్లింది మాజీ ఏజీ దమ్మాలపాటి ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారు ప్రాథమిక సాక్ష్యాధారాలతోనే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై విచారణలో తొందరపాటు లేదు సిట్ అనేది స్వతంత్ర విచారణ సంస్థ నిన్న జరిగిన పరిణామాలు కొత్త పోకడగా అనిపిస్తున్నాయి తప్పులపై విచారణ జరగకుండా కక్షసాధింపు పేరుతో అడ్డుకోవాలని చూస్తున్నారు. మేధావులు కూడా నిన్నటి పరిణామాలపై విస్మయం చెందుతున్నారు టీడీపీ కార్యకర్తగా పని చేసిన వ్యక్తికి అడ్వకేట్ జనరల్‌గా అవకాశం ఇచ్చారు కోట్లు ఖర్చు పెట్టి ఢిల్లీ నుంచి న్యాయవాదులను తెచ్చుకుంటున్నారు ఢిల్లీ నుంచి న్యాయవాదులను తెచ్చుకోవడానికి అంత డబ్బు ఎక్కడిది? టీడీపీ నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజా వేసిన మరో పిటిషన్‌పై కూడాస్టే వచ్చింది ప్రభుత్వం కక్షసాధింపులకు పాల్పడుతుందని భావిస్తే సీబీఐ విచారణ కోరవచ్చు కదా? సీబీసీ దర్యాప్తు చేయాలని ప్రభుత్వం కోరితే ఆ పిటిషన్ డిస్మిస్ చేయడం బాధాకరం కోర్టులో ఎప్పుడు ఏ కేసు వస్తుందో టీడీపీ నేతలకు ఎలా తెలుసు? ఇవాళ వచ్చిన జడ్జిమెంట్ గురించి టీడీపీ నేత బోండా ఉమ నిన్ననే ఎలా మాట్లాడారు? చంద్రబాబు అధికారంలో ఉండగా అమరావతి పేరుతో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగింది. ఎన్నికలకు ముందే అధికారంలోకి వస్తే దీనిపై విచారణ జరిపిస్తామని చెప్పాం అమరావతిలో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు అమరావతిలో వేల కోట్ల కుంభకోణం జరిగిందని ప్రజలు నమ్ముతున్నారు రాష్ట్రంలో మతాల మద్య చిచ్చుపెట్టాలనే ప్రయత్నం జరుగుతోంది ఆలయాల్లో ఘటనలు చంద్రబాబే చేయిస్తున్నారని అనుమానాలు వస్తున్నాయి