తాడేపల్లి: చంద్రబాబును గద్దెనెక్కించేందుకు రామోజీ దిగజారిపోయారని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. మార్గదర్శి పేరుతో ఈనాడు రామోజీ రావు ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. రామోజీ.. ఈనాడు పత్రిక ద్వారా రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగారు. ప్రజలను మోసం చేస్తూ రామోజీ వ్యాపారాన్ని విస్తరించారని స్పష్టం చేశారు. గురువారం తాడేపల్లిలోని తన కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నారంటే.. వాలంటీర్లు ఓటర్లను ప్రభావితంచేస్తారంటూ తన మనిషి నిమ్మగడ్డ ప్రసాద్ ద్వారా ఫిర్యాదులు చేయించింది,కేసులు వేయించి అడ్డుకుంది చంద్రబాబే అన్నారు. అసలు వాలంటీర్లంటే వారికి నిజంగా ప్రేముంటే వాలంటీర్ల గురించి చంద్రబాబు,ఆయన దత్తపుత్రుడు మొన్నటివరకు ఏమి మాట్లాడారో మరిచిపోయారా అని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ అయితే మహిళల ట్రాఫికింగ్ జరుగుతుందని మహిళలు అదృశ్యమవుతున్నారని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. చంద్రబాబు ఏమో వాలంటీర్లతో అరాచకాలు జరుగుతున్నాయని అన్నారు. లోకేష్ సైతం అలాంటి విషపు మాటలే మాట్లాడారు. ఆయన ఇంకా ముందుకు వెళ్లి తాము అధికారంలోకి వస్తే మా పార్టీ వారికి మాత్రమే పధకాలు ఇస్తాం అని మాట్లాడారని అన్నారు. ఆ మాటలను ప్రజలు మరిచిపోతారనుకుంటే వారి భ్రమేనని అన్నారు. చంద్రబాబు మాటలు వాలంటీర్లు...జనం నమ్మరు. పచ్చమీడియాలో వాలంటీర్లపై తప్పుడు రాతలు రాశారు. చంద్రబాబు తన మనిషి నిమ్మగడ్డ ద్వారా కేసులు వేయించారు. ఫిర్యాదులు చేయించారు. చంద్రబాబుకు అవకాశం ఇస్తే వాలంటీర్లను తీసేస్తారు. తిరిగి జన్మభూమి కమిటీలను తీసుకువస్తారు. వాలంటీర్లు ఓటర్లను ప్రభావితం చేస్తారనడం అబధ్దం అని అన్నారు. వాలంటీర్లు పెన్సన్ ఇవ్వకుండా అడ్డుకుంది చంద్రబాబే అని అంటూ నేడు 33 మంది చనిపోయారంటూ ఎన్ హెచ్ ఆర్సికే ఫిర్యాదు చేశారని వారికి వీలుంటే ఐక్యరాజ్యసమితికైనా ఫిర్యాదు చేస్తారని ఎద్దేవా చేశారు. నిజానికి శవరాజకీయాలు చేసేది చంద్రబాబే అన్నారు. వృధ్దులు చనిపోతే దానిని వైయస్సార్ సిపికి అంటగట్టాలని చూస్తున్నారని అన్నారు. వాలంటీర్లు గత నాలుగున్నరేళ్ళుగా ఫించన్లు,వివిధ పధకాలను ప్రజలకు అందిస్తున్నారని వారిని నేడు రెండు నెలలు అడ్డుకోవడం ద్వారా వారి ప్రభావాన్ని ఆపగలరకునుకుంటే భ్రమేనని అన్నారు. వాలంటీర్లుి ఓటర్లను ప్రభావితం చేస్తారనడం భ్రమేనని అన్నారు. సంక్షేమపధకాల లబ్దిదారులందరూ జగన్ కు మధ్దతుగా ఉన్నారు. నిజానికి జగన్ గారి మానసపుత్రిక అయిన వాలంటీర్ల వ్యవ్యస్ధ ప్రజల తలలో నాలుకలా మారిందని వారితో రాష్ర్టంలోని ప్రతి ఒక్కరికి విడదీయరాని అనుభంధం ఏర్పడిందని అన్నారు.ఎన్నికలలో నాలుగు ఓట్ల కోసం ప్రజలను ఎలా భ్రమలలో పెట్టవచ్చనేందుకే చంద్రబాబు నిత్యం అబద్దాలు మాట్లాడతున్నారన్నారు. చంద్రబాబు వస్తే జన్మభూమి కమిటీలు అంటే జలగల కమిటీలు మళ్ళీ వస్తాయన్నారు. జగన్ గారి ఆధ్వర్యంలో శాచ్యురేషన్ బేసిస్ లో ఇప్పుడు ఇస్తున్నారో అదంతా పోతుందన్నారు. వాలంటీర్లపై వారు చేసిన తప్పిదం క్షేత్రస్దాయిలో బూమ్ రాంగ్ అయిందని భావించి ఇప్పుడు బహిరంగంగా అబద్దాలు ఆడుతున్నారన్నారు.నిజానికి వాళ్ళు గ్రహించాల్సిందేమంటే జగన్ గారు అమలుచేసిన పధకాల వల్ల లబ్దిపొందిన అందరూ జగన్ గారికి ఇన్ ఫ్లూయెన్స్ అయిఉన్నారని అన్నారు.వారిని మార్చలేరని వారంతా మా ప్రభుత్వానికి మధ్దతుగా ఉన్నారని తెలియచేశారు. ఆర్ బి ఐ నిభందనలకు వ్యతిరేకంగా మార్గదర్శి డిపాజిట్లు సేకరించారు. ఈనాడు ద్వారా రాజకీయాలను శాసించారు.సుప్రీంతీర్పుతో రామోజి బండారం బయటపడింది. మార్గదర్శి ఫైనాన్సియర్స్ పై సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకమైనది.ఒక మోసంతో ప్రారంభమై అవే పునాదులుగా చట్టాలను ఉల్లంఘించి ప్రజలను నమ్మించి మీడియా ముసుగుతో రామోజిరావు వ్యాపారాలను కొనసాగించారు. దాని ముసుగులో ఆర్దిక నేరాలకు పాల్పడి దశాబ్దాల తరబడి మూడు నాలుగు రాష్ర్టాలలో ప్రజలను మోసం చేస్తూ వచ్చారు. ఒకవైపు సమాజంలో అత్యంత విశ్వసనీయమైన ప్రముఖుడుగా జాతీయాస్దాయిలో సైతం పేరుతెచ్చుకుని ప్రజలనుంచి అక్రమంగా డిపాజిట్లు సేకరించి అక్రమాలతో అవినీతి సామ్రాజ్యాన్ని సమాంతర ఆర్ధిక వ్యవస్దను నడిపిన వ్యక్తి రామోజి రావు అన్నారు. గత దశాభ్దంన్నరగా కోర్టులో కేసులు నడుస్తున్నాయి. వాస్తవాలు ఇవి అని సమాజం పట్ల నిబధ్దత ఉన్నవారుగాని వారి అన్యాయాలను బయటకు తీసుకురావాలనుకుంటున్న వ్యక్తులు ముఖ్యంగా ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వ్యక్తులు 15,20 ఏళ్ళుగా పోరాడుతున్నారు. వారి పోరాటాల ఫలితమే నిన్నటి సుప్రీంకోర్టు డైరక్షన్ అని అన్నారు. రాష్ర్టంలో రామోజిరావు గాని,ఆయన నడుపుతున్న వ్యవస్ధలు గాని తెలుగురాష్ర్టాలు,కర్నాటకలో కూడా కనిపిస్తాయి. దానికి ప్రధాన కారణం మార్గదర్శి ఇంటిపేరులా తయారైంది. దానికి తోడు ఈనాడు పత్రిక వచ్చాక రాజకీయాలను సైతం శాసించడం మొదలు పెట్టారు. ఆ తర్వాత అధికారాన్ని తెరవెనుకనుంచి నడిపించడం,నచ్చని వారుంటే వారిని దించడం వరకు ఓ పత్రికను,మీడియాను అడ్డుపెట్టుకుని ఆయన చేస్తున్నఆగడాలు కనిపిస్తూనే ఉన్నాయి. ఇంతగా ఎందుకు చెబుతున్నామంటే ఇదంతా ఒక అబధ్దంమీద,ఓ మోసం మీద ,ఓ అన్యాయం,ఓ దుర్మార్గం మీద నిర్మించబడిన వ్యవస్ధ ఈనాడు. అది నేడు బయటకు రాబోతోంది. రామోజిరావు మార్గదర్శి పేరుతో ఆర్ధిక నేరాలకు పాల్పడ్డారు. ఆర్ బి ఐ రూల్స్ కు విరుధ్దంగా రామోజి వ్యవహరించారు. సుప్రీంకోర్టు డైరక్షన్ ద్వారా రామోజిరావు బండారం బయటపడింది. రామోజిరావు అక్రమాలన్నీ సుప్రీంకోర్టు తీర్పుతో బయటకు వస్తాయి. చంద్రబాబును గద్దెనెక్కించేందుకు రామోజి దిగజారిపోయారు.సీఎం జగన్ గారిపై నిత్యం విషం గక్కుతున్నారు. చంద్రబాబుకోసం రామోజిరావు అడ్డదారుల్లో వెళ్తున్నారు. రామోజిరావు ఏనాడైనా నిష్పక్షపాతంగా వార్తలు రాశారాఅని ప్రశ్నించారు. అందరికి నీతులు చెప్పే రామోజి వాటిని తాను పాటించడని అన్నారు. మీడియా ముసుగులో రామోజీ నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. తాము సృష్టించిన అబధ్దాలనే బ్యానర్ కధనంగా ఇస్తున్నారు ప్రజల నమ్మకమే పెట్టుబడిగా మార్గదర్శి ఫైనాన్స్ పెట్టారు. ఒక మోసంమీద,అన్యాయం మీద,దుర్మార్గం మీద నిర్మించబడింది ఈనాడు. అది బయటకు రాకూడదు. మొన్న మార్గదర్శి కేసుపై సుప్రీంకోర్టు కేసు ఓపెన్ చేసి తెలంగాణా హైకోర్టుకు పంపింది. దీనివల్ల ఏం జరగబోతోందంటే ఈ అక్రమాలన్నింటికి మూలమైన మార్గదర్శి ఫైనాన్స్,బ్లాక్ మనీని వైట్ చేయడం దగ్గర్నుంచి అసలు వేల కోట్ల రూపాయలను ఉపయోగించి రామోజీరావు తన సామ్రాజ్యాన్ని విస్తరించారు. అలాగే మార్గదర్శి చిట్ ఫండ్ లో ప్రజల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని ఆ డబ్బులతో తన వ్యాపారాన్ని చేసుకోవడం,తన రాజకీయం నడపడం వంటివి వెలుగులోకి రాబోతున్నాయి. మార్గదర్శి ఫైనాన్స్ అనేది ప్రొప్రెయిటరీగానా,భాగస్వామ్య సంస్ధా కాదు.ప్రైవేటు లిమిటెడ్ కాదు. ఏదీ లేని మార్గదర్శి ఫైనాన్స్ అని పేరు పెట్టుకుని ఆయనే హెచ్ యు ఎఫ్ అని ప్రొప్రెయిటరీ గా,మరోసారి ఛైర్మన్ గా కనిపించారు. రామోజీ తాము సృష్టించిన అబధ్దాలనే బ్యానర్ కధనంగా ఇస్తున్నారు అని మండిపడ్డారు.1960 ప్రాంతంలో జిజే రెడ్డి అని పలుకుబడిన వ్యక్తి (రామోజీరావుకు ఉద్యోగం ఇచ్చిన వ్యక్తి) మార్గదర్శి చిట్ ఫండ్ పెట్టి కొంతకాలం నడిపారు.ఆ తర్వాత పరిణామక్రమంలో జిజేరెడ్డి కుమారులను సైతం భాగస్వామ్యం గురించి అడిగినందుకు తుపాకి పెట్టి బెదిరించారని వారే ఆరోపించారు. వారికి చేతిలో చిల్లర పెట్టి బయటకు గెంటేశారని వారే చెప్పారు. కేసు సైతం నడుపుతున్నారు.అంటే ఆ అక్రమానికి పునాది అక్కడే పడింది. ఆ తర్వాత ప్రజలను మోసం చేయడం,చట్టాలను మోసం చేయడం జరిగింది. కేవలం మీడియా ముసుగులో ఇంతకాలం రామోజీరావు ఆడుతున్న నాటకం బయటపడిపోయింది. తెరవెనుక ఉండి రాజకీయాలనడుపుతూ సమాజంపై గ్రిప్ పెంచుకుని ఢిల్లీ వరకు రాజకీయాలు నడుపుతున్నప్పటికి ఇదంతా గాలిబుడగ లాంటిదని తేలిపోయింది. ప్రజల సొమ్మును అడ్డుపెట్టుకుని అన్యాయంగా ఎంత పెరిగాడనేది తెలిసిపోతుంది. రేపు తెలంగాణ హైకోర్టు సుప్రీంకోర్టు డైరక్షన్ మేరకు ఏ ఏ డిపాజిట్లు ఎక్కెడెక్కడనుంచి వచ్చాయి ఏంటి అనేది విచారణ చేపడితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. నిత్యం నీతులు భోదిస్తారు. కాని ఆయన డిపాజిట్లన్నీ కూడా నగదు రూపంలోనే తీసుకుంటారు. బ్లాక్ మనీ ఎంత వైట్ చేశారో తెలియదు. ఖాతాదారుల పేర్లు ఉండవు. వైయస్సార్ హాయాంలో కూడా బయటకు వచ్చాయి. దురదృష్టవశాత్తు ఆయన చనిపోవడంతో కేసు పక్కకు వెళ్లింది.ఫైల్స్ పక్కకు వెళ్లాయి.ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు రామోజీరావు పలుకుబడి చూసి ఆయనతో గొడవెందుకని భావించాయి. 2014లో వచ్చిన చంద్రబాబు ఈ కేసును పట్టించుకోలేదు. హైకోర్టు డివైడైన సందర్భంలో రజని అనే సింగిల్ జడ్జి ద్వారాకేసు కొట్టేయించుకుని తాత్కాలికంగా రామోజీరావు బయటపడ్డారు. అందులో కూడా తప్పు జరిగిందని అంటున్నారు. ఆ తర్వాత ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీంకోర్టుకు వెళ్ళడం,ఏపి ప్రభుత్వం ఇంప్లీడ్ కావడం జరిగింది.నిత్యం ఉషోదయంతో సత్యం నినదించుకాక అని నినాదం పెట్టుకుని రాష్ర్టం అంతటికి నైతికత,నైతిక సూత్రాలు బోధిస్తూ ప్రపంచంలోనే అన్ని ధర్మాలు పాటించే వ్యక్తిగా రామోజిరావు గ్రూపుసంస్దలు ఏ పునాదులు మీదున్నాయని చూస్తే అన్ని అక్రమాలే అనేది స్పష్టం అవుతుందన్నారు. ఇది ఆందోళన కలిగించే అంశం అన్నారు.మాఫియాడాన్ లు,ఆర్దిక ఉగ్రవాదులు చట్టానికి దూరంగా ఉండి అక్రమాలు చేస్తుంటారు.కాని ఇక్కడ రామోజీరావు ఈ చట్టాలనే లొసుగులు వాడుకుని సమాజంలో పెద్ద వ్యక్తిగా ఎదగడంజరిగింది. ఈనాడు గ్రూపు,మార్గదర్శి లాంటి సంస్ధల భాగోతం అంతా బయటపడిపోతుంది. భవిష్యత్తులోమనం చట్టాలు చేసుకున్నా ఎంత జాగ్రత్తగా ఉండాలి.లేదా ఇలాంటి వాటికి అవకాశాలు ఎలా ఉన్నాయనే వంటి అంశాలు గురించి తెలియచేసే క్లాసిక్ కేసు అవుతుందని అన్నారు. రామోజీరావు అక్రమాలు బయటపడేకొద్దీ జగన్ గారిపై విషం గక్కుతున్నారు రామోజిీరావు అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడే కొలది సీఎం జగన్ గారిపై విషం గక్కుతున్నారన్నారు. సాక్షాత్తు కోర్టులోనే మాకు ఏపి ప్రభుత్వం వ్యతిరేకంగా ఉందని రామోజీరావు తన లాయర్ ద్వారా చెప్పారని తెలిసింది. అప్పుడు జడ్జిలుకూడా మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని వ్యాఖ్యానించారని తెలియవచ్చింది. చంద్రబాబు మాట్లాడేవన్నీటికి రచన ఈనాడులోనే జరుగుతుంది.వాటిని తెచ్చి చంద్రబాబు మాట్లాడతారు. వాటిని సోషల్ మీడియాలో నిజమనేలా దుష్ప్రచారం చేస్తారు. రాజకీయాలను శాసించడమే కాదు.చంద్రబాబును అర్జెంట్ గా గద్దెనిక్కించాలనే తపన కనపడుతోంది. మార్గదర్శి ఫైనాన్స్ పై తీర్పు వస్తే ఆ వార్త ఎక్కడా లేదు.ఇప్పుడు 2024 ఎన్నికలలో కూడా తన ప్రభావాన్ని చూపాలని ప్రయత్నిస్తున్నారు. ప్రజలు అంతా గమనిస్తున్నారు. వ్యవస్దలను సక్రమంగా నడవాలని చట్టాలను గౌరవించేలా ప్రజాస్వామ్యయుతంగా జగన్ గారు ముందుకు వెళ్తున్నారు.వాస్తవాలు బయటకు రావాలనే తాపత్రయం ఉంది. రామోజీరావుగారి మార్గదర్శి అక్రమాలైనా,చంద్రబాబు స్కిల్ స్కామ్ అయినా బయటకు తీసుకువస్తున్నారు. రాష్ర్టంలో టిడిపి వాళ్ళే హింసాయుత సంఘటనలకు పాల్పడతూ వాటి బురద వైయస్సార్ సిపిపైవేస్తున్నారని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సీఎం జగనే ఇలాంటివి అన్నీ చేస్తున్నాడని అబధ్దాలను పదే పదే ప్రచారాలు చేస్తే జనం నమ్ముతారని చంద్రబాబు ఆలోచన అన్నారు. మచిలీపట్నంలో వైసీపీ వాళ్లపై దాడిచేసింది టీడీపీనేనని,ఒంగోలులో గొడవ చేసింది టీడీపీ వాళ్లేనని అన్నారు. జగన్ గారు ప్రజాస్వామ్యబధ్దంగా ప్రజలలోకి వెళ్లి తాను చేసింది చెప్పి మధ్దతుగా ఉండమని అడుగుతున్నారన్నారు.చంద్రబాబు,పవన్ కల్యాణ్,పురందేశ్వరిలు ఏం చేయాలో తెలియక గంగవెర్రులు ఎత్తుతున్నారు. చిల్లర చేష్టలు ..వెకిలితనం పెరిగిపోయింది.చంద్రబాబు,పవన్,పురంధేశ్వరి రాబోయే తీర్పుకు ఇప్పట్నుంచే సాకులు వెతుక్కుంటున్నారు.నిజానికి ఎన్నికల కోడ్ వచ్చాక 2019 లో చంద్రబాబు ఎలా వ్యవహరించాడో మొన్ననే అందరికి చూపించాం. ఇప్పుడు సీఎంగా జగన్ మోహన్ రెడ్డి ఎలా వ్యవహరిస్తున్నారో మీరే గమనించండని అన్నారు. ప్రస్తుతం మా టీం బ్రహ్మాండంగా ఉందని అభ్యర్దులను మార్చాల్సిన స్దితి లేదని స్పష్టంచేశారు. అభ్యర్ధుల ఎంపిక మేం మూడు నెలల క్రితమే మొదలు పెట్టామని అన్నారు. రెండేళ్ల క్రితమే గడప గడప ద్వారా ఫీడ్ బ్యాక్ తీసుకున్నామని నాలుగునెలల క్రితం నుంచి చాలాచోట్ల అభ్యర్దులను ప్రకటించామన్నారు. శాస్త్రీయ పద్ధతిలో అభ్యర్థుల ఎంపిక జరిగింది....మా దగ్గర ఎలాంటి ఇబ్బందులు లేవని అన్నారు.ఓటమి భయంతో టిడిపి చంద్రబాబు సోషల్ మీడియాలో దుష్ప్రచారంచేస్తున్నారని అన్నారు.టిడిపిలా ఎత్తిపోయిన పార్టీ మాది కాదన్నారు.వారిలో వారికి పొత్తులు కుదరక నిత్యం అభ్యర్దులను మారుస్తున్నారని విమర్శించారు.వేరే పార్టీల నుంచి అభ్యర్దులు వచ్చారని ఇక్కడ మార్చే పరిస్దితి లేదన్నారు.మేం పకడ్బంధీగా ఎన్నికలకు వెళ్తున్నాం అన్నారు.నూటికి నూరు పాళ్లు విజయం వైయస్సార్ సిపిదే అని స్ఫష్టం చేశారు.