చంద్రబాబు ఏరు దాటాక తెప్పతగలేసే రకం

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి వైయ‌స్ జగన్ ను సీఎం చేయాలి: - డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు

ఎన్నికల సంగ్రామంలో వైసీపీ గెలిచే తొలి సీటు ఉత్తరాంద్ర నుంచే కావాలి:  ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ

విద్యావంత దళితుడినైన నన్ను  సీఎం వైయ‌స్ జగన్ రాజ్యసభకు పంపుతున్నారు

 వైయ‌స్ జగన్ మాట తప్పరు.. మడమ తిప్పరు.. ఇదే నిదర్శనం:  పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు

సీఎం వైయ‌స్‌ జగన్  అడుగులో అడుగు వేసి మళ్లీ ఆయన్నే సీఎంని చేసుకోవాలి:  అనకాపల్లి ఎంపీ సత్యవతి

బూతులు తిట్టడం తప్పితే అభివృద్ధి చేయలేని సైకో, శాడిస్టు, సన్నాసి అయ్యన్నపాత్రుడు,

సీఎం వైయ‌స్ జగన్ సహకారంతో రూ. 2700కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టా:  నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేశ్ 

న‌ర్సీపట్నం నియోజక వర్గంలో పోటెత్తిన సామాజిక సాధికార బస్సు యాత్ర

అనకాపల్లి జిల్లా:  నర్సీపట్నం నియోజకవర్గంలో వైయ‌స్ఆర్‌ సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర ఆద్యంతం అత్యంత ఉత్సాహం.. ఉత్తేజంతో ఉరకలేస్తూ  సాగింది.  జై జగన్.. జై జై జగన్ నినాదాల హర్షధ్వానాల హోరులో ప్రజలు నీరాజనాలు పలికారు. బస్సు యాత్రలో భాగంగా వైసీపీ ప్రజా ప్రతినిధులు మాకవరంపాలెంలోని మెడికల్ కాలేజీ నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం పలు అబివృద్ధి పనులను చూసి, సంక్షేమ పథక లబ్ధిదారులతో ముచ్చటించారు. బస్సు యాత్రకు రాాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు,  ప్రభుత్వ విప్, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, అనకాపల్లి ఎంపీ భీశెట్టి సత్యవతి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర కో ఆర్డినేటర్ వై వీ సుబ్బారెడ్డి, నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేశ్, పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మీతో పాటుగా పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలు కార్పొరేషన్ల చైర్మన్ లు హాజరయ్యారు. 

  ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే ఫ్యాన్ గుర్తుకే ఓటు: డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు

నర్సీపట్నం మెయిన్ రోడ్డులో జరిగిన బహిరంగ సభలో  డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ, నర్సీపట్నం నియోజకవర్గం అభివృద్ధి జరగలన్నా, జగన్ అన్న సంక్షేమం కొనసాగాలంటే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు దశాబ్ధాల కాలంలో చేయలేని అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేశ్ నాలుగున్నరేళ్ల కాలంలో చేయడం గర్వకారణమని వివరించారు. చంద్రబాబు తరహాలో ఏరు దాటాక తెప్ప తగలేయకుండా, ఇచ్చిన హామీల మేరకు కట్టుబడి పట్టుదలతో  సీఎం జగన్ రైతు, మహిళ, కార్మికులకు, విద్యార్థులకు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు. నాడు - నేడు ద్వారా కార్పొరేట్ పాఠశాలలను తలదన్నేలా రూపుదిద్దారని వివరించారు. డ్వాక్రా మహిళల రుణాలను మాఫీ చేస్తానని హామీ ఇచ్చి మోసం చేస్తే, జగన్ సీఎం అయిన తర్వాత నాలుగు విడతల్లో మాఫీ చేసి చూపించారని, ఆసరా, చేయూత పథకాలలో కూడా అదే విధంగా చర్యలు తీసుకున్నారని వివరించారు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఇచ్చిన మాట ప్రకారం వితంతు, వృద్ధాప్య పెన్షన్లు రూ. 3వేలకు పెంచనున్నారని, ఇప్పటివరకు రెండు వేలు చూపించే టీడీపీ నేతలకు,ఇక వృద్ధులు, వింతంతువులు మూడు వేళ్లూ చూపుతూ, రూ. 3 వేల పెన్షన్ ను గుర్తు చేయాలని కోరారు. నాలుగున్నరేళ్లగా సువర్ణవంతమైన పాలన చూసి మరోసారి జగన్ గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, అందుకే సామాజిక సాధికార యాత్రకు ప్రభంజనంలా జనం తరలివస్తున్నారని వెల్లడించారు. రూ. 5 లక్షల పరిమితి కలిగిన ఆరోగ్య శ్రీని సీఎం జగన్ ఏకంగా రూ. 25 లక్షలకు పెంచారని, పేదల ఆరోగ్యం పట్ల ఆయనకున్న ప్రేమ, ఆత్మీయతకు నిదర్శనమని పేర్కొన్నారు.  అయ్యనపాత్రుడు ఇంటికి వెళ్లాలంటే మూడు గేట్లు దాటి వెళ్లాలని, స్థానిక ఎమ్మెల్యే ఎక్కడుంటే అక్కడకి నేరుగా ఎవరైనా వెళ్లవచ్చునని  వివరించారు. నర్సీపట్నం శాసనసభ్యుడుగా మరోసారి పెట్ల ఉమా శంకర్ గణేశ్ ను గెలిపిస్తే, సీఎం జగన్ ఈసారి ఆయనకు ఎంతటి ఉన్నత స్థానం కల్పిస్తారో అంతా చూడవచ్చునన్నారు.

తొలి సీటు ఉత్తరాంద్ర నుంచే కావాలి:  ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ

ప్రభుత్వ విప్, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం రెండు లక్షల ముఫ్పై ఏడు వేల కోట్ల రూపాయల ఖర్చుచేసిన ముఖ్యమంత్రి దేశంలో జగన్ ఒక్కరేనని ఉద్ఘాటించారు. ఎన్నికల సంగ్రామంలో వైసీపీ గెలిచే తొలి సీటు ఉత్తరాంధ్ర నుంచే కావాలని,  ఉమ్మడి విశాఖలో గెలిచే తొలి సీటు నర్సీపట్నమే కావాలని పిలుపునిచ్చారు. నర్సీపట్నంలో ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేశ్ చేసిన అభివృద్ధి పనలు చూసి సామాజిక సాధికార యాత్రకు బంగాళాతం ఉప్పొంగేలా తరలివచ్చిన ప్రజానీకాన్ని చూసి టీడీపీ నేతలకు నిద్రపట్టబోదన్నారు, 

వైయ‌స్‌ జగన్ మాట తప్పరు.. మడమ తిప్పరు: పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు

పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు మాట్లాడుతూ, నా లాంటి విద్యావంతుడునైన దళితుణ్ణి రాజ్యసభకు పంపుతున్నందుకు ముఖ్యమంత్రి జగన్ కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని వ్యాఖ్యానించారు. జగన్ మడమ తిప్పరు.. మాట తప్పరు అనడానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. దశబ్ధాల కాలంగా  అణగారిన ఎస్సీ, ఎస్టీ, బీసీల అభ్యున్నతి కోసం జగన్ అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చారని, వచ్చే నెల 1 నుంచి రూ. 3 వేల పెన్షన్ ను వృద్ధులకు అందివ్వనున్నారని వెల్లడించారు. విజయవాడలో దాదాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని రూ. 500 కోట్లతో  వ్యయంతో ప్రతిష్టించిన జగన్,  అట్టహాసంగా ఆవిష్కరణ చేస్తుండటం దళితుల పట్ల  ఆయనకున్న ప్రేమ, అప్యాయతలకు నిదర్శనమన్నారు.  జగన్  కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాదని, ఆయన సంఘసంస్కర్తగా, రాజకీయ సంస్కర్తగా విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారని గుర్తు చేసారు. అనకాపల్లి  జిల్లాలో అన్ని సీట్లు గెలిచి సీఎం జగన్ కు కానుకగా అందిస్తామని ప్రకటించారు. 

వైయ‌స్ జ‌గన్ మళ్లీ  సీఎంని చేసుకోవాలి: అనకాపల్లి ఎంపీ సత్యవతి

అనకాపల్లి ఎంపీ భీశెట్టి సత్యవతి మాట్లాడుతూ, సీఎం జగన్ ఇచ్చిన మాట ప్రకారం నవరత్నాల హామీలను నెరవేర్చడమే కాకుండా  అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తూ ప్రతీ  కుటుంబంలో ఓ సభ్యునిగా నిలిచారని పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎలా రాష్ట్ర ప్రజల మనస్సుల్లో సుస్థిర స్థానం ఏర్పరుచుకున్నారని, సీఎం జగన్ కూడా ఆయన కుమారుడుగా మరో రెండు అడుగులు ముందుకేసి అభివృద్ధికి బాటలు జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. జగన్ అడుగులో అడుగు వేసి మళ్లీ మళ్లీ ఆయన్నే ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. 

సీఎం వైయ‌స్‌ జగన్ సహకారంతో రూ. 2700కోట్లతో అభివృద్ధి పనులు:నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేశ్

నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేశ్ మాట్లాడుతూ, సీఎం జగన్మోహన్ రెడ్డి సహకారంతో  రూ. 2700 కోట్ల రూపాయల వ్యయంతో నర్సీపట్నం నియోజకవర్గంలో అబివృద్ధి పనులు, రూ. 500కోట్లతో మెడికల్ కాలేజీ నిర్మాణం చేపట్టామని పేర్కొన్నారు. శాడిస్టు అయ్యన్నపాత్రుడు సైకోలా తయారై బూతులు మాట్లాడుతున్నారని, ఆయన లాంటి చెత్తనా కొడుకులు, సన్నాసులు మాట్లాడుతుంటే సిగ్గేస్తుందని అసహనం వ్యక్తం చేసారు. టీడీపీ హయాంలో విశాఖ వనరులను దోపిడీ చేసిన వారిలో అయ్యన్నపాత్రుడు ఒకడు కాదా అన్ని ప్రశ్నించారు.  2019 ఎన్నికల్లో 600 హామీలిచ్చి 60 హామీలు కూడా అమలు చేయలేని నాయకులు చంద్రబాబు, అయ్యన్నపాత్రుడు అని మండిపడ్డారు. అయ్యన్నపాత్రుడు మంత్రిగా ఉన్న కాలంలో శిలాఫలాకాలు వేయడం తప్పితే, ఎటువంటి అభివృద్ధి చేయలేకపోయారని ఎద్దేవా చేసారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని,  టీడీపీ, జనసేన కూటమిలో సీఎం అభ్యర్థి ఎవరో చెప్పాలని, ఎన్ని స్థానాలకు పోటీ చేస్తారో కూడా చెప్పాలని  సవాల్ చేసారు. 

పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మీ మాట్లాడుతూ, దేశంలో సామాజిక సాధికారతకు నిజమైన అర్థం తెచ్చినది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  మాత్రమేనని, గ్రామ పంచాయితీ  నుంచి రాజ్యసభ వరకు ఆచరణలో అమలు చేసి సాధించారని, చంద్రబాబు తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎనాడైనా చేయగలిగారా అని ప్రశ్నించారు. ఏజెన్సీ ముఖ ద్వారమైన నర్సీపట్నం ప్రాంతంలో గిరిజనులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు సీఎం జగన్ పెద్ద ఎత్తున నిధులు కేటాయించారని గుర్తు చేసారు.

Back to Top