ఆర్‌బీకే ఛాన‌ల్ ప్రారంభించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

తాడేప‌ల్లి:  రైతు సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్న సీఎం శ్రీ‌ వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మ‌రో కీల‌క‌మైన అడుగు వేశారు. రైతుల‌కు స‌మాచారం అందించ‌డ‌మే ల‌క్ష్యంగా ఆర్‌బీకే ఛాన‌ల్‌ను ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గురువారం క్యాంపు కార్యాల‌యంలో ప్రారంభించారు. రబీ ప్రొక్యూర్‌మెంట్‌ 2020–21 తో పాటు, 2021–22 ఖరీప్‌ సన్నద్ధతపై క్యాంప్ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష నిర్వహించారు. స‌మావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, వ్యవసాయ మిషన్‌ వైస్‌ ఛైర్మన్‌ ఎం వి యస్‌ నాగిరెడ్డి, వ్యవసాయశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ పూనం మాలకొండయ్య, సివిల్‌ సఫ్లైస్‌ కమిషనర్‌ కోన శశిధర్, మార్కెటింగ్, సహకార శాఖ స్పెషల్‌ సెక్రటరీ వై మధుసూదన్‌రెడ్డి, అగ్రికల్చర్‌ మార్కెటింగ్‌ కమిషనర్‌ ప్రద్యుమ్న, ఏపీ స్టేట్‌ సివిల్‌ సఫ్లైస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ వీసీ అండ్‌ ఎండీ  ఏ సూర్యకుమారి, ఇతర ఉన్నతాధికారులు హాజరు.

తాజా ఫోటోలు

Back to Top