పూటకో అబద్ధం..రోజుకో మోసం

చంద్రబాబు నైజాన్ని గ్రామాల్లో చెప్పండి..

సమర శంఖారావంలో వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి

చంద్రబాబు ప్రకటించిన రైతు రుణమాఫీ సొమ్ము ఇంకా అందలేదన్నా..నేడు పసుపు–కుంకుమ అంటూ రకరకాల పేర్లతో డబ్బులు పంచుతున్నాడన్నా, ఎలక్షన్‌ కోడ్‌ అమలులోకి వచ్చిందన్నా..దీని ఎలా అడ్డుకోవాలన్నా అని కార్యకర్తలు అడిగిన ప్రశ్నలకు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సమాధానమిచ్చారు. చంద్రబాబు చేస్తున్న మోసాలు ఒకటో , రెండు కాదు..పూటకో అబద్దం..రోజుకో మోసంగా ఆయన పాలన సాగుతోంది.చంద్రబాబు నైజం గురించి మీ గ్రామాల్లో  చెప్పండి. పసుపు–కుంకమ పేరుతో నిజంగా 10 వేలు ఉచితంగా డబ్బులు ఇవ్వాలనే తలంపు ఈ పెద్దమనిషి చంద్రబాబుకు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు ఎందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు.  కేవలం ఎన్నికల మూడు నెలలు ఉన్నాయనగా అక్కాచెల్లెమ్మలు,పసుపు–కుంకుమ స్కీం గుర్తుకు వస్తుందన్నారు. గుర్తొంచిన తర్వాత అక్కడ మోసమే..ఫిబ్రవరిలో ఒక æ చెక్కు ఇస్తారు..మార్చిలో ఒక చెక్కు ఇస్తారు. మూడో చెక్కు నాలుగు వేల రూపాయలు ఏప్రిల్‌లో ఇస్తానంటాడు.. ఏప్రిల్‌లో ఇచ్చే చెక్కు ఈయన ప్రభుత్వంలో ఉండదు. కొత్త ప్రభుత్వం వస్తోంది. కొత్త ప్రభుత్వంలో వాళ్ల స్కీం ఉంటాయి. ఇది జరగదనే ఉద్దేశంతోనే చెక్కులు ఇస్తాడు. రైతుల రుణామాఫీ అన్నాడు. ఐదేళ్లు టైం అన్నాడు..చివరికి మోసం చేశాడు.ఆయన ఇచ్చిన మాఫీ సొమ్ము రైతులకు వడ్డీలకు కూడా రాని విధంగా మోసం చేశాడు. ఎన్నికలు మూడు నెలలు ఉన్నాయనగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు.. అన్నదాత సుఖీభవ అంటూ మోసం చేస్తాడు. అశ్చర్యమేమిటంటే అన్నదాత సుఖీభవ స్కీం వచ్చేది ఆరవ బడ్జెట్‌లో..ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో కాదు. కొత్త ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఆయన బడ్జెట్‌లో ఈయన అన్నదాత సుఖిభవ స్కీం పెడతాడు. చేసే అవకాశం ఉన్నపుడు ఆయనకు గుర్తుకు రాదు. ఎన్నికల అయిన తర్వాత తన ప్రభుత్వంలో కాకుండా వేరే ప్రభుత్వంలో, వేరే బడ్జెట్‌లో ఈయన స్కీం పెడతారు.చంద్రబాబు మోసాలను అందరికి చెప్పాలిన బాధ్యత మీ భుజస్కందాలపై ఉందన్నారు

 

Back to Top