సీఎం వైయ‌స్ జగన్‌కు ప్ర‌ధాని మోదీ అభినందనలు..

ఏపీకి సంపూర్ణ సహకారం

శ్రీవారిని ద‌ర్శించుకోనున్న ప్ర‌ధాని మోదీ,గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌,సీఎం వైయ‌స్ జ‌గ‌న్
 

 తిరుపతి :  మరికాసేపట్లో ప్రధాని నరేంద్రమోదీ , గవర్నర్ నరసింహన్, సీఎం వైఎస్‌ జగన్ కలిసి శ్రీవారి దర్శించుకోనున్నారు .రేణిగుంట విమానాశ్ర‌యానికి చేరుకున్న ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీకి ఏపీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి స్వాగ‌తం ప‌లికారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో ఏపీలో బలమైన ప్రభుత్వం ఏర్పడిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌కు ఆయన అభినందనలు తెలిపారు. ఏపీ ప్రజల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఏపీకి అన్ని విధాల సంపూర్ణ సహకారం అందిస్తామని చెప్పారు. కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఏర్పడిందని, ప్రజలందరి ఆశయాలు, ఆకాంక్షలు నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు. 

తాజా వీడియోలు

Back to Top