నీ కొడుకులా వాలంటీర్లు తాగుబోతులు,తిరుగుబోతులు కాదు బాబు..!

మీడియా స‌మావేశంలో వైయ‌స్ఆర్‌సీపీ నేత పోసాని కృష్ణ మురళి 

జయప్రద జీవితాన్ని నాశనం చేశాడు.. ఎన్టీఆర్ భార్యను బజారుకీడ్చాడు

రంగా హత్య సందర్భంలో కమ్మ వారిపై దాడులు జరిగితే చంద్రబాబు ఎక్కడ దాక్కున్నాడు?
పోసాని కృష్ణమురళి

స్టేలపై బతుకుతున్న చంద్రబాబును జైళ్లో పెట్టండి అని పురందేశ్వరి లేఖలెందుకు రాయదు? 

మహిళా వాలంటీర్లపై అడ్డగోలు ఆరోపణలు చేసిన పవన్ క్షమాపణలు చెప్పాలి.

పవన్‌ ఇంత ఉన్మాదిగా తయారయ్యాడంటే.. ఇక ఆ దేవుడే కాపాడాలి

పోసాని కృష్ణ మురళి

తాడేప‌ల్లి: వాలంటీర్ల సేవలను చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని.. క్యాన్సర్‌ గడ్డ నిమ్మగడ్డతో ఫిర్యాదు చేయించి అడ్డుకున్నారంటూ వైయ‌స్ఆర్‌సీపీ నేత‌, ఏపీ ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ పోసాని కృష్ణమురళి మండిపడ్డారు. వాలంటీర్లు నిస్వార్థ సేవ చేస్తున్నారని, లోకేశ్‌లా వాలంటీర్లు వ్యవహరించడం లేదన్నారు.  బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.

 వైయ‌స్ఆర్‌సీపీ  నేత పోసాని కృష్ణమురళి ఇంకా ఏం మాట్లాడారంటే:

వాలంటీర్లు నీ కొడుకులా తాగుబోతులు,తిరుగుబోతులు కాదు బాబూ..!:
– కొన్ని వేల మంది ఆడపిల్లల జీవితాలను వాలంటీర్లు నాశనం చేస్తున్నారని చంద్రబాబు ఈ మధ్య కన్నీరు కార్చాడు. 
– మగ వాలంటీర్లు ఆయన దృష్టిలో గోతాలు మోసేవారట.  ఇంట్లో మగవాళ్ళు లేనప్పుడు వాలంటీర్లు తలుపు కొడతారని కూడా చంద్రబాబు మాట్లాడాడు. 
– వీళ్లు చాలా దుర్మార్గులు అని చంద్రబాబు తెగ బాధ పడిపోయాడు. 
– రాజమండ్రి జైళ్లో ఉన్నప్పుడు కూడా, అర్ధరాత్రి పూట లేచి వాలంటీర్లు ఇంట్లోని ఆడపిల్లలని ఏం చేస్తున్నారో అంటూ బాధపడ్డాడట. 
– ఆడపిల్లలంటే నాకంతటి మమకారం, ప్రేమ అంటూ చెప్పుకొస్తున్నాడు. 
– లక్ష్మీపార్వతి నాకు తల్లిలాంటిదంటూ కూడా చంద్రబాబు చెప్పుకొచ్చారు. మా అమ్మ అమ్మణ్ణమ్మ కంటే చాలా ఎక్కువగా ప్రేమిస్తానని కూడా అన్నాడు. 
– అలాంటి గొప్ప ఆడవాళ్లను, ఈ జగన్‌ గారి ప్రభుత్వంలో వాలంటీర్‌ వ్యవస్థను పెట్టి దుర్మార్గం చేస్తారా అని చంద్రబాబు ఏడ్చాడు.
– ఈ మగ వాలంటీర్లు నీ కొడుకు లోకేశ్‌లా తాగుబోతు కాదు..తిరుగుబోతులు కాదు..
– నీ కొడుకులా ఆంబోతు కాదు..లోఫర్‌ కాదు..బేవర్స్‌ కాదని చెప్పాను. 
– వాలంటీర్లు ఒక మనవడిలా, అన్నలా, బిడ్డలా ఉంటారు కానీ..నీ కొడుకులా ఓ పక్క పళ్లెం..మరో పక్క గొళ్లెం మెయింటేన్‌ చేయరు. 

జయప్రద జీవితాన్ని నాశనం చేశాడు.. ఎన్టీఆర్ భార్యను బజారుకీడ్చాడు:
– నారా చంద్రబాబు అనే వాడికి ఎంత సిగ్గు లేకుండా పోయిందంటే...జయప్రద లాంటి పెద్ద హీరోయిన్‌ను రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఆమె జీవితాన్ని నాశనం చేశాడు. 
– ఎన్టీఆర్‌ ఇల్లాలిని బజారుకు ఈడ్చాడు. ఇదంతా చంద్రబాబు అండ్‌ కో.. హయాంలోనే జరిగింది. 
– అరేయ్‌ రామోజీ అనడంలో తప్పేమి లేదు. మేమిద్దరం చాలా క్లోజ్‌. 
– రోజూ పత్రికలో లక్ష్మీపార్వతి దుష్టశక్తి అని రాతలు రాసి ఆమె జీవితం నాశనం చేశాడు రామోజీ. 
– కిలాడి రాధాకృష్ణ..డెబ్బై ఏళ్ల ఎన్టీఆర్‌ ఇల్లాలిని..ముప్పై ఏళ్ల కుర్రాడితో అంటగట్టాడు. 
– టీవీ5 వాడు నేరుగా లక్ష్మీపార్వతి వేశ్య అని గంటగంటకూ లైవ్‌ ఇచ్చాడు. 
– వీళ్లందరికీ ఆడదంటే చాలా చీఫ్‌. బాలకృష్ణ మాటలే దానికి నిదర్శనం. 
– ఆడది కనిపిస్తే ముద్దు పెట్టాలి..లేదంటే కడుపు చేయాలని బాలకృష్ణ అంటాడు. 
– చంద్రబాబు కొడుకు తాగుతాడు..తిరుగుబోతు. అతను ఎలాంటి వాడో, ఆడదంటే ఎంత నిర్లక్ష్యంగా ఉంటాడో అందరికీ తెలుసు. 
– అలాంటి వారిని  వైయ‌స్ఆర్‌సీపీ లో చూపించగలరా? జగన్‌ గారి గురించి ఒక్క మాటైనా చెప్పగలరా? 
– ఈ దొంగ వెధవలను అసలు నమ్మవద్దు. రామోజీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలను నమ్మవద్దు. 
– వాళ్ల ఏడుపు ఏంటంటే..వైయ‌స్ జగన్‌ గారిని దించాలి. దింపడానికి పైకైనా పంపిద్దాం..ఏమైనా చేద్దాం అనేది వాళ్ల ఆలోచన. 

వేల కోట్లు దిగమింగిన సుజనా గురించి కరపత్రాలు పంచుతా:
– మా కులంలో ఒక కోటరీ ఉంది. ప్రతీ సారీ ఇదే గోల. జగన్‌ గారిని సైకో అంటారు. జగన్‌ గారిని అరేయ్‌ అంటాడు. 
– ఇలాంటి వాళ్లను తిట్టకుండా ఎలా ఉంటాం. పోసానికి కమ్మ కులంలో పుట్టి బుద్ధిలేదు అంటారు. 
– కమ్మ కులంలో పుట్టినందుకు నేను గర్వంగా ఫీల్‌ అవుతా..కానీ కమ్మ కులంలో నేను స్నేహం చేయాలంటే అతను కూడా మంచివాడై ఉండాలి. 
– వాడు వెధవ అయి ఉంటే స్నేహం చేయలేం. 
– ఒక కమ్మ వాడు దొంగ, అవినీతిపరుడు అయితే అతన్ని ప్రశ్నించకూడదా? 
– కమ్మ వాడైన సుజనా చౌదరి రూ.5,700 కోట్లు తిన్న మోసగాడు అని మరో కమ్మ వాడు రాధాకృష్ణ గ్రాండ్‌గా రాశాడు. 
– అటువంటి కిలాడి విజయవాడ వెస్ట్‌లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు. 
– అలా రాసిన రాధాకృష్ణను తిట్టడం లేదు కానీ..నన్నెందుకు తిడుతున్నారో ఆ కమ్మ వారు సమాధానం చెప్పాలి. 
– ఇతను కమ్మ వాళ్లను తిడుతున్నాడు కాబట్టి, వాళ్లబ్బాయికి మనం పిల్లనివ్వొద్దని కూడా మాట్లాడుకున్నారు. 
– మా ఇంటికి రావాల్సింది కమ్మ కులం కాదు..కోడలు రావాలి. 
– అది కమ్మ కావచ్చు..రెడ్డి, కాపు, మాల, మాదిగ కావచ్చు..కావాల్సింది మంచి వాళ్లై ఉండాలి. 
– మీరన్నట్లే కులం అంటే...రామోజీ కుల గురువు కదా..మన కమ్మ వాడి గురించి సుజనాత్మక రుణం అంటూ ఎందుకు రాతలు రాశాడు? 
– అంటే ఎంత దొంగైతే అంతగా మనం ప్రేమిస్తామా? 
– సుజనా చౌదరి అనే వ్యక్తి పరమ లోఫర్, దొంగ, కబ్జాదారు..ఇలాంటి వాళ్లను తిట్టాలంటే కొత్త భాష కనిపెట్టాలి. 
– సుజనా చౌదరి గురించి, అతని అక్రమాల గురించి నేను విజయవాడలో ప్రతి ఇంటికి కరపత్రాలు పంచుతా. 
– వేల కోట్లు తిని దున్నపోతులా,  మహారాజులా విజయవాడ వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు..మనం ఓట్లు వేస్తామా? 
– ఇలాంటి దొంగలను మనం కులం పేరిట ఎందుకు వదిలేయాలి? 
– ఇతని కంటే నంబర్‌ వన్‌ కిలాడి..నారా చంద్రబాబునాయుడు. 
– చంద్రబాబు ప్రారంభంలో నాకంటే పేదవాడు..నాకంటే చిన్న ఇళ్లు. అలాంటి వ్యక్తి లక్ష కోట్లు ఎలా సంపాదించాడు? 
– అయినా రామోజీరావు ఆయన గురించి రాయడు..ఎందుకంటే వెయ్యి కోట్లు రాంగ్‌రూట్లో గురువు గారికి వెళ్లిపోయాయి. 
– ఇలాంటి దొంగలను నమ్మవద్దు. 
– ఉన్న వాళ్లలో మనకు ఉన్న బెస్ట్‌ సీఎం జగన్‌ గారు. అతనేం నా కులం కాదు. 
– నా బంధువు కాదు..క్లాస్‌మేట్‌ కాదు..నాకేమీ డబ్బులు ఇవ్వలేదు. కావాలంటే నార్కో టెస్ట్‌ చేయించుకోవచ్చు. 
– అతని క్యారెక్టర్‌ చూసే 14 ఏళ్లుగా ఆయన వెంట తిరిగి, సొంత బ్రదర్‌లా చూస్తున్నాడు. 
– కమ్మ నాయకుడిని ఎందుకు తూ అంటున్నాను అంటే అతని బ్యాడ్‌ క్యారెక్టర్‌ కాబట్టి. 

రంగా హత్య సందర్భంలో కమ్మ వారిపై దాడులు జరిగితే చంద్రబాబు ఎక్కడున్నాడు?:
– మన కులపోడు మనకు ఏం చేశాడు? విజయవాడలో రాజకీయ భవిష్యత్తు కోసం ప్లాన్‌ చేసి రంగా గారిని చంపించేశాడు. 
– అప్పుడు విజయవాడలో మూడు, నాలుగు రోజులు స్వైర విహారం జరిగింది. 
– ఎంతో మంది కమ్మ ఆడపిల్లలు చనిపోయారు..మానం పోయింది..ముక్కలు ముక్కలుగా నరికేశారు. 
– అప్పుడు చంద్రబాబు మన కులం కోసం పరుగెత్తుకుంటూ వచ్చాడా? అతను హైదరాబాద్‌లో దాక్కున్నాడు. 
– హైదరాబాద్‌లో తలుపులేసుకుని దాక్కుంటే ఇక్కడ కమ్మ వాళ్లు ప్రాణాలు పోగొట్టుకున్నారు. 
– విజయవాడలో కమ్మ వాళ్లు ఏడుస్తూ పారిపోయారు. 
– డాక్టర్‌ శ్రీహరి అనే వ్యక్తిని ముక్కలు ముక్కలుగా నరికేశారు. 
– వామ్మో మమ్మల్ని, మా బిడ్డల్ని కాపాడండి..అని కమ్మ వాళ్లు ఎంత మంది దీనంగా ఏడ్చారో..? ఇంకా మనకు సిగ్గులేదా? 
– మన కులం వారిని చంపేశారా అని ఏనాడైనా చంద్రబాబు వచ్చాడా? 
– ఎక్కువ మంది కమ్మ వాళ్లు చచ్చిపోతే..వాళ్లు మనకు అనుకూలంగా ఉంటారని రాలేదు. 
– చనిపోయిన కమ్మ వాళ్ల ఇంటికి నాడు చంద్రబాబు ఎందుకు రాలేదు..? తెలుసుకోండి. 
– నేను దండం పెట్టి చెప్తున్నా...తెలుసుకోండి. మీరు తప్పులు చేస్తున్నారు. 
– కమ్మ అయితే..రెడ్డి అయితే ఏంటి..మనకు కావాల్సిన మంచి చేస్తున్నారా లేదా అనేది గుర్తించండి. 
– కానీ చంద్రబాబు అనే వాడు మాత్రం ముఖ్యమంత్రికి సూటబుల్‌ కాదు. 

చంద్రబాబు,నిమ్మగడ్డల నిర్వాకానికి 35 మంది వృద్ధులు చనిపోయారు:
– వాలంటీర్లను పెట్టి ఇంటికే వృద్ధులకు రూ.3వేలు పింఛను ఇస్తుంటే కన్నుకుట్టి నిమ్మగడ్డను అడ్డం పెట్టుకుని ఆపించాడు. 
– నిమ్మగడ్డో..క్యాన్సర్‌ గడ్డో తెలియదు కానీ వీరు చేసిన నిర్వాకానికి 35 మందికి పైగా చచ్చిపోయారు. 
– ఇది తప్పుకదా? లబ్ధిదారుల్లో కమ్మ వారు లేరా? తెలుగుదేశం, జనసేన పార్టీల వారు లేరా? 
– పథకాలు తీసుకుంటే కమ్మ వాళ్లు కూడా జగన్‌కు ఓటు వేస్తారని మీ భయం అన్నమాటా? 
– వీలుంటే మన కమ్మ వాడికి చెప్పండి..నువ్వు కూడా మంచి పని చేయండి అని చెప్పండి. 
– ఈ కమ్మ ఇలా ఉంటే..మరో కమ్మ పురందేశ్వరమ్మ వచ్చింది. 

బాబు, సుజనా, సీఎం రమేష్ ల దోపిడీ గురించి లేఖలు రాయవేంః
– నారా చంద్రబాబే ఒక టైపు మనిషంటే..ఈమె వందరకాల మనిషి. 
– ఈమె ఎప్పుడెప్పుడు జగన్‌ నాశనం అవుతాడు..ఎప్పుడెప్పుడు ఇతన్ని కుర్చీలోంచి దింపేయాలి అనేది ఆమె తపన. 
– ఒకప్పుడు ఈమె కుటుంబం వైఎస్సార్సీపీలో చేరింది. ఇప్పుడు బీజేపీ సూటబుల్‌గా ఉంది వెళ్లారు. 
– ఆమెకు భావజాలం అనవసరం. సావర్కర్‌ అంటే సునీల్‌ గవాస్కర్‌ అనుకుంటుంది. 
– ఆమె మరిది చంద్రబాబును అర్జంటుగా కుర్చీలో కూర్చోబెట్టాలనేదే ఆమె లక్ష్యం. 
– వ్యవస్థలను అడ్డం పెట్టుకుని చంద్రబాబు- జగన్‌ను జైళ్లో కూర్చోబెడితే..సుప్రీం కోర్టుకు వెళ్లి ఆయన బయటకు వచ్చారు. 
– ఇప్పుడీమె సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌కు లేఖ రాసింది. ఇక్కడ జగన్‌ అధికారం అనుభవిస్తున్నాడు...వెంటనే జైళ్లో పడేయండి అంటున్నారు. 
– అమ్మా..పురందేశ్వరి..ఈ డప్పా సుజనా చౌదరి గురించి ఎందుకు ఢిల్లీకి లేఖ రాయలేదు? 
– మన కమ్మ వాడనా? నీకు 500 కోట్లు నీ ముఖాన కొట్టాడనా? 
– అతను ఎప్పటి నుంచో ఇంటర్నేషన్‌ బ్యాంకులకు కూడా టోకరా వేశాడు..ఇప్పుడు ఎమ్మెల్యే సీటిచ్చారు..ఇతన్ని కూడా పట్టుకోండి అనలేదేం? 
– మా మరిది ఎంతో కాలంగా స్టేలపై బతుకుతున్నాడు..అతన్ని కూడా జైళ్లో పెట్టండి అని ఎందుకు అడగలేదు? 
– సీఎం రమేష్‌ నీ కళ్ల ముందే బీజేపీలోకి వచ్చాడుగా. అతనిపై కేసులు చాలా పెండింగ్‌ ఉన్నాయిగా..? మీరెందుకు లేఖ రాయలేదు? 
– కేవలం జగన్‌ మీదే ఎందుకు లేఖ రాశారు? కుళ్లు, ఏడుపు..మన కమ్మ వాడు కాదని ఏడుపు. 
– ఇతన్ని ఇలా వదిలేస్తే ఇంకా మంచిపనులు చేసి పెద్ద వాడై మోడీని మించి పోతాడేమోనని భయం. 
– మా మరిది సీఎం సీట్లు కూర్చోలేడేమోనని, జగన్‌ను అర్జంటుగా జైళ్లో పెట్టాలని వీళ్ళంతా అంటున్నారు. 
– జగన్‌ను ఎలా నాశనం చేయాలా అని, చింతామణి, పల్నాటి యుద్ధం, బాలనాగమ్మ నాటకాల్లో లేడీ క్యారెక్టర్లలా ఈమె దాపురించింది. 
– పురందేశ్వరి నువ్వు వైజాగ్‌లో నిలబడితే కనీసం డిపాజిట్లు కూడా రాలేదు..అదీ నీ కెపాసిటీ. 
– కనీసం మనిషిగా బతుకు. జగన్‌ను జైళ్లో పెట్టాలంటున్నావు..అంటే నీకు సుప్రీం కోర్టు కంటే ఎక్కువ తెలుసా? 
– ఇవన్నీ నీకు చంద్రబాబే నేర్పిస్తున్నాడు కదా? 
– జగనే మళ్లీ ముఖ్యమంత్రి కావాలని స్వచ్ఛందంగా వస్తున్న ప్రజలను ఏ ఒక్క చోటా నేను చూడలేదు. 
– ఇందిరాగాంధీకి కూడా ఇలా మద్దతు రాలేదు. 
– నిన్నగాక మొన్న వచ్చిన జగన్‌ గురించి క్లియర్‌గా ఆ..ఆలు రాని వారు కూడా తెలుసుకున్నారు. 
– ప్రజలారా, మీరు అదే మాటమీద ఉండండి. జగన్‌ ఒక బెస్ట్‌ సీఎం. 
– మీకు బిడ్డలా, సేవకుడిలా ఉండి మీకు మంచి పనులు చేస్తాడు. 
– ఆంధ్రప్రదేశ్‌ను బాగా నిలబెడతాడు..ఇంకెవ్వరినీ నమ్మకండి. 

బాబు మాటలు వింటే ప్రజలు నాశనం అవుతారు:
– వాలంటీర్లకు పదివేలు ఇస్తానన్నాడా? అతను పదివేలు ఇస్తాడని, పోసాని పాతిక వేలు ఇస్తానన్నాడని వింటే ప్రజలు నాశనం అయిపోతారు. 
– నారా చంద్రబాబునాయుడు 2014లో 600కు పైగా హామీలు ఇచ్చాడు. 
– ఆకాశం నుంచి చుక్కల్ని తెచ్చిపెడతాను అని కూడా అంటాడు. 
– ఆ 600 హామీల్లో ఒక్కటైనా మీకు ఇస్తే..మీరు సంతోషంగా ఆయనకే ఓటు వేయవచ్చు. 
– అతనెప్పుడు హామీలను నెరవేర్చడానికి కాదు..ఎప్పుడు తాను, తన కొడుకు ఈ సీట్లో కూర్చోవాలి అనేదే ఆలోచిస్తాడు.
– ఎప్పుడూ ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను ఎలా తిట్టాలనేదే ఆలోచిస్తాడు. 
– ఎవరైనా మాల కులంలో పుట్టాలనుకుంటారా? కమ్మ కులం అంటేనే అగ్రకులం అన్న వెదవ చంద్రబాబు. 
– అదే ఎస్సీ సోదరుడు కమ్మ వాళ్లలో పుట్టాలని ఎవరు అనుకుంటారు అని అంటే నువ్వు తల ఎక్కడ పెట్టుకుంటావు? 
– మనుషులను, కులాలను, మతాలను తిడుతున్నావు..కనీసం సిగ్గుండాలి. 
– లక్ష కోట్లు తిన్నారు..ఇక చాలు..నువ్వూ, నీ కొడుకు ఏ దేశమైనా తీర్థయాత్రలకు వెళ్లిపోండి. 
– ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలంతా సంతోషంగా బతుకుతారు. 
– హీరోయిన్‌గా ఉన్న జయప్రదకు మంత్రి పదవి ఇస్తానంటే ఎంతో కష్టపడి పనిచేశారు. ఆ తర్వాత ఆమెను కూడా మోసం చేశాడు. 

గేదెలు కాచుకునే వారు కూడా పవన్ లా మాట్లాడరు:
– చిరంజీవి విరాళాలు ఇచ్చే లోపే ఎన్నెన్నో జరిగిపోతున్నాయి కదా? 
– అదొక పార్టీ, ఒక కూటమి...అనుకునే లోపే ఇచ్చిన సీట్లలో కూడా తన వాళ్లను పెట్టుకోలేకపోయాడు కదా? 
– వాళ్ల తమ్ముడు కదా..డొనేషన్‌ ఇచ్చి ఉంటారు. 
– ఆడపిల్ల వైపు కన్నెత్తి చూశారో కన్ను కుట్టేస్తాను అన్నాడు. 
– ఆయనకు నిఘా చెప్పిందని వాలంటీర్లు ఆడపిల్లలను ట్రాఫికింగ్‌ చేస్తున్నారు అన్నాడు. 
– గేదెలు కాచుకునే వాడు కూడా ఈ మాటలు మాట్లాడడు. అతనికి కూడా అమ్మ, అక్క అంటే ఏంటో తెలుసు. 
– అలాంటిది తాను ఒక పార్టీ పెట్టాడని వాలంటీర్లను, ఆడపడుచులను వ్యభిచారం, అక్రమసంబంధాలని నిర్ధయగా అన్నాడంటే ఇంకేం చెప్తాం? 
– ఆ నిఘా ఎవడో పేరు చెప్పమంటే చెప్తాడా? ఏ ఆడపడుచును చూసి ఈ మాట అంటున్నావా? 
– ఎస్సీ, ఎస్టీ, బీసీ ఆడపడుచులకు అక్రమ సంబంధాలు ఉన్నాయని అన్నావా?
– రెండు లక్షల పుస్తకాలు చదివినానన్నావ్‌..ఏపీలో దేవతల్లాంటి  వాలంటీర్ల ఆడపడుచుల్ని ఇలా మాట్లాడటం తగునా? 
– చివరికి లెప్రసీ వ్యాధి వారికి కూడా సేవ చేస్తున్న దేవతలని అలాంటి మాటలు అంటావా? 
– సారీ చెప్పమండి..ఇప్పుడు మీరు సారీ చెప్పమంటున్నారు అంటే..నిజంగానే తప్పు చేసినట్లే అంటాడు. 
– రేపు నా ఇంట్లో వాళ్లని, సొంత అన్న చిరంజీవి ఇంట్లో వాళ్లను కూడా తిట్టొచ్చు. 
– ఇంత ఉన్మాదిగా అతను తయారయ్యాడంటే ఇక దేవుడే కాపాడాలి. 

Back to Top