తాడేపల్లి: మాచర్ల మాజీ ఎమ్మెల్యే, పల్నాడు జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధినేత శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డితో మంగళవారం భేటీ అయ్యారు. అక్రమ కేసులో అరెస్టయి రిమాండ్‌లో ఉన్న ఆయన ఇటీవల బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే. తనపైన, తన సోదరుడిపైన టీడీపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులు, మాచర్ల నియోజకవర్గంలో, పల్నాడు జిల్లాలో టీడీపీ అరాచకాలను పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ సందర్భంగా వైయస్ జగన్‌కు వివరించారు. తప్పుడు కేసులపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, చట్టపరంగా ఎదుర్కొందామని వైయస్ జగన్ ఆయనకు భరోసా ఇచ్చారు. ప్రజల పక్షాన చేస్తున్న పోరాటంలో ఎదురయ్యే ఆటంకాలు, వేధింపులను దీటుగా ఎదుర్కొని ప్రజలకు అండగా నిలుద్దామని, పార్టీ నాయకులు, శ్రేణులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జగన్ అభయమిచ్చారు. వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, పిన్నెల్లి కుమారుడు వైయస్ జగన్‌ను కలిసిన వారిలో ఉన్నారు.