తాడేపల్లి: చంద్రబాబు ఇచ్చే హామీలను నమ్మేస్దితిలో ప్రజలు లేరని,గతంలో ఆయన హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయడంతో విశ్వసనీయత కోల్పోయారని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలో వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు.వారు ప్రస్తావించిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. శ్రీ వైయస్ జగన్ విశ్వసనీయత కలిగి ఉన్నారని గత నాలుగున్నర సంవత్సరాలలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీంటిని నెరవేర్చడంతోపాటు పేదరికం స్దాయిని రాష్ర్టంలో తగ్గించగలిగారని తెలియచేశారు.రాష్ర్ట ప్రజలు శ్రీ వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిగా మరింతకాలం కొనసాగాలని కోరుకుంటున్నారు.కాని చంద్రబాబుకు త్వరగా అధికారం కావాలి కాబట్టి జగన్ ను మార్చాలంటూ విమర్శలు చేస్తున్నారని అన్నారు.జగన్ గారికి పేదలంటే ప్రేమ,వారి కష్టాల పట్ల సానుభూతితో పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు.చేసే ప్రతి చర్య లో జగన్ గారి వ్యక్తిత్వం కనిపించింది.దానికి వాళ్లు అహంకారం అని పేరు పెడితే సరిపోతుందా అని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ రాకపోతే టిడిపి మీటింగ్ కు ప్రజలు రారనే స్దితి చంద్రబాబుది. తెలుగుదేశం పార్టీ నిన్నటి మీటింగ్ కు పవన్ కల్యాణ్ హాజరు కాకపోతే జనం హాజరుకారనే దుస్దితికి 40 ఏళ్ళ ఇండస్ర్టీ అయిన చంద్రబాబు చేరుకున్నారు.రెండుచోట్ల ఓడిపోయిన పవన్ కల్యాణ్ పక్కన లేకపోతే తనకు వాల్యూలేదనే విధంగా చంద్రబాబు ఉన్నారు.పవన్ రాకుంటే ఇంటికి వెళ్లి కాళ్లా వేళ్లా పడి ఒప్పించుకుని సభకు రప్పించుకున్నారు.ఒక గ్రూప్ ఫోటో దిగడంలో బాగంగా క్యాడర్ లో విశ్వాసం కలిగించేందుకు ఓ ప్రయత్నం అనేది నిన్న రెండు,మూడు గంటలు జరిగిన సభలో కనిపిస్తోంది.అంతకంటే మేమంతా కలిసి కట్టుగా ఉన్నాం అనేది తెలియచెప్పాలనేది కూడా కనిపించింది. లోకేష్ పాదయాత్రలో ప్రజల కన్నీళ్లు కనిపించాయని,వారి కష్టాలు తెలిసాయని అంటున్నారు. మరి లోకేష్ మంత్రిగా పనిచేసినప్పుడు,టిడిపి అధికారంలో ఉన్నప్పుడు అవి ఎందుకు కనపడటం లేదో చెప్పాలని ప్రశ్నించారు. జనసేన,టిడిపి అద్యక్షులు ఇద్దరు వారి మైత్రి కలకాలం కొనసాగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.వారిద్దరు వారి పార్టీ నేతలకు చెప్తారు అది ఏమంటే అధిష్టానం నిర్ణయాలకు వారు కట్టుబడి ఉండాలంటారు.అంటే వారికే నమ్మకం లేదు అని ఎద్దేవా చేశారు.రాజకీయపార్టీగా ఉండాలంటే లా అండ్ ఆర్డర్,పరిపాలన చేసిన పనులు అన్నీ కూడా కనబడుతుంటాయి.దానివల్ల నష్టపోయిన వర్గాలు ఉంటాయి.ఇంప్రెస్ అయ్యే వర్గాలు బ్లెస్సింగ్స్ ఇస్తాయి.నీవు ఏంటి అనేది పార్టీ విధానంలోనే తెలుస్తున్నప్పడు కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కడ వస్తుంది. 2014-19మధ్య చంద్రబాబు బాగా పనిచేశాడని పవన్ బావిస్తే 2019 లో ఎందుకు సపోర్ట్ చేయలేదు.ఆయన ఎందుకు పవన్ తో విడిపోయాడో చంద్రబాబు చెప్పడంలేదు.లేదా పవన్ అయినా 2019లో విడిపోయాడో చెప్పడం లేదు.అంటే తెరవెనుక ఒప్పందాలు ఏవో ఉన్నాయనుకుంటా అని అన్నారు.అలాంటివి కుదిరిఉంటే ప్రజలు ఎందుకు వారిని గౌరవించాలి.వారికి పూర్తిగా స్వార్దప్రయోజనాలతో కూడినవి. టిడిపి హయాంలో జన్మభూమి కమిటీలు ఎలా దోచుకున్నాయో అందరికి తెలుసు అన్నారు.పవన్ కల్యాణ్ కు పొత్తు గురించే తెలియదు. ఎన్ని సీట్లు ఇస్తున్నారో తెలియదు.నిన్న మాటలను బట్టి చూస్తే చంద్రబాబును సీఎం ను చేయాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నట్లు అర్దమైంది.అలాంటప్పుడు పార్టీ ఎందుకు..... తెలుగుదేశం పార్టీకి రాష్ర్ట అధ్యక్షుడుగా పవన్ ను పెడితే బాగుంటుంది.అదే జనానిికి చెప్పవచ్చు. టిడిపిలో జనసేనను కలపచ్చు.యువగళం వేదికపై వారి వాలకం,తడబాటు చూస్తే అందరికి అర్దమవుతుంది.అసలు ముఖ్యమంత్రి చంద్రబాబు అవుతారా,లోకేష్ అవుతారా అనేది ఇంతవరకు తెలియదు.నిన్నటి సభ అంతా చూస్తే రాష్ర్ట ప్రజలను మోసం చేసి తిరిగి అధికారంలోకి రావడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. చంద్రబాబు పాలనలో ప్రజలకు ఏం చేశారో చెప్పండి.మిమ్మల్ని ఎందుకు ఎన్నుకోవాలో చెప్పండి. చంద్రబాబుకు 2014 లో అవకాశం ఇచ్చినప్పుడు ప్రజలకు ఏం చేసారో చెప్పగలరా...ఆయన పాలనలో ప్రజలకు చేసిన మేలు ఏంటి...ఆ ఐదు సంవత్సరాలలో చంద్రబాబు తెచ్చిన స్కీములు ఏమున్నాయి...ఆ స్కీములు ఏమీ లేవు... ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయక మోసం చేశారు కనుకనే చంద్రబాబును,తెలుగుదేశం పార్టీని ప్రజలు చెత్తబుట్టలో పడేసారు.ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం,గ్యాస్ సిలిండర్లు అని చెబితే ప్రజలు నమ్ముతారా....గతంలో పేదలకు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తానని అవి ఇవ్వకుండా చంద్రబాబు చేసిన మోసాన్ని ప్రజలు మరిచిపోలేదు. రైతులకు 84 వేల కోట్ల రుణాలను మాఫీ చేస్తానని మోసం చేసిన విషయం మరిచిపోలేదు.ఇప్పుడు అధికారం కోసం తిరిగి హామీ లు ఇస్తే ప్రజలు నమ్ముతారనుకోవడం భ్రమ. చంద్రబాబు కొత్తతరహాలో హామీలు ఇస్తున్నారు.అయినా చంద్రబాబు ఏమైనా కొత్తగా రాజకీయాలలోకి వచ్చి హామీలు ఇస్తున్నారా. ప్రజలను మభ్యపుచ్చేందుకు ముఖ్యంగా పచ్చమీడియాలోని రామోజీరావు,రాధాకృష్ణలాంటి వాళ్లు చేస్తున్న కుయుక్తులు ఇవి.వారికి చంద్రబాబు త్వరగా అధికారంలోకి రావాలని భావిస్తున్నారు. వస్తే తిరిగి దోపిడీకి తెగబడవచ్చని వారి ప్లాన్.నిజానికి రాష్ర్ట ప్రజలు అందరూ ముఖ్యమంత్రి గా వైయస్ జగన్ గారు కొనసాగాలని భావిస్తున్నారు. వైయస్ జగన్ అహంకారి అంటూ పచ్చమీడియా దుష్ప్రచారం చేస్తుంది. ఆయన అమలు చేస్తున్న ప్రతి కార్యక్రమం పేదలకు ప్రయోజనం కలిగించేదే అని అన్నారు. ఉద్యోగాల కల్పన వైయస్ జగన్ గారికే సాధ్యం. ఉద్యోగాల కల్పన విషయంలో పచ్చమీడియా దుష్ప్రచారం చేస్తున్నప్పటికి వాస్తవాలు ప్రజలకు తెలుసు. శ్రీ వైయస్ జగన్ అధికారంలోకి రాాాగానే సచివాలయ వ్యవస్ధ ఏర్పాటుద్వారా 1.30 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన విషయం వాస్తవం కాదా..ఇప్పుడు వారంతా ప్రభుత్వ ఉధ్యోగులుగా పనిచేస్తున్న విషయం కళ్లకు కనిపించడంలేదా...వైద్య,ఆరోగ్యశాఖకు సంబందించి దాదాపు 50 వేల ఉద్యోగాలను భర్తీ చేసిన విషయం అందరికి తెలుసు. ఇంకా అవుట్ సోర్సింగ్,కాంట్రాక్ట్ ఉద్యోగాలను భర్తీ చేశారు.టీచర్ల కు సంబంధించి అనేక ఉద్యోగాలు దశాబ్దాల తరబడి పెండింగ్ లో ఉన్నసమస్యలను పరిష్కరించి ఉద్యోగాలను ఇచ్చారు.అవన్నీ కలిపితే దాదాపు ఆరున్నర లక్షల ఉద్యోగాలవరకు ఉన్నాయి. ఇవన్నీ వాస్తవాలు. పచ్చమీడియా దుష్ప్రచారం చేస్తే నమ్మరు. ప్రజలే ఆ ప్రచారాన్ని తిప్పికొడతారు.చంద్రబాబు కేవలం తన హయాంలో 30 వేల ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేసాడు. నిరుద్యోగ భృతి అంటూ నిరుద్యోగులను మభ్యపెట్టారు.తిరిగి అదే వాగ్దానం చేస్తున్నారు.ఇవన్నీ నమ్మడానికి ప్రజలు గతంలో చంద్రబాబు చేసిన మోసాన్ని మరిచిపోలేదు.ఇది చంద్రబాబు,లోకేష్ లు గుర్తిస్తే మంచిది. జగన్ గారి పరిపాలనలో రాష్ర్టంలోని కోటి 47 లక్షల కుటుంబాలకు మేలు కలుగుతోంది.విద్య,ఆరోగ్యం,వ్యవసాయం అంశాలలో అన్నివర్గాల ప్రజలకు ప్రయోజనాలు ఉన్నాయి.అందుకే టిడిపి,జనసేనలలో డెస్పరేషన్ కనిపిస్తోంది. పక్క పార్టీ వాళ్ళు అవసరం మాకు ఏముంది వైయస్ఆర్‌సీపీకి సంబంధించి నియోజకవర్గ సమన్వయకర్తల మార్పులు హడావిడిగా జరగవని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 2 ఏళ్ల ముందు నుండి ఈ పక్రీయ జరుగుతుంది. మార్పులపై ఎప్పటి నుండో సీఎం వైయస్ జగన్ ఎమ్మెల్యే లకు సూచనలు చేస్తున్నారు. గడపగడపకు మన ప్రభుత్వం సమీక్షల సందర్బంలో చాలాసార్లు వారికి తెలియచేశారు. ఎవరికైనా టికెట్ ఇవ్వలేక పోతే నేరుగా వాళ్ళకి చెప్పి నిర్ణయం తీసుకుంటున్నారు. తెలుగుదేశం-జనసేన పొత్తుకు ఈ మార్పులకు ఏమాత్రం సంబంధం లేదు..ఎన్నికల ముందు జరిగే పక్రియే ఇది అని స్పష్టం చేశారు. తెలంగాణా ఎన్నికలకు కూడా సంబందం లేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ముఖ్యంగా క్షేత్రస్దాయిలో ప్రజల మన్ననలను పొందిన వారికే అవకాశం ఉంటుందని అందుకే కొన్ని మార్పులు చోటుచేసుకుంటున్నాయని వివరించారు. రానున్న ఎన్నికలకు మంచి టీమ్ తో వెళ్తామని అన్నారు.టిడిపి లేదా ఇతర పార్టీలనుంచి వైయస్ఆర్‌సీపీలో టిక్కెట్లు కేటాయించే అవకాశం ఉందా అనే అంశంపై మాట్లాడుతూ మా పార్టీలోనే చాలా మంది ఉన్నారు.. పక్క పార్టీ వాళ్ళు అవసరం మాకు ఏముంది అని ప్రశ్నించారు.