తాడేపల్లి: ఉక్రేయిన్‌లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విద్యార్థులను క్షేమంగా తీసుకొచ్చే బాధ్యత తమదేనని స్లోవేకియా ప్రతినిధి పండుగాయల రత్నాకర్ పేర్కొన్నారు. ఉక్రేయిన్ సరిహద్దు నాలుగు దేశాలకు నలుగురు ప్రత్యేక ప్రతినిధులను ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నియమించినట్లు తెలిపారు. ఉక్రేయిన్‌లో ఉన్న ఏపీ ప్రజలను, కేంద్ర ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ అక్కడి వారిని క్షేమంగా రాష్ట్రానికి చేర్చుస్తామని రత్నాకర్ మీడియాకు వెల్లడించారు. మా అంచనాల మేరకు ఉక్రేయిన్‌లో దాదాపు 600 మంది విద్యార్థులు ఉన్నట్లు చెప్పారు. అక్కడ ఉన్న వారిని క్షేమంగా తీసుకువచ్చేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందన్నారు. అక్కడ ఉన్న వారితోనూ, కేంద్ర ప్రభుత్వంతోనూ సమన్వయం చేసుకుంటూ ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్ ఆధ్వర్యంలో ఒక సెల్ ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఉక్రెయిన్ సరిహద్దులో ఉన్న నాలుగు దేశాలతో సమన్వయం చేసుకుంటుంది. అక్కడి నుంచి ఏపీకి విద్యార్థులకు తీసుకువచ్చేందుకు తాము కృషి చేస్తున్నామని రత్నాకర్ వెల్లడించారు.