వ‌రద బాధితులకు తక్షణ సాయం అందించాలి

 ముంపు ప్రాంతాన్ని పరిశీలించిన పి. గన్నవరం నియోజకవర్గ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు

 మామిడికుదురు: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం నియోజకవర్గంలోని మామిడికుదురు మండలం అప్పనపల్లి ఉచ్చులపేట బాబా నగర్‌లో వరద తీవ్రత అధికంగా ఉండటంతో వైయస్సార్‌సీపీ నాయకులు ముంపు ప్రాంతాన్ని సందర్శించి బాధితులను పరామర్శించారు. పి. గన్నవరం నియోజకవర్గ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బాధితుల పరిస్థితిని పరిశీలించిన నాయకులు, ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గన్నవరపు శ్రీనివాసరావు మాట్లాడుతూ, వరద బాధితుల కోసం తక్షణమే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి, వారికి అవసరమైన ఆహారం, తాగునీరు, నిత్యావసర వస్తువులు అందించాలని కోరారు. అలాగే ప్రతి రేషన్ కార్డుదారునికి రూ.3,000 చొప్పున తక్షణ ఆర్థిక సాయం అందించి బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ పర్యటనలో నాయకులు బత్తుల జనార్ధనరావు, రాష్ట్ర కార్యదర్శి జక్కంపూడి వాసు, తుల గోపాలకృష్ణ, నెల్లి దుర్గాప్రసాద్, వాసంశెట్టి రామకృష్ణ, నక్క బాలకృష్ణ, బాలెం రమేష్, పాలమూరి గోపాల్, ఏసు నాయుడు, కౌశిక్ తదితరులు పాల్గొన్నారు.
 

Back to Top