ఏపీలో మొట్ట మొద‌టి ఆక్సిజ‌న్ ఉత్ప‌త్తి కేంద్రం ప్రారంభం

హిందుపూర్‌లో ఆక్సిజ‌న్ ప్లాంట్‌ను ప్రారంభించిన మంత్రి శంక‌ర్ నారాయ‌ణ‌

అనంత‌పురం:  ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో మొట్ట మొద‌టి ఆక్సిజ‌న్ ఉత్ప‌త్తి కేంద్రం ప్రారంభ‌మైంది.  అనంత‌పురం జిల్లా హిందూపురం ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో నిర్మించిన ఆక్సిజ‌న్ ప్లాంట్‌ను మంత్రి శంక‌ర్ నారాయ‌ణ‌, ఎంపీ గోరంట్ల మాధ‌వ్‌, ఎమ్మెల్సీ ఇక్బాల్ ప్రారంభించారు. డీఆర్‌డీఏ, ఎన్‌హెచ్ఏఐ స‌హ‌కారంతో ప్ర‌భుత్వ ఆసుప‌త్రి ఆవ‌ర‌ణ‌లో ఆక్సిజ‌న్ ఉత్ప‌త్తి ప్లాంట్‌ను నిర్మించారు. వారం రోజుల్లో ఆక్సిజ‌న్ అందుబాటులోకి రానుంది. రోజుకు వెయ్యి లీట‌ర్ల ఆక్సిజ‌న్ ఉత్ప‌త్తి చేసే సామ‌ర్థ్యం ఈ ప్లాంట్‌కు ఉంద‌ని మంత్రి శంక‌ర్ నారాయ‌ణ తెలిపారు.

Back to Top