యూకేలో ఘ‌నంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు

వైయ‌స్ఆర్‌సీపీ ఎన్ఆర్ఐ టీమ్‌ ఆధ్వర్యంలో ముందస్తు సంబరాలు

తాడేప‌ల్లి: పుంగనూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని వైయ‌స్ఆర్‌సీపీ యూకే ఎన్ఆర్ఐ టీమ్‌ ఆధ్వర్యంలో ముందస్తు  వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీమ్‌ సభ్యుడు మేకల శివారెడ్డి నేతృత్వంలో కేక్ క‌ట్ చేసి సంబ‌రాలు చేసుకున్నారు. శివారెడ్డి మాట్లాడుతూ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సుదీర్ఘకాలంగా ప్రజా జీవితంలో ఉంటూ ప్రజలకు అందిస్తున్న సేవలను కొనియాడారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ, పుంగనూరు నియోజకవర్గ అభివృద్ధికి ఆయన కృషి చేశారని శివారెడ్డి పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకోవడం, అవసరమైన సహాయ సహకారాలు అందించడం, మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేయడం ద్వారా ప్రజల్లో ప్రత్యేక అభిమానాన్ని సంపాదించుకున్నారని తెలిపారు.

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయురారోగ్యాలతో మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని, ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం కలగాలని ఆకాంక్షిస్తూ ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూకే ఎన్నారై టీమ్‌ సభ్యులు ఆకాష్‌, కొమ్మ నందారెడ్డి, చందు, యోగి తదితరులు పాల్గొన్నారు.

Back to Top