పట్టపు నాగేశ్వరరావు మరణం వైయ‌స్ఆర్‌సీపీకి తీరని లోటు

వైయ‌స్ఆర్‌సీపీ జోన్‌-3 ప్రచార విభాగం అధ్యక్షురాలు మైలా రత్నకుమారి 

కృష్ణా జిల్లా: వైయ‌స్ఆర్‌సీపీ సీనియర్‌ నాయకుడు, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు, దేవస్థానం మాజీ చైర్మన్‌ పట్టపు నాగేశ్వరరావు మరణం పార్టీకి తీరని లోటని వైయ‌స్ఆర్‌సీపీ జోన్‌-3 ప్రచార విభాగం అధ్యక్షురాలు మైలా రత్నకుమారి అన్నారు. పట్టపు నాగేశ్వరరావు దశదిన కార్యక్రమంలో మైలా రత్నకుమారి పాల్గొని, ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పిస్తూ, ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని ఓదార్చారు. పట్టపు నాగేశ్వరరావు మరణం పార్టీకి, ఆయనను అభిమానించే వారికి తీరని లోటని మైలా రత్నకుమారి పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు వైయ‌స్ఆర్‌సీపీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.

Back to Top