ప్రకాశం జిల్లా: ఒంగోలు ఎమ్మెల్యేగా ఆరో సారి గెలిచి నేను సిక్క్ కొట్టబోతున్నానని మాజీ మంత్రి, ఒంగోలు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు . ఏడోసారి ఒంగోలు బరిలో నిలబడ బోతున్నాను.. సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆరోసారి ఒంగోలులో గెలవ బోతున్నాను అన్నారు. ఒంగోలు అసెంబ్లీ వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఒంగోలు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించిన ఆయన.. రిటర్నింగ్ అధికారి జీవీ సుబ్బారెడ్డికి రెండు సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ..టీడీపీ అధికారంలోకి వస్తే పథకాలు పోతాయని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. ఎక్కడ చూసినా జగనన్న నినాదాలు వినబడుతున్నాయన్నారు. ఎన్నికలు పక్షపాతం లేకుండా అధికారులు నిర్వహించాలని కోరారు. మరోవైపు వైయస్ఆర్ సీపీ క్యాడర్ ను టీడీపీ రెచ్చగొట్టాలని చూస్తోందని మండిపడ్డారు. గతంలో.. మాదిరిగానే తాను ఈ సారి గెలిస్తే.. ఒంగోలుకు ఏం చేస్తాను ముందుగానే ప్రకటించే బాలినేని శ్రీనివాస్ రెడ్డి.. ఈ సారి కూడా కొన్ని హామీలు ఇచ్చారు.. నేను గెలిస్తే ఒంగోలులో ప్రజలకు డైలీ తాగునీరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, విద్యుత్ వంటి వాటిని ప్రజలకు అందించడమే నా ప్రధాన ఎజెండగా పెట్టుకున్నాను అని ఈ సందర్భంగా మాజీ మంత్రి, ఒంగోలు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ వైయస్ఆర్‌సీపీ అభ్యర్ధి చెవిరెడ్డి భాస్కరరెడ్డి.. పలువురు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు.