తాడేపల్లి: చంద్రబాబులా కాళ్లూ చేతులూ అడ్డుపెట్టి తుపానును మళ్లించలేమని రాష్ట్ర అగ్రిమిషన్ వైస్ ఛైర్మన్, వైయస్ఆర్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు పల్లెలకు, రైతులకు పూర్తి వ్యతిరేకమని ఆయన మండిపడ్డారు. ఆయన నేలమీద నడవడు. ఆయనదంతా హైటెక్ సిద్ధాంతమని అభివర్ణించారు. నాలుగేళ్లుగా కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంటే పట్టిసీమతో పనేంటి అని ప్రశ్నించారు. గేట్లు కొట్టుకుపోవడం మీ నిర్వాకం వల్ల కాదా చంద్రబాబూ? అని నాగిరెడ్డి నిలదీశారు. చంద్రబాబు తలకిందులుగా తపస్సు చేసినా రైతులు నమ్మరని పేర్కొన్నారు. ప్రజలకు పనిచేసిన ప్రభుత్వం..ఎప్పుడూ ప్రజలతోనే ఉంటుందని ఎంవీఎస్ నాగిరెడ్డి తెలిపారు. రాష్ట్ర అగ్రిమిషన్ వైస్ ఛైర్మన్, పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి మీడియా మాట్లాడారు. బాబులా తుపానును మళ్లించడం మా వల్ల కాదు: చంద్రబాబు తుపాను, కరవు అంశాలపై ఉన్మాదిలా మాట్లాడుతున్నాడు. చంద్రబాబులా మేమైతే కరవును జయించాం..కాళ్లు చేతులు అడ్డుపెట్టి తుపానును అడ్డుకున్నాం అని చెప్పడం మాకు చేతనైన పనికాదు. హుద్ హుద్ తుపానులో చంద్రబాబు తెల్లవారుజాములూ డ్యాష్‌బోర్డు వద్దే కూర్చుని తుపానును మళ్లించి నష్టం లేకుండా చేశారని పచ్చ పత్రికల్లో వార్తలు రాశారు. ప్రధాని వచ్చి రూ.వెయ్యి కోట్లు ప్రకటిస్తే...ఈయన మాత్రం రూ.3వేల కోట్ల నష్టం అని నివేదికలు ఇచ్చారు. తుపానులను డైవర్ట్ చేయడం మానవమాతృలకు సాధ్యమేనా..? ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు అందులో ముందుగా వ్యవసాయ రంగం దెబ్బతింటుంది. చంద్రబాబుకు మాదిరిగా ఫోటోలకు ఫోజులిచ్చి తుపానునంతా తానే జయించాననే కబుర్లు జగన్ గారికి చేతకాదు. యంత్రాంగాన్ని మొత్తాన్ని కదిలించి యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేయించాలి. విద్యుత్ అంతరాయం వస్తే 24 గంటల్లోనే పునరుద్ధరణ చేశాం. బాధితులను ఇంటికి పంపించే ముందే వారికి పరిహారం ఇచ్చి పంపాము. చంద్రబాబులా నెలలు తరబడి పెండింగ్ పెట్టలేదు. ఆయనలా పలుగు పార బట్టి మీడియా ముందులా చంద్రబాబులా విన్యాసాలు చేయడం మాకు చేతకాదు. తాను ఏం చెప్పినా సరే రాసే మీడియా ఉంది కదా అని చంద్రబాబు ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడు. సంక్షోభాలను అవకాశంగా మార్చుకుంటానని చంద్రబాబే చెప్తుంటాడు. ఇలాంటి విపత్తు ఎప్పుడొస్తుందా అని ఆ పచ్చ బ్యాచ్ ఎదురు చూస్తూ ఉంటుంది. అది కరవైనా, తుపాను అయినా, గోదావరి పుష్కరాల్లో జనం చనిపోయినా ఆయన దాన్ని కూడా అవకాశంగా మార్చుకుంటారు. చంద్రబాబులా కేంద్రానికి తప్పుడు లెక్కలు చూపించడం లేదు: చంద్రబాబులా ఊహల్లో కాకుండా వాస్తవంలో జీవిస్తారు మా ముఖ్యమంత్రి. మిగ్‌జాం తుపానులో ముందుగా అధికారులను అప్రమత్తం చేసి ముఖ్యమంత్రిగా జగన్ గారు సహాయక చర్యలను మానిటర్ చేశారు. తుపాను తగ్గిన తర్వాత ఫీల్డ్ విజిట్ చేసి జరిగిన నష్టాన్ని పరిశీలించారు. బాధితులకు భరోసా ఇచ్చారు. నష్టం ఎంత జరిగిందో చూసి డిజాస్టర్ మేనేజ్‌మెంట్ నుంచి కేంద్రానికి ప్రాథమిక నివేదిక పంపుతాం. అప్పుడు కేంద్ర బృందాలు వస్తాయి..వాస్తవ నష్టాన్ని పరిశీలించి అంచనా వేస్తాయి. ఇవన్నీ క్రమబద్ధంగా జరిగాయి. ఈ రోజు కూడా కేంద్ర బృందం పర్యటించింది. ముఖ్యమంత్రి గారిని కూడా కలవనున్నారు. కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేశాం. తడిసిన, రంగుమారిన ధాన్యాన్ని కూడా మేం కొనుగోలు చేస్తున్నాం. రాష్ట్రంలో డిజాస్టర్ మేనేజ్‌మెంట్ విధి విధానాల ప్రకారం 103 మండలాలను కరవు మండలాలుగా గుర్తించాం. దీన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలిపాము. కేంద్రబృందం వచ్చి రాయలసీమలో పర్యటించి వెళ్లింది కూడా. మిగ్‌జాం తుపానుకు సంబంధించి ప్రాథమికంగా రూ.3,711 కోట్లు నష్టం వాటిల్లినట్లు కేంద్రానికి నివేదించాం. చంద్రబాబులా తప్పుడు లెక్కలు చూపడం, కేంద్రానికి రకరకాల మాయ చేసే పనులు మేం చేయం. హుద్ హుద్ తుపాను సమయంలో చంద్రబాబు కేంద్రానికి ఇచ్చిన నివేదికలో మహారాష్ట్రలో చనిపోయిన మృతదేహాన్ని చూపెట్టి రూ.3వేల కోట్ల నష్టం అని కేంద్రానికి నివేదిక ఇచ్చాడు. దాన్ని కేంద్ర ప్రభుత్వం పట్టుకుని రూ.600 కోట్లు ఇచ్చి సరిపెట్టారు. అలాంటి మోసాలు ఈ ప్రభుత్వానికి, జగన్ గారికి చేతకాదు. రైతులకు జరిగిన నష్టానికి ప్రతిఫలం అందితేనే న్యాయం జరుగుతుంది. నిర్మాణాత్మకమైన ప్రతిపక్షమైతే లోటుపాట్లు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. రాజకీయాలు వేరు..తుపానులు వేరు...కానీ చంద్రబాబు చేసేదంతా రాజకీయాలే. పంట నష్టం అంచనాలు చాలా పారదర్శకంగా జరుగుతున్నాయి. 19వ తేదీకి జాబితా కూడా ఆర్బీకేల్లో పెడతాం. సోషల్ ఆడిట్ అయిన తర్వాత నివేదిక ప్రభుత్వానికి ఇవ్వాలని ఆదేశించారు. చంద్రబాబుదంతా హైటెక్ సిద్ధాంతమే: చంద్రబాబుకు పల్లె అన్నా, రైతులన్నా పూర్తి వ్యతిరేకమే. ఆయన గాల్లో మేడలు కడతాడు...నేలమీద నడవడు. ఆయనదంతా హైటెక్ సిద్ధాంతం. 31 రకాల వ్యవసాయ ఉత్పత్తులకు ధరలు పెంచాను..శ్వేతపత్రం విడుదల చేయండి అంటున్నాడు. తిత్లి తుపానులో నష్టం జరిగింది ఉద్యానపంటలకైతే...ఆయన ధాన్యానికి ధర పెంచాను అని ఇప్పటికీ గొప్పలు చెప్పుకుంటున్నాడు. ఉద్దానంలో నష్టపోయిన పంటలకు రూ.182.63 కోట్లు జగన్‌గారు వచ్చిన తర్వాత చెల్లించారు. విపత్తుల్లో వ్యవసాయ భూముల్లో మేట వేసిన మట్టి, ఇసుక తొలగించేందుకు చంద్రబాబు హెక్టారుకు రూ.12 వేలు ఇవ్వగా..ఇప్పుడు మేం రూ.18వేలకు పెంచాం. వర్షాధార భూముల్లో పంటలు నష్టోపోతే హెక్టారుకు రూ.6,800 నుంచి రూ.8,500 చేసింది. నీటి పారుదల భూముల్లో నష్టపోయిన పంటలకు హెక్టారుకు గతంలో రూ. 13,500 ఇస్తే..ఇప్పుడు మేం రూ.17,000 అందిస్తున్నాం. వరి, పత్తి, చెరకు, వేరుశనగ వంటి పంటలకు గతంలో రూ.15,000 ఇవ్వగా..ఇప్పుడు రూ.17,000లకు పెంచారు. మామిడి, నిమ్మ జాతి పంటలకు రూ.20వేల నుంచి రూ.22,500, మల్బరీకి రూ.4,800 నుంచి రూ. 6,000 పెంచాం. గతంలో గేదెలు, ఆవులు మరణిస్తే రూ.30 వేల నుంచి రూ.37,500కి పెంచారు. గొర్రెలు, మేకలు గతంలో రూ.3వేల పరిహారం ఇస్తే ఇప్పుడు రూ.4వేలు ఇస్తున్నారు. మత్స్యకారుల బోట్లు పాక్షికంగా దెబ్బతింటే గతంలో రూ.4,100 ఇస్తే..ఇప్పుడు రూ.6,000లకు పెంచారు. వలలు పాక్షికంగా దెబ్బతింటే రూ.2,100 నుంచి రూ.3వేలకు పెంచారు. బోట్లు పూర్తిగా దెబ్బతింటే కొత్త బోట్ల కోసం సాయాన్ని రూ.9,600 నుంచి రూ.15వేలకు పెంచారు. పూర్తిగా దెబ్బతిన్న వలలకు రూ.2,600 నుంచి రూ.4వేలకు పెంచారు. దీన్ని ఏమంటారు చంద్రబాబూ..సాయం పెరిగినట్లా..తగ్గినట్లా..? తప్పుడు రాతలు రాస్తున్న పచ్చ పత్రికలు కూడా ఈ వాస్తవాలను గమనించాలి. 4వ తేదీన వర్షాలు ప్రారంభం అయ్యాయి. అప్పటికి సివిల్ సప్లయిస్ ద్వారా 5.09 లక్షల టన్నుల కొనుగోలు ఉంది. 4,5,6 తేదీల్లో వర్షాలు కురిసినా రోజు 50 టన్నుల ధాన్యం ఆఫ్‌లైన్లో కొనుగోలు చేశాం. ఈ రోజుకు ధాన్యం సేకరణ 13.29లక్షల టన్నుల ధాన్యం సేకరణ జరిగింది. అంటే తుపాను సమయంలో సుమారు 5.20 లక్షల టన్నుల సేకరణ జరిగింది. నాలుగేళ్లుగా కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంటే పట్టిసీమతో పనేంటి?: పట్టిసీమ అనేది ప్రాజెక్టు కాదు చంద్రబాబూ...లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం.. 25 శాతం నీ బినామీలకు అదనపు అంచనాలతో టెండర్లు ఇచ్చి చేసిన స్కీం అది. అది ఏపీ ప్రభుత్వం ద్వారా జరిగింది. చంద్రబాబు సొంతానికి చేసింది కాదు. నాలుగేళ్ల నుంచి పట్టిసీమ వాడలేదు అంటూ మాట్లాడుతున్నాడు. నాలుగేళ్ల నుంచీ కృష్ణా నదిలో భారీగా నీళ్లు ప్రవహిస్తుంటే..సముద్రంలో కలుస్తుంటే పట్టిసీమ నుంచి నీళ్లు తోడలేదంటావా? రాజశేఖరరెడ్డి గారు ప్రారంభించిన పులిచింతల ప్రాజెక్టు వల్ల గత నాలుగేళ్ల నుంచి చక్కటి పంటలు పండాయి. ఈ ఏడాది అదే పులిచింతల, పట్టిసీమల ద్వారా నీళ్లిస్తేనే డెల్టాలో మంచి దిగుబడులు వచ్చాయి. ఇంత వరకూ ఎప్పుడూ లేని దిగుబడులు ఈ ఖరీఫ్‌లో వచ్చాయి. దురదృష్టవశాత్తు తుపాను వచ్చింది. గేట్లు కొట్టుకుపోవడం మీ నిర్వాకం వల్ల కాదా?: చంద్రబాబు హయాంలో వర్షాలు లేక ప్రాజెక్టుల ఎండిపోయి షట్టర్లన్నీ తుప్పు పట్టిపోయాయి. మీరు మెయింటినెన్స్ చేయకపోవడం వల్లే ఇప్పుడు కొట్టుకుపోతున్నాయి. ప్రాజెక్టుల పేరుతో కమీషన్లు వచ్చే మట్టి పనులు తప్ప మీరు చేసిందేంటి..? ఒక్క ప్రాజెక్టును మీరు పూర్తి చేశారా? ఇప్పుడు జగన్ గారి హయాంలో అవి పూర్తవుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. తుపాను వచ్చినా, కరవు వచ్చిన ఆ సంక్షోభం నుంచి రాజకీయంగా మైలేజ్ తెచ్చుకోవచ్చని చూసే వ్యక్తి చంద్రబాబు. భారత దేశంలో రైతులను అతిపెద్ద స్థాయిలో మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు. చంద్రబాబు తలకిందులుగా తపస్సు చేసిన రైతులు ఆయన్ని నమ్మరు. 2018–19లో ఖరీఫ్, రబీలో కరవు మండలాలను ఎగ్గొట్టిన వ్యక్తి చంద్రబాబు. 2019 రబీలో రైతుల బీమాలో కేంద్ర ప్రభుత్వ వాటా చెల్లించినా..రాష్ట్ర ప్రభుత్వ వాటా చెల్లించని వ్యక్తి చంద్రబాబు. మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్ముతారు అనుకోవద్దు. 2004లో మీరు ఇలానే మాట్లాడారు...ఇప్పుడూ అలానే మాట్లాడుతున్నారు. మీరు అధికారంలోకి రావడం కాదు..ఇప్పుడున్న సీట్లు నిలుపుకుంటే చాలా ఎక్కువ. ప్రజలకు పనిచేసిన ప్రభుత్వం ఎప్పుడూ ప్రజలతోనే ఉంటుంది.