ఉల్లి రైతులకు ఇంత అన్యాయమా?

వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎంవీఎస్ నాగిరెడ్డి

తాడేప‌ల్లి:  ఉల్లి రైతుల‌కు కూట‌మి ప్ర‌భుత్వం అన్యాయం చేస్తుంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎంవీఎస్ నాగిరెడ్డి మండిప‌డ్డారు. ఈ మేర‌కు శ‌నివారం ఆయ‌న ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. రాష్ట్రంలో కేవలం 66 వేల ఎకరాలలో ఉల్లి సాగు చేస్తున్నార‌ని, ఇందులో కర్నూలు 45 వేలు, వైయ‌స్ఆర్‌ కడప జిల్లాలో 11,500, నంద్యాల 7.8 వేల ఎక‌రాల్లో సాగు చేస్తున్నార‌ని తెలిపారు. ఈ మూడు జిల్లా లలో మాత్రమే సాగు జరిగి గత 50 సంవత్సరాలలో లేని సంక్షోభం ఉల్లి రైతుకు వస్తే  మొట్టమొదట కిలో రూ.12 కొంటామని చెప్పి కేవ‌లం 6వేల క్వింటాళ్ళు మాత్రమే కొనుగోలు చేసి అన్యాయం చేశార‌న్నారు.  ఎకరానికి 7 నుంచి 8 టన్నుల ఉల్లి ఉత్పత్తి వస్తుంద‌ని,  ప్రభుత్వ యంత్రాంగం అంచనా 6 టన్నులు మాత్ర‌మే అన్నారు. ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన విధంగా ఎక‌రానికి  రూ.72 వేలు ఇవ్వాల్సి ఉంద‌న్నారు. అయితే గిట్టుబాటు ధ‌ర లేక‌, ప్ర‌భుత్వం కొనుగోలు చేయ‌క ఉల్లి పంట‌ను పొలంలోనే వ‌దిలివేయాల్సిన దుస్థితి నెల‌కొంద‌న్నారు.  

Back to Top