ప్రజాస్వామ్యమంటే చంద్రబాబుకు లెక్కే లేదు

అమరావతి: ప్రజాస్వామ్యమన్నా, ఎన్నికల సంఘమన్నా చంద్రబాబుకు లెక్కలేదని  వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి ఎంవీఎస్‌ నాగిరెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన ఎన్నికల అధికారి ద్వివేదిని కలిశారు. ప్రభుత్వ ధనాన్ని చంద్రబాబు పార్టీ ధనంగా వాడుకుంటున్నారని సీఈవోకు ఫిర్యాదు చేశారు. పథకాల పేరుతో నా తరఫు డబ్బు ప్రజలకు చేరవేశానని చంద్రబాబు చెప్పుకుంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. విశాఖ సభలో చంద్రబాబు ఎన్నికల ప్రలోభాలపై బహిరంగంగా మాట్లాడటాన్ని ఎన్నికల సంఘం దృష్టికి  తీసుకెళ్లారు. ప్రజాస్వామ్యమన్నా, ఎన్నికల సంఘమన్నా చంద్రబాబుకు లెక్కలేదని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు అందాలంటే టీడీపీకి ఓటేయాలని ఒత్తిడి తెస్తున్నారని, సెర్ప్‌ సీఈవో టీడీపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
 

Back to Top