కొత్త‌మాంబ ఆల‌యాన్ని నిర్మిస్తా

వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి
 

విశా: విశాఖ బీచ్ రోడ్డులో పోలమాంబ, భూలోకమాంబ, కొత్తమాంబ ఆలయ నిర్మాణనికి వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ఇవాళ‌ శంకుస్థాపన చేశారు. మత్స్యకారుల కుల దేవతలైన అమ్మవార్ల ఆలయాన్ని గ్రానైట్ తో నేనే స్వయంగా కట్టిస్తానని ఆయ‌న‌ హామీ ఇచ్చారు. ఈ మేర‌కు విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

ఇక ఆ శ్రీరామచంద్రుడే చూసుకుంటారు..
ఇచ్చిన మాట ప్రకారం నాలుగు నెలల్లోనే రామతీర్ధం శ్రీ కోదండ రాముని ఆలయ పుననిర్మాణం పూర్తి చేసిన‌ట్లు విజ‌య‌సాయిరెడ్డి తెలిపారు. రూ.3 కోట్ల వ్యయంతో బోడికొండపై పాత ఆలయం ఉన్న చోటే పునర్నిర్మాణం - అదనపు వసతులు కల్పన. ఆలయాలు, విగ్రహాలతో రచ్చ చేయాలనుకునే వారిని ఇక ఆ శ్రీరామచంద్రుడే చూసుకుంటార‌ని విజ‌య‌సాయిరెడ్డి మ‌రో ట్వీట్ చేశారు.
 

Back to Top