యజమాని ఆజ్ఞాపిస్తేనే ప్యాకేజీ స్టార్ బీజేపీ చుట్టూ తిరుగుతున్నాడు

వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి
 

 అమరావతి:  టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ లపై వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. యజమాని ఆజ్ఞాపిస్తేనే ప్యాకేజీ స్టార్ బీజేపీ చుట్టూ తిరుగుతున్నాడని ఎద్దేవా చేశారు. బాబు రాష్ట్ర బీజేపీని తన కనుసన్నల్లో నడిపించే ప్రయత్నాల్లో భాగంగానే ముందుగా పావలాను పంపించాడని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కమలానికి పొత్తు వల్ల ఎలాంటి ప్రయోజనం లేకపోయినా తన సైకిల్ పార్టీకి మేలు జరిగేలా చూసుకోవాలనేది బాబు ఎత్తుగడ అని విజయసాయి ట్విట్టర్ వేదికగా విమర్శించారు.

Back to Top