ఇది వైయ‌స్ జగన్ భరోసా అంటే..!

వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌

విశాఖ‌:  విద్యా రంగంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తీసుకువ‌స్తున్న విప్ల‌వాత్మ‌క మార్పుల‌తో రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు భ‌రోసా ల‌భిస్తోంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు. ప్రభుత్వ స్కూళ్లలో సీట్లు లేవు అనే బోర్డులు ఏ రాష్ట్రంలో కనిపించవు. సీఎం వైయ‌స్ జగన్ గారు శ్రీకారం చుట్టిన విప్లవాత్మక మార్పులకు సంకేతం స్కూళ్ళు కిటకిటలాడటం. బాబు డెకాయిటీ పాలనలో టీచర్‌కు ఐదుగురు విద్యార్థులు కూడా లేని స్కూళ్లు ఎన్నో కనిపించేవి. ఇది జగన్ గారి భరోసా అని ట్విట్ట‌ర్‌లో విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నారు.

పిల్లలకు ఇవ్వగలిగిన గొప్ప ఆస్తి చదువు మాత్రమేనని నమ్మిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయ‌స్ జగన్ గారు రాష్ట్రంలోని ప్రతి బిడ్డకూ మేనమామగా మారారు. వారి భవిష్యత్తు బాగుండాలని ఖర్చుకు వెనకాడకుండా అనేక విద్యా కార్యక్రమాలు అమలు చేస్తున్నారు అంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

టీడీపీ ఇలా దిక్కులేకుండా అయిందేమిటి? 
అయ్యో! 70 లక్షల మంది(?) కార్యకర్తలున్న పార్టీ ఇలా దిక్కులేకుండా అయిందేమిటి? ఎవరో రావాలి అని ఫ్లెక్సీలు పెట్టడమేంటి? పార్టీ లేదూ బొక్కా లేదని అధ్యక్షుడే నిర్వేదంలోకి వెళ్లడమేంటి? బాబు తిన్నగా లేక ఇవన్నీ వినాల్సిన ఖర్మ పట్టిందని పార్టీ పెద్దలే తలలు పట్టుకుంటున్నారు అంటూ విజ‌య‌సాయిరెడ్డి మ‌రో ట్వీట్ చేశారు.

Back to Top