ఏపీ హైకోర్టు ఇచ్చిన గ్యాగ్ ఆర్డ‌ర్ చ‌ట్ట విరుద్ధం

స‌మ‌న్యాయ భావ‌న‌కు ఇది పూర్తి వ్య‌తిరేకం

ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి

న్యూఢిల్లీ:  ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని భూముల కుంభ‌కోణం కేసులో ఏపీ హైకోర్టు ఇచ్చిన గ్యాగ్ ఆర్డ‌ర్ చ‌ట్ట విరుద్ధ‌మ‌ని వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి అన్నారు. శ‌నివారం పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌జాస్వామ్యమే ప్ర‌మాదంలో ప‌డింద‌న్నారు. ఏపీ హైకోర్టు ఇచ్చిన గ్యాగ్ ఆర్డ‌ర్ చ‌ట్ట విరుద్ధ‌మ‌ని, మీడియా గ్యాగింగ్ రాజ్యాంగ విరుద్ధ‌మ‌న్నారు. ఈ తీర్పు స‌మ‌న్యాయ భావ‌న‌కు పూర్తి వ్య‌తిరేకంగా ఉంద‌న్నారు. ఆర్టిక‌ల్ 14 ప్ర‌కారం హైకోర్టుకు ఈ అధికారం లేద‌న్నారు.  

నిష్ప‌క్ష‌పాత ద‌ర్యాప్తు జ‌ర‌గాలి:  ఎంపీ మిథున్ రెడ్డి
అమ‌రావ‌తి భూ కుంభ‌కోణం కేసులో నిష్ప‌క్ష‌పాత ద‌ర్యాప్తు సీబీఐ విచార‌ణ జ‌ర‌గాల‌ని లోక్‌స‌భ‌లో వైయ‌స్ఆర్‌సీపీ నేత మిథున్‌రెడ్డి కోరారు. రాష్ట్ర బీజేపీ సైతం అమ‌రావ‌తి భూ స్కాంపై సీబీఐ విచార‌ణ కోరుతుంద‌న్నారు. అలాగే ఏపీ ఫైబ‌ర్ గ్రిడ్‌లో వేల కోట్ల అవినీతి జ‌రిగింద‌న్నారు. ఈ రెండింటిపై సీబీఐ విచార‌ణ జ‌రిపించాల‌ని మిథున్‌రెడ్డి లోక్‌స‌భ‌లో కోరారు. 

తాజా వీడియోలు

Back to Top