చంద్రబాబు..కుట్రలు కవల పిల్లలు

ఆలయాల్లో క్షుద్ర పూజలు చేసిన దుర్మార్గుడు చంద్రబాబు

అమ‌రావ‌తిలో స‌దావర్తి భూములు అమ్ముకున్న ఘ‌నుడు

తిరుమలలో అన్యమత ప్రచారం అంటూ టీడీపీ పరువు పోగొట్టుకొంది

ఎన్ని కోట్లు ఖర్చు అయినా రామ‌తీర్థం ఆల‌యాన్ని పున‌ర్మిస్తాం

అప్పన్న ఆలయంలో బహిరంగ చర్చకు లోకేష్ సిద్ధమా?

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి

 విజ‌య‌న‌గ‌రం:  ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు నాయుడు, కుట్ర‌లు క‌వ‌ల పిల్ల‌ల‌ని వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి మండిప‌డ్డారు. రాష్ట్రంలో సుప‌రిపాల‌న సాగుతుంటే..వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వానికి చెడ్డ‌పేరు తెచ్చేందుకు చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు, టీడీపీ నేత‌లు ఆల‌యాల‌పై దాడులు చేస్తూ త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌ని ఆయ‌న దుయ్య‌బ‌ట్టారు. రామ‌తీర్థం ఆల‌యం చైర్మ‌న్‌గా ఉన్న టీడీపీ నేత అశోక్ గ‌జ‌ప‌తి రాజు బాధ్య‌త వ‌హించి, ఆ ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని విజ‌య‌సాయిరెడ్డి డిమాండు చేశారు. ఈ ఘ‌ట‌న‌పై అప్ప‌న్న స్వామి స‌న్నిధిలో బ‌హిరంగ చ‌ర్చ‌కు తాను సిద్ధ‌మ‌ని, లోకేష్ నాయుడు తేదీ, స‌మ‌యం చెప్పాల‌ని స‌వాలు విసిరారు. రామ‌తీర్థం ఆల‌యానికి వెళ్లి వ‌చ్చే స‌మ‌యంలో టీడీపీ నేత‌లు చేసిన దాడిని విజ‌య‌సాయిరెడ్డి ఖండించారు.  పార్టీ ఎమ్మెల్యేలు కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి, రాజ‌న్న‌దొర‌, ఎమ్మెల్సీ పెనుమ‌త్స సురేష్‌తో క‌లిసి విజ‌య‌సాయిరెడ్డి కాలిన‌డ‌న‌క నిరస‌న ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా విజ‌య‌సాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. 

గత నెల 29వ తేదీ తెల్లవారుజామున రామతీర్థం కొండ పై దేవాలయంలో జరిగిన ఘటన చాలా శోచనీయమైనంది. మంచి పరిపాలన చేస్తున్న సీఎం వైయ‌స్ జగన్ ప్రభుత్వం పై తప్పు పట్టే విధంగా చంద్రబాబు కుట్రపూరితంగా ఆయన,  పార్టీ అనుచరులు ఈ ఘటనకు పాల్పడ్డారని అనుమానం వ్యక్తం చేశారు. లోకేష్ నాయుడు ఛాలెంజ్ తాను స్వీకరిస్తున్నాను. సింహాచలం అప్పన్న స్వామి సన్నిధిలో చర్చకు తాను సిద్ధమని, తేదీ, స‌మ‌యం ఆయ‌నే చెప్పాల‌ని విజ‌య‌సాయిరెడ్డి సవాల్ విసిరారు. రామతీర్థం అల‌య చైర్మ‌న్‌గా ఇప్ప‌టి వ‌ర‌కు అశోక్ గజపతిరాజు ఉన్నారని, ఈ కుట్రలో టీడీపీకి భాగస్వామ్యం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఇళ్ల పట్టాల కార్యక్రమాన్ని అడ్డుకోవాలని దుర్భుద్ధితోనే టిడిపి నేతలు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడుకి దేవుడు అన్న భయం, భక్తి లేదు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో దాదాపు 20 వేల దేవాలయాలను మూత వేయించార‌ని చెప్పారు. వైయ‌స్ఆర్ కుటుంబానికి భ‌క్తిశ్ర‌ద్ధ‌లు ఎక్కువ‌ని చెప్పారు. వైయ‌స్ జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చాక  జీర్ణోద్ధరణకు నోచుకొని ఎన్నో ఆల‌యాల‌ను తెరిపించార‌న్నారు. వైయ‌స్ జగన్ అర్చ‌కుల‌కు వంశపారంప‌ర్య‌హ‌క్కు క‌ల్పించార‌ని, గౌర‌వ వేతనాన్ని పెంచార‌ని తెలిపారు. 

టీడీపీ హ‌యాంలో ఆలయాల్లో అర్ధరాత్రి క్షుద్ర‌ పూజలు చేసిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు అని మండిపడ్డారు. అర్చకులు  వంశపారంపర్య హక్కు అడిగితే వారిపై దుర్భాషలాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అన్నారు.ఆల‌య వ్య‌వ‌స్థ‌ను  చంద్రబాబు నాయుడు నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెన్నుపోట్లు, వంచన, మోసం, దగా చంద్రబాబునాయుడు ల‌క్ష‌ణాల‌న్నారు.  ఒకే తల్లికి పుట్టిన సొంత తమ్ముని మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అన్నారు. పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచార‌న్నారు. తోడళ్లుల‌ను, బామ్మర్దిని మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అన్నారు. అవకాశవాద రాజకీయాలు చేయడంలో చంద్రబాబు దిట్ట అన్నారు. ఎలా ప్రజల సొమ్ము దోచుకోవాలని ఆలోచ‌న చేస్తార‌ని, స్వార్థపూరిత రాజకీయాల్లో చంద్రబాబు ఆరితేరారు అన్నాడు. కుట్రలకు ఆయన బ్రాండ్ అంబాసిడర్ అన్నారు. చంద్రబాబు, కుట్ర‌లు కవల పిల్లలు అని అభివర్ణించారు. తాను దోచిన సొమ్ము విదేశాల్లో దాచుకున్నార‌ని విమ‌ర్శించారు. 

అమ‌రావ‌తిలో సదావ‌ర్తి భూములు అమ్ముకున్న ఘ‌నుడు చంద్ర‌బాబు అ‌ని విజ‌య‌సాయిరెడ్డి దుయ్య‌బ‌ట్టారు.విజయవాడ లో అనేక దేవాల‌యాలు కూల్చార‌ని ఫైర్ అయ్యారు. వైయ‌స్ఆర్ ప్ర‌భుత్వంపై చంద్ర‌బాబు అనేక ఆరోప‌ణ‌లు చేసి అభాసుపాల‌య్యార‌ని గుర్తు చేశారు. తిరుమ‌ల‌లో అన్య‌మ‌త ప్ర‌చారం అంటూ, శ్రీశైలం దేవస్థానం లో అన్య‌మతస్తులు ఉన్నార‌ని ఆరోప‌ణ‌లు చేసి ఏది రుజువు చేయ‌లేక‌పోయార‌న్నారు. సీఎం వైయ‌స్ జగన్ పై తప్పుడు ఆరోపణలు చేస్తూ.. కుట్రలు , కుతంత్రాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సాక్షిగా వైయస్ జగన్  త‌న కులం మానవత్వం అని చెప్పార‌ని గుర్తు చేశారు. మాట తప్పడం, మ‌డ‌మ తిప్ప‌డం వైయ‌స్ జ‌గ‌న్ డిక్షనరీలో లేద‌న్నారు. చంద్రబాబు ఆయన కుమారుడు టిడిపి కార్యకర్తలు పాల్పడిన ఈ దుశ్చ‌ర్య‌ల‌కు తప్పకుండా భగవంతుడు శిక్షిస్తాడని హెచ్చరించారు. రామతీర్థం ఆలయాన్ని పునర్ నిర్మించడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఎన్ని కోట్లు ఖర్చు అయినా సరే ఈ ఆలయాన్ని పునర్నించేందుకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ప్ర‌తిపాద‌న‌లు చేస్తామ‌న్నారు.    అశోక్ గజపతిరాజు చైర్మన్‌గా ఉన్న సమయంలో జరిగిన ఈ ఘటనకు ఆయన బాధ్యత వహించాలన్నారు. వెంటనే చైర్మన్ పదవికి అశోక్ గజపతిరాజు రాజీనామా చేయాలని విజయసాయి రెడ్డి డిమాండ్ చేశారు.  నాడు కేంద్ర మంత్రి అమిత్‌షా తిరుమ‌ల‌కు వెళ్తే చంద్ర‌బాబే రాళ్ల దాడి చేయించార‌ని, ఇవాళ తాను రామ‌తీర్థం ఆల‌యానికి వెళ్తే మ‌ళ్లీ ఆయ‌నే త‌న అనుచ‌రులు, పార్టీ నేత‌ల‌తో దాడి చేయించార‌ని, ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నార‌ని విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నారు.

దొంగే దొంగ దొంగ అంటున్నాడు:  ఎమ్మెల్యే కొల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి
దొంగే దొంగ దొంగ అంటూ అరుస్తున్నార‌ని ఎమ్మెల్యేకొల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి మండిప‌డ్డారు. రామ‌తీర్థం ఘ‌ట‌న‌కు టీడీపీ బాధ్య‌త వ‌హించాల‌న్నారు. అక్క‌డి ఘ‌ట‌న‌ను ప‌రిశీలించేందుకు విజయసాయిరెడ్డి కాళ్ళకు చెప్పులు లేకుండా రామతీర్థం ఆలయానికి వెళ్లారని ఎమ్మెల్యే రాజన్నదొర పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్ కు వ‌స్తున్న ప్ర‌జాదరణను చూసి ఓర్వలేక టిడిపి నేతలు ఆల‌యాల‌పై దాడుల‌కు పాల్ప‌డుతున్నార‌ని, తప్పు చేసిన వారిని శ్రీరామచంద్రుడు తప్పక శిక్షిస్తాడని హెచ్చరించారు.  
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top