అలాంటి వారికి మంచి బుద్దుని ప్రసాదించాలని దేవున్ని కోరుకున్నా..

శ్రీవారిని ద‌ర్శించుకున్న ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి
 

తిరుమల : భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని అంబేద్కర్  రాజ్యాంగాన్ని రచిస్తే కొంత‌మంది రాజ్యాంగాన్ని అతిక్రమించి ప్రవర్తిస్తున్నారని, అలాంటి వారికి బుద్దుని ప్రసాదించాలని దేవున్ని కోరుకున్న‌ట్లు వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి తెలిపారు.   తిరుమ‌ల శ్రీవారిని సోమ‌వారం విజ‌య‌సాయిరెడ్డి ద‌ర్శించుకున్నారు.  

ఆమె ఎవ‌రో అర్థ‌మైంది..
బీజేపీ నాయ‌కురాలు పురంధేశ్వ‌రి ఈ రోజు ఈనాడుకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూతో, అందులో రాజ‌ధాని, ప్ర‌భుత్వ ప‌నితీరు అంశాల‌పై వ్య‌క్తం చేసిన అభిప్రాయాలతో ఆమె జాతీయ నాయ‌కురాలో, జాతీ నాయ‌కురాలో పూర్తిగా స్ప‌ష్ట‌మైంద‌ని విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top