మాదిగల అభ్యున్నతికి సీఎం వైయస్‌ జగన్‌ కృషి

మాదిగలు బాగుపడాలనే ఉద్దేశం మందకృష్ణకు లేదు

వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ నందిగం సురేష్‌ 

అమరావతిః మాదిగల అభ్యున్నతి కోసం సీఎం వైయస్‌ జగన్‌ కృషి చేస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ నందిగం సురేష్‌ అన్నారు.విజయవాడ వైయస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మాదిగలు బాగుపడే ఉద్దేశం మందకృష్ణకు లేదని ధ్వజమెత్తారు.హడావుడిగా ఏపీకి వచ్చి అల్టిమేటం ఇస్తున్నారని విమర్శించారు.ఎస్సీ దళితులపై ప్రేమ కనిపించడం లేదన్నారు. ఎస్సీల సంక్షేమాన్ని అడ్డుకోవడమే ధ్యేయంగా అడ్డంకులు  కలిగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నడూ లేని విధంగా మాదిగలకు ఒక కార్పొరేషన్, రెండు మంత్రి పదవులు ఇచ్చారన్నారని తెలిపారు.  సామాజిక న్యాయపరంగా వైయస్‌  జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలిపారు.

వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సామాన్యులను అక్కున చేర్చుకుంటారనే  దానికి నేనే నిదర్శనమన్నారు. ఒక సాధారణ కార్యకర్తను ఎంపీని చేసిన  గొప్ప మనస్సు ఉన్న నాయకుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని ప్రస్తుతించారు. ప్రతి పథకంలో ఎస్సీలకు మేలు జరిగే విధంగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయాలు తీసుకున్నారన్నారు.  నామినేటెడ్‌ పదవుల్లో ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారీటీలకు 50 శాతం ఇచ్చే విధంగా నిర్ణయాలు తీసుకున్నారన్నారు. ప్రభుత్వం ఇచ్చే నామినేషన్‌ సర్వీసుల్లో సగం రాబోతున్నాయని తెలిపారు. దీని కోసం అసెంబ్లీలో చట్టాలను చేయబోతున్నారని తెలిపారు. 
 

Back to Top