ఓటు హ‌క్కు వినియోగించుకున్న స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి

గుంటూరు: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి మంగ‌ళ‌గిరిలో ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. మంగళగిరి నియోజకవర్గం కాజాలోని పోలింగ్ బూత్‌కు  సామాన్య ఓటర్‌లా తన కుటుంబ సభ్యులతో కలసి‌వచ్చి క్యూలైన్ లో నిలబడి ಓటు వేశారు. ఓటు చాలా విలువైందని, ప్ర‌తి ఒక్క‌రూ ఓటు హ‌క్కును వినియోగించుకోవాల‌ని స‌జ్జ‌ల కోరారు. ఉదయాన్నే పెద్ద సంఖ్యలో ಓటర్లు  పోలింగ్ స్టేషన్ల వద్ద బార్లు తీరడం చాలా ఆనందం కలిగిస్తోందని తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు

Back to Top