అమరావతి : పెత్తందార్లకు మళ్లీ షాక్ ఇచ్చేందుకు పేదలు, దిగువ మధ్య తరగతి ప్రజలంతా సిద్ధమయ్యారు. ఇంటింటా అభివృద్ధి కొనసాగాలని.. రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నారు. మళ్లీ వైయస్ జగన్ వస్తేనే సంక్షేమాభివృద్ధి పథకాలు కొనసాగుతాయని బలంగా నమ్ముతున్నారు. సాధికారత కోసం ఎన్నికల మహా సంగ్రామంలో కీలక ఘట్టమైన పోలింగ్ ప్రక్రియలో ఫ్యాన్ గుర్తుపై రెండు బటన్‌లు నొక్కి ఓట్లేసి వైయస్ఆర్‌సీపీ అభ్యర్థులను గెలిపించేందుకు పేదలంతా సిద్ధమయ్యారు. గత ఎన్నికల్లో 50 శాతం ఓట్లు.. 151 శాసనసభ, 22 లోక్‌సభ స్థానాల్లో అభ్యర్థులను గెలిపించి, వైఎస్సార్‌సీపీకి ప్రజలు చారిత్రక విజయాన్ని అందించారు. 2019 మే 30న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి.. తొలి ఏడాదిలోనే 95 శాతం హామీలు అమలు చేసి ఎన్నికల మేనిఫెస్టోకు సరైన నిర్వచనం చెప్పారు. 59 నెలల్లో 99 శాతం హామీలు అమలు చేశారు. ఎలాంటి వివక్ష చూపకుండా, లంచాలకు తావులేకుండా.. అర్హతే ప్రామాణికంగా అందరికీ సంక్షేమ పథకాలు అందించారు. సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ రూపంలో పేదల ఖాతాల్లో రూ.2.70 లక్షల కోట్లు జమ చేశారు. నాన్ డీబీటీ పథకాల ద్వారా మరో రూ.1.79 లక్షల కోట్ల ప్రయోజనాన్ని చేకూర్చారు. డీబీటీ, నాన్ డీబీటీ కలిపి పేదలకు మొత్తం రూ.4.49 లక్షల కోట్ల లబ్ధి చేకూరింది. వాటిని సది్వనియోగం చేసుకున్న పేదలు.. జీవనోపాధులను మెరుగుపర్చుకుని తమ కాళ్లపై తాము నిలబడగలుగుతున్నారు. రాష్ట్రంలో పేదరికం చంద్రబాబు హయాంలో 11.77 శాతం ఉంటే.. 2022–23 నాటికి అది 4.19 శాతానికి తగ్గడమే అందుకు నిదర్శనం. సాధికారత కోసం పేదలంతా సిద్ధం విభజన తర్వాత 2014 ఎన్నికల్లో వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తానని, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని.. ఇంటికో ఉద్యోగం లేదా నెలకు రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తానంటూ 650కిపైగా హామీలు ఇచ్చిన చంద్రబాబు సారథ్యంలోని టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేసింది. 2019 ఎన్నికల్లో వేరుపడిన ఆ పార్టీలు ఇప్పుడు మళ్లీ కూటమిగా ఏర్పడి పోటీ చేస్తూ అలవికాని హామీలు ఇచ్చాయి. ఆ హామీల అమలు సాధ్యం కాదని నిర్ధారణకు వచ్చిన బీజేపీ.. టీడీపీ కూటమి మేనిఫెస్టోను ముట్టుకోవడానికి కూడా వెనుకంజ వేసింది. సీఎం జగన్ గత ఎన్నికల తరహాలోనే అమలు చేయదగిన హామీలతోనే కేవలం రెండే రెండు పేజీలతో మేనిఫెస్టోను విడుదల చేశారు. కూటమికి ఇక్కడ సారథ్యం వహిస్తున్న చంద్రబాబు.. చెప్పిన మాటపై నిలబడడని, మోసం చేస్తారనే అభిప్రాయం ప్రజల్లో బలంగా నాటుకు పోయింది. చెప్పిన హామీలన్నీ అమలు చేసిన సీఎం జగన్ నాయకత్వంపై ప్రజల్లో నమ్మకం కుదిరింది. దీంతో సాధికారత కోసం మళ్లీ జగనే రావాలని పేదలంతా బలంగా కోరుకుంటున్నారు. భవిష్యత్తు మరింత గొప్పగా మార్చుకునేందుకు.. ⇒ రాష్ట్రంలో 70 శాతం ప్రజల జీవనాధారం వ్యవసాయం. సీఎం జగన్ గ్రామాల్లో ఆర్బీకే (రైతు భరోసా కేంద్రాలు)లను ఏర్పాటు చేసి, విత్తు నుంచి విక్రయం దాకా రైతుల చేయిపట్టి నడిపిస్తున్నారు. రైతు భరోసా ద్వారా పెట్టుబడి సహాయం.. ఆర్బీకేల ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందిస్తున్నారు. రైతులపై ఎలాంటి భారం పడకుండా ఉచిత పంటల బీమా పథకాన్ని తెచ్చారు. పండించిన పంటల ఉత్పత్తులను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తున్నారు. ప్రకృతి విపత్తుల వల్ల పంట నష్టపోతే.. ఆ సీజన్ ముగిసేలోగా పరిహారాన్ని అందించి రైతులకు దన్నుగా నిలుస్తున్నారు. తద్వారా వ్యవసాయాన్ని పండుగగా మార్చారు. ⇒ గ్రామ, వార్డు సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజలు సొంత ఊళ్లోనే సులభంగా అన్ని పనులను చక్కబెట్టుకుంటున్నారు. ఆరోగ్యశ్రీ వైద్య ఖర్చుల పరిమితిని రూ.25 లక్షలకు పెంచడం.. జగనన్న సురక్ష, విలేజ్ హెల్త్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా ప్రజల ఆరోగ్యానికి సీఎం జగన్ భరోసా కల్పించారు. పునర్ వ్యవస్థీకరణ ద్వారా 26 జిల్లాలను ఏర్పాటు చేశారు. ⇒వైఎస్సార్ చేయూత, ఆసారాతో మహిళలకు సీఎం జగన్ అండగా నిలిచారు. ఆ పథకాల ద్వారా అందించిన ఆర్థిక సాయంతో ⇒‘పేదలంటే మారుమూల పల్లెల్లో, పట్టణాల్లోని మురికి వాడల్లోనే ఉండాలి.. పెత్తందారుల ఇళ్లలో పనులు చేస్తూ, వాళ్లు తినగా మిగిలింది తింటూ బతకాలి.. పిల్లలను స్కూల్ లెవల్ వరకు తెలుగు మీడియంలో మాత్రమే చదివించాలి.. ఇంగ్లిష్ మీడియంలో చదివించాలనే ఆలోచనే రాకూడదు.. టెన్త్ తర్వాత పెత్తందారుల ఫ్యాక్టరీలో ప్యాకింగ్ విభాగంలో, లోడింగ్.. అన్‌లోడింగ్ సెక్షన్‌లో, సెక్యూరిటీ గార్డులుగా పెట్టుకోమని బతిమిలాడాలి.. అమరావతిలో పేదలనే వారు అసలు ఉండకూడదు.. ఎన్నో ఏళ్లుగా ఇలా కొనసాగుతోంటే ఈ సీఎం జగన్ వచ్చాక, ఆ పరిస్థితి మార్చేస్తున్నారు.. సీఎం ఇలా చేస్తే మేము చూస్తూ ఊరుకుంటామా.. కోర్టుల్లో కేసులేశాం.. లేని వివాదాలు సృష్టించాం.. భయాందోళనలు పెంచేశాం.. డబ్బు సంచులతో ఎన్‌ఆర్‌ఐలను దింపాం.. పనోళ్లను పనోళ్లుగా ఉంచకుండా పేదరికాన్ని తగ్గించేస్తే మేమంతా ఏమైపోవాలి?’ అని చంద్రబాబు ఆయన పెత్తందారుల గ్యాంగ్ ఊగిపోతోంది. ⇒ ఈనాడు రామోజీ పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్ని మందులు వాడినా హిస్టీరియా తగ్గడం లేదు. రాత్రిళ్లు ఉన్నట్లుండి లేచి కూర్చుంటున్నారట. అదిగో జగన్.. జగన్.. మళ్లీ వస్తున్నాడు అంటూ కలవరిస్తున్నారట! తప్పకుండా ఆయన కల నెరవేరుతుంది. పేదరికంపై, పేదలపై, దిగువ మధ్యతరగతి వర్గాలపై విషం నింపుకున్న ఈ పెత్తందారులు ఫలానా మంచి పని చేశామని ఒక్కటంటే ఒక్కటి చెప్పుకోలేని దుస్థితిలో నిస్సిగ్గుగా మంచి చేస్తున్న ప్రభుత్వంపై దుర్మార్గంగా నిందలు వేస్తున్నారు. దు్రష్పచారాలు చేస్తున్నారు. వీరందరి వలువలూడదీసి తరమడానికి ఓటర్లంతా సిద్ధంగా ఉన్నారు. ఊరూరా అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు బారులు తీరి కనిపిస్తున్నారు. ఆ రెండు బటన్లు ఎప్పుడెప్పుడు నొక్కుదామా అని వేచి చూస్తున్నారు.