రోడ్డు ప్ర‌మాద మృతుల‌కు వైయ‌స్ఆర్‌సీపీ నేత‌ల సంతాపం

క‌ర్నూలు: హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు  క‌ర్నూలు జిల్లా చిన్నటేకూరు దగ్గర జ‌రిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో  దాదాపు 20 మంది మృతిచెందడం ప‌ట్ల వైయ‌స్ఆర్‌సీపీ క‌ర్నూలు జిల్లా నాయ‌కులు దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. ఈ ఘ‌ట‌న‌పై ప‌త్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీ‌దేవి, చెరుకుల‌పాడు ప్ర‌దీప్‌రెడ్డి త‌దిత‌రులు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్ధించారు. ఈ సంద‌ర్భంగా శ్రీ‌దేవి మాట్లాడుతూ..“ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వం, రవాణా శాఖ మరింత కఠినమైన భద్రతా చర్యలు తీసుకోవాలి. రోడ్లపై ప్రయాణిస్తున్న ప్రతి ఒక్కరి ప్రాణం అమూల్యమని గుర్తించి, ఇటువంటి విషాద సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము”.

Back to Top