తాడేపల్లి: రాష్ట్రంలో వ్యవస్థీకృతంగా కొనసాగుతున్న నకిలీ మద్యం దందాతో ప్రజల ఆరోగ్యం, ఫణంగా పెట్టి మద్యం మాఫియా కోట్లు గడిస్తోందని మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధినేత శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆక్షేపించారు. అయినా నిందలు వేరే వారిపై వేస్తూ, తప్పించుకో చూస్తున్నారని ఆయన విమర్శించారు. విశాఖలో తమ ప్రభుత్వ హయాంలోనే అదానీ డేటా సెంటర్‌కు బీజం పడిందని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన శ్రీ వైయస్ జగన్ వెల్లడించారు. ‘పర్ఫార్మెన్స్‌లో వీక్.. క్రెడిట్ చోరీలో పీక్’ అయిన సీఎం చంద్రబాబు, ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్‌పై అదే తరహాలో ప్రచారం చేసుకుంటున్నారని తెలిపారు. నాడు తమ హయాంలో బీజం పడిన అదానీ డేటా సెంటర్‌ను ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్‌గా చెబుతూ, విపరీతంగా ప్రచారం చేసుకుంటున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వ నిర్వాకం వల్ల రాష్ట్రంలో అన్ని వ్యవస్థలూ నిర్వీర్యం అయ్యాయని.. ముఖ్యంగా విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలు సర్వనాశనం అయ్యాయని శ్రీ వైయస్ జగన్ స్పష్టం చేశారు. ఏ ఒక్క మేలు చేయకుండా, సీఎం చంద్రబాబు, ఉద్యోగులను దారుణంగా మోసం చేశారని తేల్చి చెప్పారు. ప్రెస్‌మీట్‌లో శ్రీ వైయస్ జగన్ ఇంకా ఏం మాట్లాడారంటే..: వ్యవస్థీకృతంగా నకిలీ మద్యం దందా: రాష్ట్రంలో ఈరోజు నకిలీ మద్యం దందా అనేది ఒక వ్యవస్థీకృతంగా జరుగుతోంది. ఇంత దారుణమైన మద్యం మాఫియా ప్రపంచ చరిత్రలోనూ ఎక్కడా చూసి ఉండం. ఏకంగా నకిలీ మద్యం చిన్నపాటి ఫ్యాక్టరీలు రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తున్నాయి. మరోవైపు మద్యం విక్రయాలన్నీ మాఫియా కనుసన్నల్లోనే కొనసాగుతున్నాయి. మద్యం షాప్‌లు, పర్మిట్‌రూమ్‌లు, బెల్టు షాప్‌లు అన్నీ ఏ రకంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, తెలుగుదేశం మనుషులు నడుపుతున్నారో చూస్తున్నాం. మద్యాన్ని వాళ్లే తయారు చేస్తున్నారు. వాళ్లకు చెందిన షాపుల ద్వారానే ఆ మద్యాన్ని వాళ్లే అమ్ముతున్నారు. వారికే చెందిన బెల్ట్ షాపుల ద్వారా కూడా విక్రయాలు జరుపుతున్నారు. గ్రామాల్లో ఏకంగా వేలం వేసి, బెల్టు షాప్‌లు ఏర్పాటు చేశారో.. వాటికి పోలీస్ రక్షణ ఇచ్చి, వారి ఆధ్వర్యంలో గ్రామాల్లో మద్యం అమ్మేందుకు ఈ మాఫియా ఎలా శ్రీకారం చుట్టిందో చూశాం. వాటిలోనూ నకిలీ మద్యం అమ్ముతున్నారు. బెల్ట్ షాపులే కాకుండా ఇల్లీగల్ పర్మిట్ రూమ్‌ల ద్వారా కూడా నకిలీ మద్యాన్ని విచ్చలవిడిగా అమ్ముతున్నారు. ప్రభుత్వ ఖాజానాకు వేల కోట్ల నష్టం కలిగిస్తూ, ప్రజల ఆరోగ్యాన్ని ఫణంగా పెడుతూ, వీళ్ల జేబులు నింపుకునేందుకు ఏ స్థాయికైనా దిగజారిపోయి, ఈరోజు డబ్బుల కోసం వ్యాపారం చేస్తున్న పరిస్థితులు చూస్తున్నాం. వాటాల్లో తేడా రావడంతో ఇదంతా బయటకు వచ్చింది. ఒక్క మొలకలచెరువులోనే 20,208 బాటిళ్లలో నింపిన నకిలీ మద్యం దొరకగా, మరో 8,166 బాటిళ్లకు సరిపడా మద్యం కూడా పట్టుబడింది. ఇంకా 30 క్యాన్లలో సిద్ధం చేసిన 1050 లీటర్ల స్పిరిట్ కూడా అక్కడ లభ్యమైంది. అంటే అవన్నీ వాడి ఉంటే, కొన్ని వేల బాటిళ్ల నకిలీ మద్యం తయారయ్యేది. ఇక విజయవాడలో.. ఎక్కడైతే సీపీ పర్యవేక్షణలో పోలీసులు పని చేస్తున్నారో.. ఏ పోలీస్ కమిషనర్ అయితే చంద్రబాబు అడుగులకు మడుగులు ఒత్తుతున్నాడో.. ఏ పోలీస్ కమిషనర్ అయితే సిట్ పేరుతో గతంలో ఏమీ జరగకపోయినా కూడా తప్పుడు సాక్ష్యాలతో మా పార్టీ వారిని వేధించే కార్యక్రమాలు చేస్తున్నాడో.. అదే విజయవాడ సీపీ పర్యవేక్షణలో ఉన్న ఇబ్రహీంపట్నంలో మరో నకిలీ మద్యం ఫ్యాక్టరీ బయటపడింది. ఇబ్రహీంపట్నంలో దొరికిన నకిలీ మద్యం దాదాపుగా 27,224 బాటిళ్లు. పలు చోట్ల తయారీ. రాష్ట్రమంతా సరఫరా: ఇంకా అనకాపల్లి జిల్లా పరవాడతో పాటు, అమలాపురం, పాలకొల్లు, ఏలూరు, రేపల్లె.. ఇంకా నెల్లూరులోనూ ఇదే మాదిరిగా మద్యం ఫ్యాక్టరీలు బయటపడ్డాయి. అంటే ఈ నకిలీ మద్యం తయారీని మొత్తం పరిగణనలోకి తీసుకుంటే రాష్ట్రంలో కొన్ని లక్షల బాటిళ్లు తయారు చేసేదీ వీళ్లే. డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ ద్వారా వీళ్లకు సంబంధించిన ప్రైవేట్ మాఫియా షాపుల్లోకి, వీళ్లకు సంబంధించిన బెల్ట్ షాపులకు, వీళ్లకు సంబంధించిన ఇల్లీగల్ పర్మిట్ రూమ్‌లకు అన్నింటికీ వీళ్లే పంపిణీ చేసి అమ్ముతున్నారు. (అంటూ నకిలీ మద్యం తయారీ ఫ్యాక్టరీలు, వాటి తయారీదార్లు, నకిలీ మద్యం ఫోటోలు ప్రదర్శిస్తూ.. వాటన్నింటినీ వివరించారు). ఏకంగా బాటిళ్లు, స్టాంప్స్, లేబుళ్లు. అన్నీ నీటుగా అమర్చడం, ప్యాకింగ్ చేయడంతో పాటు, ప్యాకింగ్ బ్యాగ్స్ కూడా. ఇంకా రకరకాల బ్రాండ్స్. కేరళ మాల్ట్, ఓల్డ్ అడ్మిరల్, మంజీరా బ్లూ, క్లాసిక్ బ్లూ. అనకాపల్లి జిల్లా పరవాడలో చిన్న సైజ్ నకిలీ మద్యం ఫ్యాక్టరీ. సేమ్ స్టిక్కర్లు, లేబుళ్లు, బాటిళ్లు, మ్యానుఫ్యాక్చరింగ్. పరవాడలో నకిలీ మద్యం తయారు చేస్తున్నది ఎవరంటే స్పీకర్ అయ్యన్నపాత్రుడు సన్నిహితుడు రుత్తల రాము. కేవలం ఆ ఇద్దరికే అది సొంతం. సాధ్యం: ఇలా కొన్ని లక్షల బాటిళ్లు రోజూ తయారు చేసి సరఫరా చేశారు. ప్రతి నాలుగైదు బాటిళ్లకు ఒక బాటిల్ నకిలీ మద్యం. అంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా లిక్కర్ మాఫియా షాపుల్లో, వాళ్ల బెల్ట్ షాపుల్లో, వాళ్ల ఇల్లీగల్ పర్మిట్ రూంలలో.. ప్రతి నాలుగైదు బాటిళ్లకు ఒక బాటిల్ నకిలీ మద్యాన్ని అమ్మతున్నారు. నిజంగా ఏ స్థాయిలో ఈ మాఫియా నడుస్తుందంటే.. ఇంత వ్యవస్థీకృతంగా నకిలీ మద్యం తయారు చేయడం. అంతే వ్యవస్థీకృతంగా డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ అన్నీ వీళ్ల కంట్రోల్‌లోకి తీసుకోవడం, వాటి ద్వారా మార్కెటింగ్ చేయడం. ఇంత ఆర్గనైజ్డ్‌గా క్రైమ్ చేయడం ఒక్క చంద్రబాబునాయుడుకు, ఆయన కొడుక్కు మాత్రమే సొంతం. సాధ్యం. అదే మోడస్ ఆపరెండీ: డబ్బుల దగ్గర తగాదాలు వచ్చి నకిలీ మద్యం దందా బయట పడడంతో టాపిక్ డైవర్ట్ చేయడానికి చంద్రబాబు చేస్తున్న కుట్రలు అన్నీ ఇన్ని కావు. నాడు ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన నాటి నుంచి ఆయన ఫ్లాష్ బ్యాక్ చూస్తే.. చేసేది ఆయనే. నెపాన్ని వేరేవాళ్ల మీదకు నెట్టేది ఆయనే. దానికి వత్తాసు పలికేది ఇదే ఎల్లో మీడియానే. అప్పుడైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా ఇదే మోడస్ ఆపరెండీ. చంద్రబాబే నేరాలు చేస్తాడు. అది బయటపడే సరికి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఆయన దొంగల ముఠా ఎల్లో మీడియా సిద్ధం అవుతుంది. అంతా ఆర్కెస్ట్రేటెడ్‌గా, ఒక అబద్ధాన్ని నిజమని చెప్పి నమ్మించడం కోసం.. చెప్పిన అబద్ధమే వంద సార్లు చెప్పే కార్యక్రమం. టాపిక్ డైవర్షన్‌లో భాగంగా ఎదుటివారిపై వారే బురద జల్లుతారు. వాళ్లే కొత్త కొత్త ఆరోపణలు చేస్తారు. వాళ్లే ఆ ఆరోపణలను నిజం చేయాలనే తాపత్రయంతో ఒక సిట్ కూడా వేస్తారు. తప్పుడు విచారణ చేస్తారు. తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తారు. డ్రామాను నడుపుతారు. ఇదేంటని పొరపాటున ప్రశ్నిస్తే.. వారిపై కూడా ముద్ర వేసేస్తారు. వారిని కూడా జైళ్లకు పంపించే కార్యక్రమం చేస్తారు. ఇవన్నీ కామన్ సెన్సికల్ ఇష్యూస్: నకిలీ మద్యం వ్యవహారం వెనుక ఉంది చంద్రబాబు మనుషులు. తంబళ్లపల్లె టీడీపీ ఇంచార్జ్, టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తి జయచంద్రారెడ్డి. చంద్రబాబు ఆయనకు భీఫామ్ ఇచ్చాడు. ఫొటోలో జయచంద్రారెడ్డి పక్కనే ఉన్న వ్యక్తి జనార్దనరావు. లోకేష్, చంద్రబాబుతో ఉన్న మరో వ్యక్తి సురేంద్రనాయుడు. ఇదంతా ఒక మాఫియా. ఎన్నికల్లో బాండ్లు, బాండ్లతో పాటు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో, చంద్రబాబునాయుడు ఫొటో.. చూడండి ఎంత చక్కగా ప్రతి ఇంటికీ పంచుతున్నారో.. (అంటూ ఆ ఫోటోలు చూపారు) నేను అడుగుతున్నాను. ఇదే జనార్దన్‌రావు అనే వ్యక్తి విదేశాల్లో ఉండగానే రెండు రోజుల్లో వచ్చి ఈ మనిషి లొంగిపోతాడంటూ వీళ్లే సుతిమెత్తగా ఎల్లో మీడియాలో లీకులిచ్చారు. ఈనాడులో బాగా కనపడుతుంది. ఆంధ్రజ్యోతిలో బాగా చక్కగా చూపిస్తారు. టీవీ5 బాగా తాళం వేస్తుంది. అంతా హాట్ లైన్ కదా. ఎల్లో మీడియా అంటే దొంగల ముఠా. అంతా ప్రిప్లాన్డ్. ఒక స్కెచ్ ప్రకారమే: దీని సారాంశం ఏమిటంటే ముందుగానే జనార్దన్‌రావుతో వీళ్లు మాట్లాడుకోవడం, ఆ వెంటనే ఆ జనార్దన్‌రావు రెండున్నర ఏళ్ల కిందట నుంచే ఈ వ్యవహారం జరుగుతోందని ఆయన నోట్లోంచి అలా చెప్పించడం, దానికి పూర్తిగా ప్లేటు ఫిరాయించి ఆయనతో పూర్తిగా ఒక స్కెచ్ గీయించడం.. సరే అంతటితో అయిపోలేదు. ఒకవైపున ఇది చేస్తుండగానే మరోవైపున తంబళ్లపల్లెలో టీడీపీ ఇన్‌ఛార్జ్ జయచంద్రారెడ్డి మీద ఒక బ్రాండింగ్. ఆయన మా పెద్దిరెడ్డికి అత్యంత సన్నిహితుడంటూ బ్రాండింగ్. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే నకిలీ మద్యం తయారీని మొదలుపెట్టారని మరో బ్రాండింగ్. మళ్లీ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 తానా తందానా. నకిలీ లిక్కర్ తయారీకి ఆఫ్రికాలో మూలాలు ఉన్నాయంటూ మరో కథ బిల్డప్. అక్కడితో ఆగిపోని ఇంకా బరి తెగించిన చంద్రబాబు అధికార దుర్వినియోగం ఏ స్థాయిలో ఉందంటే.. ప్రభుత్వంలో ఉన్న ఐవీఆర్‌ఎస్ కాల్ సెంటర్‌ను ఉపయోగించుకుని తన మాఫియాలో ఒకడైన తన మనిషి జనార్దన్‌రావు ఇచ్చిన వీడియోను చూపించి, ఆయన చేత ఒక వీడియోను చేయించి, ఆ వీడియోలో మాజీ మంత్రి జోగి రమేష్ పేరు చెప్పించి, ఆ వీడియోలోని వాయిస్ కు మరికొన్ని వక్రీకరణలు జోడించి, వాటిని ఉ«ధృతంగా ప్రచారం చేయడం. ఇంకా అంతటితో ఆగకుండా, ఏబీఎన్, ఈనాడు, టీవీ5 రంగ ప్రవేశం చేసి, జనార్దన్‌రావు అనే వ్యక్తి ఫోన్ ఛాట్స్, జోగి రమేష్‌తో చేశాడని చూపడం. అంటే నేరం చేసేది వాళ్లే. దాన్ని డైవర్ట్ చేస్తూ, ఇంకొకరి మీద బురద జల్లుతూ వ్యవహరించడం. అంతా ఒక కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ప్రకారం జరుగుతుంది. చంద్రబాబు ఇవే నా సూటి ప్రశ్నలు. వాటికి సమాధానం చెప్పే ధైర్యం ఉందా?: నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీలు బయటపడ్డ తర్వాత మీరెన్ని షాపుల్లో తనిఖీలు చేశారు? ఎన్ని నకిలీ లిక్కర్ బాటిళ్లు పట్టుకున్నారు?. ఏయే షాపుల్లో వాటిని గుర్తించారు?. ఒక్కటీ లేదు. అన్ని షాపులూ వీళ్లవే. పట్టుకుంటే అన్ని చోట్లా దొరుకుతాయి. కాబట్టి ఏవీ చేయరు. ఇదే జనార్దన్‌రావు విదేశాల నుంచి వస్తున్నప్పుడు, వస్తున్నాడని మీ పేపర్లో మీరే రాశారు. రెండ్రోజుల్లో వస్తున్నాడని. మరి ఆయన్ను ఎందుకు అరెస్టు చేయలేదు? మామూలుగా మా వాళ్లు ఎవరు పోయినా, ఎయిర్‌పోర్టుల్లో లుక్ అవుట్ నోటీసులు పెడుతున్నారు. కానీ ఆయనవి మాత్రం పెట్టరు. అందుకే ఆయన దర్జాగా ఆయన వచ్చాడు. నేను అడుగుతున్నా. మరి ఈ జనార్దన్‌రావు అనే మనిషి వీడియోలో ఎలా మాట్లాడగలిగాడు?. ఆ వీడియోను ఎలా బయటకు పంపగలిగారు? ఆశ్చర్యం ఏమిటో తెలుసా? తన ఫోన్ పోయిందని చెప్పిన జనార్దన్‌రావు ఇవన్నీ ఎలా చేశాడు?. ఫోన్లో రికార్డింగ్, ఆయన ఆడియో, వీడియో ఆయన మాటలు. ఫోన్ పోయిందని చెబుతున్న ఈ వ్యక్తి దాంట్లో నుంచి బయటకు పంపించడం, దాంట్లో ఛాట్స్ కూడా క్రియేట్ చేయడం.. అసలు ఆ ఫోన్ నుంచి తప్పుడు, ఫ్యాబ్రికేటెడ్ స్క్రీన్ షాట్స్ తీయడం ఎలా సాధ్యం?. అవన్నీ ఈనాడు, టీవీ5, ఆంధ్రజ్యోతి, టీడీపీ సోషల్ మీడియాలో రావడం ఎలా సాధ్యం?. నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీ అక్టోబర్ 3న బయట పడితే ఇవాళ్టికి 20 రోజులైంది. చంద్రబాబును సూటిగా అడుగుతున్నా. ఇప్పటికి కూడా వారి కంటెస్టెడ్ క్యాండేట్ జయచంద్రారెడ్డిని ఇంత వరకు ఎందుకు అరెస్టు చేయలేదు?. ఎందుకీ మనిషి పాస్‌పోర్టు సీజ్ చేయలేదని అడుగుతున్నా. ఇదే జయచంద్రారెడ్డి అనే వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అత్యంత సన్నిహితుడే అయితే, రెండున్నర ఏళ్ల కిందటి నుంచే యాక్టివిటీ అంతా జరుగుతుంటే, అదే జయచంద్రారెడ్డికి టికెట్ ఇచ్చి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ్ముడు ద్వారకానాథ్‌రెడ్డి మీద ఎందుకు పోటీ పెట్టారు?. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే ఇంకో విషయం చెప్పనా. ఇదే జయచంద్రారెడ్డికి తనకు ఆఫ్రికాలో డిస్టిలరీలు ఉన్నాయని ఎలక్షన్ అఫిడవిట్‌లో రాశారు. మరి ఆరోజు చంద్రబాబుకు అది కనిపించలేదు. ఆఫ్రికా మూలాలు కనిపించలేదు. ఈరోజు మాత్రం ఈనాడు పేపర్ చూస్తే.. అది టిష్యూ పేపర్‌కు ఎక్కువ. బాత్రూమ్ పేపర్‌కు తక్కువ. మరి ఆరోజు ఆఫ్రికా లింకులు కనపడలేదా?. కాస్త ముందుకు పోదాం. పాలకొల్లులో కల్తీ మద్యం ఎవరిది? అక్కడ వాళ్లకేం ఆఫ్రికా లింకులు లేవు కదా? ఏలూరులో పట్టుబడ్డ కల్తీ మద్యం ఎవరిది? వాళ్లకు కూడా ఆఫ్రికా లింకులు లేవు కదా? అమలాపురంలో పట్టుబడ్డ కల్తీ మద్యం ఎవరిది? పోనీ పరవాడలో పట్టుబడ్డ రుత్తుల రాము స్పీకర్‌కు వెరీ క్లోజ్ అసోసియేట్. అక్కడ పట్టుబడ్డ కల్తీ మద్యం ఫ్యాక్టరీ ఎవరిది? రుత్తల రాముకు ఆఫ్రికాతో సంబంధాలున్నాయా? అక్కడి నుంచి స్పిరిట్ వస్తోందా? ఏలూరు జిల్లాకు చెందిన ఒక టీడీపీ నాయకుడు. డజన్ల కొద్దీ ఆ మనిషి మీద కేసులున్నాయి. ఎంత గొప్ప నాయకుడంటే ఎవర్ని పడితే వాళ్లను తిడతాడు కొడతాడు. మహిళలని కూడా చూడకుండా ఆడ అధికారుల్ని జుట్టు పట్టుకుని ఈడ్చుకుని పోతాడు. అంత గొప్ప నాయకుడు మీ అందరికీ తెలుసు. ఆయనే దగ్గరుండి లిక్కర్ మాఫియా నడుపుతున్నాడు. ప్రభుత్వంలో ఉన్న మరో పేకాట కింగ్. అది కూడా నేను చెప్పాల్సిన పని లేదు. టీడీపీ నాయకుడు రేపల్లె నుంచి ఎవరు అంటే మీ అందరికీ తెలిసిందే. డార్లింగ్ మంత్రి అని కూడా అప్పుడప్పుడు రాధాకృష్ణ ముద్దుగా అంటుంటాడు. ఎవరో నేను చెప్పాల్సిన పని లేదు. మీ అందరికీ బాగా తెలుసు. ఇష్టానుసారంగా ఆయన కూడా నకిలీ మద్యం దందా చేస్తున్నాడు. అంతా చంద్రబాబుగారి మనుషులే!: నిజంగా నకిలీ మద్యం ఫ్యాక్టరీలు పెట్టింది చంద్రబాబునాయుడు మనుషులే. నకిలీ మద్యాన్ని తయారు చేసి, తమ మాఫియాలో భాగమైన ప్రైవేట్ లిక్కర్ షాపులకు సరఫరా చేసేదీ వాళ్లే. అక్కడే కాదు. తమ వారు నడిపే బెల్ట్ షాపులకు సప్లయ్ చేసేది కూడా చంద్రబాబు మనుషులు. అమ్మేది కూడా ఈయనకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలే. సీబీఐ దర్యాప్తు చేస్తే ఈ మొత్తం వ్యవహారంలో ఉన్న మూలాలు వెలుగు చూస్తాయి. కానీ చంద్రబాబు సీబీఐకి ఇవ్వడు. ఆయనకు సిట్ అంటేనే ముద్దు. సిట్‌లో ఉన్న సీపీ రాజశేఖర్ ఈ మాఫియా ముఠాలో పెద్ద భాగస్తుడు. ఆయన పర్యవేక్షణ చేస్తున్న ఇబ్రహీంపట్నంలోనే నకిలీ మద్యం మాఫియా బయటపడింది. ఎందుకంటే టాపిక్ డైవర్ట్ చేయాలి. తప్పుడు ప్రచారాలు చేయాలంటే ఇలా సిండికేట్‌లో భాగస్వాములైన వారి చేతుల్లోనే అధికారం ఉండాలి. దొంగ చేతికే తాళం ఇవ్వడం కాదా?: ఇంకో గమ్మత్తైన అంశం ఏంటంటే, ఇకపై లిక్కర్ అమ్మేటప్పుడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అమ్మాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఎందుకంటే లిక్కర్ షాపులు, బెల్ట్ షాపులు ఉన్నవన్నీ తెలుగుదేశం పార్టీ నాయకులవే కదా. పర్మిట్ రూమ్‌లలో లూజ్ లిక్కర్ విక్రయించేది టీడీపీ నాయకులే కదా. నకిలీ లిక్కర్ దందా మొత్తం నడిచేది టీడీపీ కార్యకర్తలు, వారి సిండికేట్ మాఫియా కనుసన్నల్లోనే కాదా? మరి ఇలాంటి వారికే చంద్రబాబు నాయుడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసే బాధ్యతలు ఇస్తున్నాడు. అంటే దొంగ చేతికి తాళాలు ఇవ్వడం అంటే ఇది కాదా? పభ్రుత్వం అమ్మే మద్యంలో 40 శాతం బెల్ట్ షాపుల ద్వారా, మరో 40 శాతం ఇల్లీగల్ పర్మిట్ రూమ్‌లలో అమ్ముతున్నారు. అక్కడే కూర్చోబెట్టి గ్లాసుల్లో పోసి తాగిస్తున్నారు. ఎమ్మార్పీ గాలికెరిగిపోయింది. ఎమ్మార్పీ కథ దేవుడెరుగు ఏం పోస్తున్నారో, ఏం తాగుతున్నారో అర్థం కాదు. మూడో రౌండ్ నాలుగో రౌండ్ కి వచ్చేసరికి ఐదో రౌండ్‌లో ఏం పడుతుందో తెలియదు. ప్రాణాలకు హాని కలిగించే లిక్కర్‌ని కూడా నకిలీ లేబుల్స్ వేసి అమ్మేస్తున్నారు. ఇంకా పెగ్గుల్లో పోసేయడమే కదా అని ఇల్లీగల్ పర్మిట్ రూమ్‌లలో పెగ్గుల్లో పోసేస్తున్నారు. గ్రామాల్లో బెల్ట్ షాపుల్లో యథేచ్ఛగా అమ్మేస్తున్నాడు. ఎక్కడ క్యూఆర్ కోడ్, అక్కడ ఎవరు స్కాన్ చేస్తారు. నాడే క్యూఆర్ కోడ్ తీసుకొచ్చాం: మా హయాంలో ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మద్యం షాప్‌లు నడిచేవి. ప్రభుత్వానికి లాభాపేక్ష లేదు. అందుకే బెల్ట్ షాపులు రద్దు చేశాం. మద్యం షాపులతో పాటు, మద్యం విక్రయ వేళలు కూడా తగ్గించాం. ఇల్లీగల్ పర్మిట్ రూమ్‌లు రద్దు చేశాం. క్యూఆర్ సిస్టం తీసుకొచ్చింది మేమే. ఇంతకు ముందు లేదు. పారదర్శకత ఉండాలని మా ప్రభుత్వం వచ్చాకనే క్యూఆర్ కోడ్ సిస్టం ప్రవేశపెట్టాం. ప్రతి బాటిల్ మీద క్యూఆర్ కోడ్‌లు డైనమిక్‌గా స్కాన్ చేసి అమ్మేవాళ్లం. ఎంప్యానల్డ్ డిస్టిలరీల నుంచి మాత్రమే లిక్కర్ వచ్చేది. ఆ ఎంప్యానెల్డ్ డిస్టిలరీలకు కూడా మేం అనుమతులిచ్చినవి కాదు. గతంలో చంద్రబాబు అనుమతులిచ్చినవే. అవన్నీ ఆయన ఎంప్యానల్డ్ చేసినవే. వందల కోట్లు ఖర్చు చేసి డిస్టిలరీలు పెడితే వాటిలో నాణ్యమైన మద్యం తయారు చేస్తారు. ఆ క్వాలిటీ మద్యానికి క్యూఆర్ కోడ్ పెట్టి ట్రేస్ చేసి గవర్నమెంట్ షాపుల్లో ప్రభుత్వమే అమ్మితే, అమ్మే ప్రతి మందు బాటిల్ క్యూర్ కోడ్ స్కాన్ చేసి విక్రయిస్తే అది తాగే మద్యపాన ప్రియుల ఆరోగ్యానికి కొద్దొగొప్పో గ్యారెంటీ ఉంటుంది. ఆ విధంగా మంచి ఆరోగ్యం ఇచ్చే ప్రయత్నం మా ప్రభుత్వ హయాంలో జరిగింది. కానీ ఈరోజు ప్రజల ఆరోగ్యాన్ని ఫణంగా పెడుతూ విచ్చలవిడిగా నకిలీ మద్యం అమ్మేస్తున్నారు. ఒకవైపున ఎమ్మార్పీ «కన్నా ఎక్కువకి బెల్ట్ షాపులు, ఇల్లీగల్ పర్మిట్ రూమ్‌లలో అమ్మడం కళ్లముందే కనిపిస్తోంది. మరోవైపు నకిలీ, కల్తీ మద్యాన్ని తాగిస్తున్నారు. ప్రతి నాలుగు బాటిల్స్‌లో ఒక నకిలీ మద్యం బాటిల్ అమ్ముతున్నారు. మరోవైపు ఈ ప్రైవేటు మాఫియా లిక్కర్ షాపుల్లో ఏదైతే ఇండెంట్ ప్లేస్ చేస్తారో.. వీళ్లకు కావాల్సిన డిస్టిలరీలకు, వీళ్లకు కావాల్సిన బ్రాండ్లు, వీళ్లకు కావాల్సినవి మాత్రమే గవర్నమెంట్‌కి డబ్బులు కట్టి సప్లై చేస్తారు. ఇవన్నీ ఆశ్చర్యం కలిగించే విషయాలు. డైవర్షన్ కోసం జోగి రమేష్‌ను ఇరికించారు: నకిలీ మద్యం టాపిక్‌ను డైవర్ట్ చేసేందుకు మా నాయకుడు జోగి రమేశ్ మీద ఆరోపణలు చేశారు. ఆయన తన రెండు ఫోన్లు ఇలా చూపించాడు. ఆ జనార్దన్‌రావు ఎవరో తెలియదు. సోషల్ మీడియాలో తిరుగుతున్న ఫొటో కూడా పన్నెండేళ్ల క్రితం ఒక పెళ్లిలో కలిసినప్పుడు తీసిన ఫొటో అని జోగి రమేశ్ చెబుతున్నాడు. అసలా మనిషితో ఏ సంబంధాలు లేవని, ఇవిగో నా ఫోన్ చెక్ చేసుకోమని తన రెండు ఫోన్లు చూపించాడు. కానీ పరిచయమే లేని వ్యక్తితో చాటింగ్ చేసినట్టుగా ఫోన్ పోయిందని చెబుతున్న జనార్దన్‌రావు ఫోన్ నుంచి చాటింగ్ రిలీజ్ అవుతుంది. ఏ స్థాయిలో వీరు దిగజారిపోయారో చూడండి. ఒక ఫ్యాబ్రికేట్ చేసే కార్యక్రమం ఏకంగా వారి ఫోన్ తీసుకోవడమూ, ఆ ఫోన్‌లో చాటింగ్ వీరే జనరేట్ చేయడమూ చేశారు. జోగి రమేశ్ సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేస్తే జనార్దన్‌రావు ఫోన్ పోయిందని ఆయనే కంప్లైట్ ఇచ్చాడు, ఫోన్ లేదు కదా అని చెబుతున్నారు. కానీ ఈలోపల డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా డ్యామేజ్ చేసేది చేస్తున్నారు కదా. ఒక మనిషి టార్గెట్‌గా జరుగుతున్న వ్యక్తిత్వ హననం కాదా ఇది అని అడుగుతున్నా. చంద్రబాబు నిస్సిగ్గు. నిర్లజ్య వ్యవహారం: చంద్రబాబూ నువ్వు చేసింది ఒక వెధవ పని. ఆ వెధవ పనిలో టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఇంకో మనిషి మీద అభాండాలు వేయడం. ఇరికించే కార్యక్రమం చేయడం. ఇరికించే కార్యక్రమంలో ఏకంగా ఆధారాలు తయారు చేయడం. అన్యాయం కాదా ఇది?. మొన్న అక్రమ లిక్కర్ కేసులో ఒకర్ని ఇరికించేదానికి వీళ్ల డబ్బులు రూ.11 కోట్లు తీసుకునిపోయి అక్కడ పెట్టి స్కాం జరిగిందని ప్రచారం చేశారు. అప్పుడు ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు, ఆ నోట్ల మీద ఉన్న నెంబర్ల ఆధారంగా ఎవరు, ఏ బ్యాంక్, ఏ ఖాతా నుంచి డ్రా చేశారు? ఎప్పుడు డ్రా చేశారు? అన్న వివరాలు తెప్పించమని కోర్టులో కేసు ఫైల్ చేసి, ఆర్బీఐకి లేఖ రాశారు. ఆ తర్వాత ఇక మాటల్లేవ్. ఎక్కడైనా ఈ విధంగా రూ.11 కోట్ల డబ్బులు దొరికితే పక్కన పెడతారు కదా?. కానీ ఇక్కడ ఆ పని చేయలేదు. మిగతా డబ్బుతో కలిపేశామని చెప్పారు. అలా ఎలా కలిపేస్తారు?. అంటే, వీరే డబ్బులు తీసుకొచ్చి అక్కడ పెట్టి, ఇతరులపై నింద వేశారు. ఈ టాపిక్ గురించి ఇంకా ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే ఈ చంద్రబాబుకు ఏ మాత్రమైనా సిగ్గు, లజ్జ ఉంటే కొంచెమైనా సిగ్గు పడతాడని అనుకోవచ్చు. కానీ, ఆయనకు అవేవీ లేవు. సో అంబారిస్‌మెంట్ లేదు. అషేమ్‌డ్‌గా ఫీలయ్యేది లేదు. గూగుల్ డేటా సెంటర్. వాస్తవాలు: ‘చంద్రబాబు పర్‌ఫార్మెన్స్‌లో వీక్. క్రెడిట్ చోరీలో పీక్’: రాష్ట్రంలో పరిపాలన గాలికొదిలేసి మరో పక్క యాడ్ ఏజెన్సీ నడిపిస్తున్నట్టుగా కనిపిస్తోంది. మాటలు చూస్తేనేమో కోటలు దాటుతున్నాయి. పెర్ఫార్మెన్స్ చూస్తే వీక్. వేరే వాళ్లకు దక్కాల్సిన క్రెడిట్‌ని తాను చోరీ చేయడంలో చంద్రబాబు పీక్. రాష్ట్రం ఇవాళ ఒక యాడ్ ఏజెన్సీ మాదిరిగా నడుస్తోంది. ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు చంద్రబాబు వ్యవహరించిన తీరు తన సంకుచిత బుద్ధిని చాటుతుంది. నిజంగా వాస్తవాల్లోకి పోతే వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో విశాఖ నగరాన్ని ఇంటర్నేషనల్ టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా 2020, నవంబరులో, అంటే కోవిడ్ సమయంలో కూడా అదానీ డేటా సెంటర్‌కి బీజం పడింది. దాని ఫలితంగా 2023, మే 3న అదానీ డేటా సెంటర్‌కు భూమి పూజ చేయడం జరిగింది. అదొక్కటే కాదు. సబ్‌సీ కేబుల్ (సముద్రగర్భంలో కేబుల్ వేయడం) ద్వారా డేటా ల్యాండింగ్ స్టేషన్ ఏర్పాటుకు సింగపూర్ నుంచి తీసుకొచ్చే కార్యక్రమానికి కూడా అంకురార్పణ అప్పుడే ప్రారంభమైంది. ఈ సబ్‌సీ కేబుల్ అనేది డేటాని తీసుకురాకపోతే ఏ డేటా సెంటర్ రాదు. దానికి ఆనాడు అంకురార్పణ జరక్కపోయి ఉంటే, ఇప్పుడు ఏ డేటా సెంటర్ వచ్చే అవకాశమే లేదు. నాడు, కోవిడ్ పోగానే 2020 నవంబరులో అదానీ డేటా సెంటర్‌కు అలాట్‌మెంట్ చేశాం. ఆ తర్వాత 2023లో భూమి పూజ చేశాం. ఇవి రెండు చాలా ముఖ్యమైన విషయాలు. నాడు బీజం పడింది. నేడు అడుగు ముందుకు: దీని వెనుక వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం, అదానీ గ్రూప్, కేంద్ర ప్రభుత్వం, సింగపూర్ చేసిన కృషి ఎంతో ఉంది. అందరి కృషి వల్ల, దాని కొనసాగింపులో భాగంగా ఈరోజు గూగుల్ రావడం జరిగింది. వైయస్సార్ సీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన, ఆరోజు వేసిన సీడే ఈరోజు ఈ డేటా సెంటర్ కొనసాగింపు. అదానీ పెట్టే 1000 మెగావాట్ల కొత్త ప్రాజెక్టు. ఇంతకు ముందు అదానీ పెట్టిన 300 మెగావాట్ల ప్రాజెక్టుకు విస్తరణే. గూగుల్ పెడుతుందని చెప్పే ఈ 1000 మెగావాట్ల ప్రాజెక్టు, అదానీ పెట్టిన 300 మెగావాట్ల ప్రాజెక్టుకు విస్తరణే. ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా క్లిప్పింగ్. వెరీ ఇంపార్టెంట్ క్లిప్పింగ్. 2022, అక్టోబరు 11న ప్రచురితమైంది. (అంటూ ఆ పేపర్ క్లిప్పింగ్ పీపీటీలో చూపారు) గూగుల్ అసోసియేషన్ విత్ అదానీ ఎంటర్ ప్రైజెస్ రిపోర్టెడ్ ఇన్ అక్టోబర్ 2022. గూగుల్ టేక్స్ ఆన్ లీజ్. 4.6 ల్యాక్స్ స్కెర్ ఫీట్ స్పేస్ ఎట్ అదానీ డేటా సెంటర్ ఎట్ నోయిడానా. అదానీ, గూగుల్‌కు మధ్య బిజినెస్ రిలేషన్‌షిప్ ఒప్పందం అక్టోబర్ 2022లో నోయిడాలో కుదిరింది.. ఇదివారి మధ్య వ్యాపార సంబంధాన్ని చూపించే పేపర్ క్లిప్పింగ్ ఇది. ఈ నేపథ్యంలో విశాఖలో 2023, మే 3న అదానీ డేటా సెంటర్‌కు పునాదిరాయి వేశాం. సింగపూర్ నుంచి సబ్ సీ కేబుల్ తీసుకువచ్చే అంశంపై కూడా అంకురార్పణ అప్పుడే జరిగింది. అదానీకి ల్యాండ్ ఇస్తూ 2020 నవంబరులో జీవో ఇస్తే, 2021లో నాటి వైయస్సార్ సీపీ ప్రభుత్వం సింగపూర్ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఆ లేఖలో చాలా స్పష్టంగా సింగపూర్ గవర్నమెంట్‌ను ఫెసిలిటేట్ చేయమని చెప్పాం. సింగపూర్ నుంచి విశాఖపట్నానికి సబ్ సీ కేబుల్ తీసుకువచ్చే ప్రక్రియలో వారిని కూడా భాగస్వామ్యులు కావాలని చెప్పి.. సింగపూర్ ప్రభుత్వానికి, నాడు ఏపీ ప్రభుత్వం 2020, మార్చి 9న లేఖ రాసింది. ఈ లేఖలో ప్రతి పేరాలో చాలా ముఖ్యమైన విషయాలు అర్థమవుతాయి. దీన్ని మీడియాకు కూడా అందుబాటులో ఉంచుతాం. (అంటూ ఆ లేఖను కూడా పీపీటీలో చూపారు) ఆ లేఖలో చివరి పేరా చదివి వినిపిస్తూ, సింగపూర్ నుంచి విశాఖకు దాదాపు 3900 కి.మీ. సముద్రంలో నుంచి ఈ సబ్ సీ (సముద్రగర్భంలో) కేబుల్ వేయాలి. అలా వేసి ఆ కారిడార్‌ను క్రియేట్ చేస్తే, ఆ డేటాను విశాఖపట్నానికి తీసుకురాగలుగుతాము. ఇక్కడ అదానీ డేటా సెంటర్ కడితే అప్పుడు ఆ డేటా అక్కడికి వస్తుంది. అదానీకి, గూగుల్ కు మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలను నోయిడాలో 2022లో దీనికి సంబంధించి స్పేస్ విషయమైన ఒప్పందం.. ఆ రెండు సంస్థల మధ్య వ్యాపార భాగస్వామ్యం విషయం టైమ్స్ ఆఫ్ ఇండియాలో ప్రచురించిన క్లిప్పింగ్‌ను మనం చూశాం. ఆ తర్వాత ప్రక్రియ. పరంపర: ఆ భాగస్వామ్యం కొనసాగింపులో భాగంగా మనం విశాఖపట్నంలో డేటా సెంటర్ పెట్టాలి అని అనుకోవడం. వీళ్లకి 2020 నవంబరులో స్థలం ఇవ్వడం, 2021 మార్చి 9న సింగపూర్ ప్రభుత్వానికి సబ్ సీ కేబుల్ తీసుకువచ్చేందుకు ఫెసిలిటేట్ చేయమని లేఖ రాయడం, ఆ తర్వాత 2023లో అదే అదానీ డేటా సెంటర్‌కు పునాదిరాయి వేయడం జరిగాయి. ఇదీ బ్యాక్ గ్రౌండ్. 300 మెగావాట్ల డేటా సెంటర్‌కు నాటి అదానీ, వైయస్సార్ సీపీ ప్రభుత్వం, సింగపూర్ ప్రభుత్వం, గూగుల్ ఏ విధంగా అడుగులు వేశారో చెప్పడానికి సంబంధించిన ఆధారాలు, డాక్యుమెంట్లు ఇవి. గూగుల్ డేటా సెంటర్. వెనక వాస్తవాంశాలు: అదే ఈరోజు చూస్తే.. విశాఖలో గూగుల్‌కు మొన్న జరిగింది చూస్తూ.. చంద్రబాబు చెప్పకూడదని ఎంత తాపత్రయపడ్డాడో.. వేరే వారికి క్రెడిట్ ఇవ్వాల్సి వస్తుంది.. తనకు క్రెడిట్ రాదని చెప్పి.. చంద్రబాబు దాచి పెట్టాలని ప్రయత్నం చేశాడో, దానికి సంబంధించిన విషయం. ఇక్కడ కూడా వైజాగ్‌లో అదానీ ఇన్ ఫ్రాకు సంబంధించిన కంపెనీలే. ఈ సెంటర్‌ను నిర్మిస్తున్నాయి. గూగుల్‌కు సంబంధించిన అలెగ్జాండర్ స్మిత్, మన ఐటీ సెక్రటరీ భాస్కర్‌కు ఈ నెల 4న, వారు ఢిల్లీకి పోయి హడావుడి చేసి.. సంతకాలు పెట్టడానికి 10 రోజుల ముందు లేఖ రాశారు. ‘డియర్ మిస్టర్ భాస్కర్.. థ్యాంక్యు ఫర్ దిస్ డిటెయిల్డ్ డిస్కషన్ దిస్ వీక్. ఐ పర్టిక్యులర్లీ అప్రిషియేట్ ఆల్ యువర్ ఎఫర్ట్స్ వైల్ యూ హావ్ బీన్ ట్రావలింగ్ ఇంటర్నేషనన్లీ..ఇన్ ఆర్డర్ టూ ఎన్ ష్యూర్ క్లియర్ కో ఆర్డినేషన్ ఆన్ ఆల్ మేటర్స్. రిలేటెడ్ టూ ల్యాండ్ ప్రిపరేషన్ అండ్ ఆలాట్ మెంట్. వీ వుడ్ లైక్ టూ ఆథరైజ్ మిస్టర్ సంజయ్ బుటానీ.. ఆఫ్ అదానీ టూ సర్వ్ ఏజ్ ఏన్ ఆథరైజ్డ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఏపీ గవర్నమెంట్ ఇన్ ప్రిపేరేషన్ ఫర్ ది ల్యాండ్ అలాట్ మెంట్ యాజ్ షేర్డ్ విత్ యూ ప్రీవియస్ లీ. టూ ఫెసిలిటేట్ ద ల్యాండ్ అలాట్ మెంట్ ప్రాసెస్. ప్లీజ్ సీ ద అటాచ్డ్ డిటెయిల్స్ ఆఫ్ ద రిలవెంట్ అదానీ ఎంటిటీస్.. దట్ వీ ఆర్ ఆథరైజింగ్.. టూ బీ యూజ్డ్ ఫర్ ది ఫార్మల్ అలాట్ మెంట్ ప్రాసెస్ ఈచ్ ఆఫ్ ద త్రీ సైట్ లొకేషన్స్’. దాని అర్థం అదానీ ఇన్ ఫ్రాకు సంబంధించిన మూడు కంపెనీలకు ల్యాండ్ అలాట్ చేయమంటూ గూగుల్ అప్పటి ఐటీ సెక్రటరీ భాస్కర్‌కు లేఖ రాసింది. ఇన్ డీపీఆర్ డిస్కషన్స్.. ఆల్ ఇన్సెంటివ్స్ ఇన్ ది జీవో వీల్ బీ గివెన్ టూ ది అప్లికెంట్.. రాడెన్ ఇన్ ఫో టెక్ ప్రై.లిమిటెడ్. వన్స్ జీవో ఈజ్ ఇష్యూడ్. వీ విల్ దేర్ ఆఫ్టర్ మిస్టర్ భాస్కర్. ఎట్ ద కెపాసిటీ ఆఫ్ ఐటీ సెక్రటరీ..టోటట్ గా ఈ ప్రాజెక్టుకు సంబంధించి గూగుల్‌ను తీసుకువచ్చే దానికి అదానీ రూ.87 వేల కోట్లు పెట్టుబడి పెడుతున్నారు. దిస్ ప్రాజెక్టు ఈజ్ డెవలప్డ్ బై అదానీ. 10 బిలియన్ డాలర్స్ ఖర్చు చేసి గూగుల్ ను తీసుకువచ్చే కార్యక్రమం జరుగుతోంది. ఎంటైర్ ప్రాజెక్ట్ విల్ బీ కన్సŠట్రక్టెడ్ బై అదానీ. వరల్డ్ లార్జెస్ట్ డేటా సెంటర్. అది కట్టిన తర్వాత దాన్ని గూగుల్ క్లయింట్‌గా వాడుకుంటుంది. ఇంతకు ముందు చెప్పినట్లు ముందు కేబుల్ రావాలి. డేటా సెంటర్ కట్టాలి. అప్పుడు గూగుల్ వస్తుంది. ఈ డేటా సెంటర్‌కు సంబంధించిన హార్డ్‌వేర్, టెక్నాలజీని గూగుల్ సమకూరుస్తుంది. ఆ పేరు చెప్పడానికి చంద్రబాబు ఒప్పుకోరు. ఎందుకంటే?: నిజంగా ఇలాంటి డేటా సెంటర్ ను మన దేశానికి చెందిన అదానీ లాంటి గొప్ప కంపెనీ కడుతోందని గొప్పగా, గర్వంగా చెప్పుకోవాల్సింది పోయి.. 10 బిలియన్ డాలర్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇంత కష్టపడి, కేంద్ర ప్రభుత్వం, సింగపూర్ గవర్నమెంట్, వైయస్సార్ సీపీ గత ప్రభుత్వం, రూ.87 వేల కోట్ల పెట్టుబడి.. ఇన్ని పెట్టిన తర్వాత గూగుల్ వస్తోంది. క్రెడిట్ అనేది ఎవరికి ఇవ్వాలి?. కనీసం అదానీ రూ.87 వేల కోట్లు పెడుతున్నాడు. గూగుల్‌ను తెస్తున్నాడు.. థ్యాంక్యూ అని చెప్పాడా చంద్రబాబు కనీసం. క్రెడిట్ ఇచ్చాడా కనీసం. కానీ, ఎందుకు భయపడుతున్నాడు క్రెడిట్ ఇవ్వడానికి? ఆ పేర్లన్నీ చెప్పడం మొదలు పెడితే బ్యాగ్రౌండ్ లోకి పోతుంది. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలోనే ఇది 300 మెగావాట్లకు సంబంధించిందని, దానికి అప్పుడే బీజం పడిందని, అప్పుడే గూగుల్‌కు అదానీకి రిలేషన్ ఉందని, అప్పుడే జగన్ ప్రభుత్వం సింగపూర్ ప్రభుత్వానికి లేఖ రాసిందని, అప్పుడే కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి, అదానీ ఇన్వాల్వ్ అయ్యి, వైయస్సార్ సీపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి.. ఇంత మంది ఇన్వాల్వ్ అయ్యి ఈ గూగుల్ ను ఇక్కడికి తీసుకొచ్చేదానికి బీజం పడింది అని చెప్పడానికి చంద్రబాబునాయుడు హెసిటేట్ చేశాడు. ఎందుకంటే వారందరికీ క్రెడిట్ ఇవ్వడం ఆయనకు ఇష్టం లేదు. చంద్రబాబును చూసి వారు రాలేదు: ఇక్కడ మరో కీలకమైన విషయం చెప్పాలి. ఈ డేటా సెంటర్‌లో అతి ముఖ్యమైన అంశం. సముద్రగర్భంలో వేస్తున్న కేబుల్. సింగపూర్, విశాఖపట్నం మధ్య 3900 కి.మీ. ఆ మేర వైజాగ్‌కు కేబుల్ వేయాలి. అదానీ డేటా సెంటర్ ఏర్పాటులో భాగంగా ఈ కేబుల్ తీసుకుని రావాలి, కేంద్ర ప్రభుత్వం, అప్పట్లో వైయస్సార్ సీపీ ప్రభుత్వం, సింగపూర్ ప్రభుత్వం.. వీరందరూ ఇన్వాల్వ్ అయ్యింటేనే ఇది జరుగుతోంది. చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. ఈరోజు అంతా అయిపోయిన తర్వాత ఈయనొచ్చి ఈయన సుందర ముఖార విందాన్ని చూసి గూగుల్ వచ్చేసినట్లుగా బిల్డప్ ఇచ్చేయడం, అసలు మిగిలిన వాళ్లందరూ చేసిన కృషిని పూర్తిగా సైడ్ లైన్ చేసేయడం, రూ.80 వేల కోట్లు పెట్టుబడి పెడుతున్నాడు పాపం ఆయన. ఆయన్ను కూడా కనీసం వాళ్ల అకేషన్లో ఆయన కూడా లేడు. మళ్లీ ఆయన ట్వీట్ చేశాడు. (అంటూ గౌతమ్ అదానీ ట్వీట్ చూపించి, చదివి వినిపించారు) నాడే భూకేటాయింపు: గతంలో 300 మెగావాట్ల డేటా సెంటర్ కోసం 190 ఎకరాలు ఇచ్చాం. విశాఖపట్నంలోని మధురవాడలో 130 ఎకరాలు, కాపులుప్పాడలో 60 ఎకరాలు అదానీకి వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం కేటాయించడం, అక్కడ ఫౌండేషన్ స్టోన్ వేయడం కూడా జరిగింది. అక్కడ పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు, సబ్ సీ కేబుల్‌ను సింగపూర్ నుంచి విశాఖపట్నానికి తీసుకురావడానికి అంకురార్పణ చేయడం అప్పుడే జరిగాయి. డేటా సెంటర్ చాలా కీలకం: ఇప్పుడు ఇవాళ కొత్తగా వస్తున్న 1000 మెగావాట్ల గూగుల్ ప్రాజెక్టుకు 300 మెగావాట్లు మేం ఇచ్చేటప్పుడే డేటా సెంటర్లో ఉద్యోగ అవకాశాలు తక్కువే. కానీ డేటా సెంటర్ రావడం వల్ల ఒక ఎకో సిస్టమ్ బిల్డ్ అవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది రేప్పొద్దున ప్రపంచాన్ని డామినేట్ చేయబోయే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం. ఆ ఏఐ అయినా లేదా క్వాంటం కంప్యూటింగ్ అయనా, ఫ్యూచర్లో జరిగే ఎటువంటి గొప్ప మార్పుకైనా గానీ డేటా సెంటర్ విల్ బీ ద నోడల్ పాయింట్. ఇక్కడ డేటా ఉంటే ఆ డేటాను రకరకాలగా, మైండ్ అప్లై చేస్తే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అవుతుంది. కాబట్టి డేటా సెంటర్ అనేది కీలకం. ఎప్పుడైతే డేటా సెంటర్ వస్తుందో అప్పుడు ఎకో సిస్టమ్ బిల్డ్ అవుతుంది. ఆ ఎకో సిస్టమ్ ద్వారా గ్లోబల్ కేపబుల్ సెంటర్స్ వస్తాయి. దానికి నాంది ఆరోజు ఆ ఆలోచనలతో అక్కడి నుంచి మొదలైంది. ఆరోజు మేమంతటితో ఆగిపోలేదు: ఆ రోజుల్లో కేవలం 300 మెగావాట్ల డేటా సెంటర్ పెడితే ఉద్యోగాలు తక్కువ వస్తాయి కాబట్టి అంతటితో మేం ఆగలేదు. ఆరోజు అదానీకి మేం చేసుకున్న అండర్ స్టాండింగ్ కాపీ మీరు చూస్తే 25 వేల జాబులు కూడా ఇవ్వాలన్నాం. (అంటూ ఆ కాపీ చూపించారు) ఐటీ పార్క్ పెట్టాలి. స్కిల్ కాలేజీ, రిక్రియేషన్ సెంటర్, స్కిల్ సెంటర్ ఇవన్నీ కూడా పెట్టాలని, వీటి ద్వారా 25 వేల ఉద్యోగాలు ఇవ్వాలని పార్ట్ ఆఫ్ ది అగ్రిమెంట్ చేశాం మేము అప్పట్లో. చంద్రబాబు క్రెడిట్ చోర్: కానీ, గూగుల్ డేటా సెంటర్ రావడం కేవలం తన గొప్ప అన్నట్లుగా చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారు. ఆ వ్యక్తి ఈ మాదిరిగా చేయడం కొత్త కాదు ఇది. చంద్రబాబునాయుడు పరిపాలన ఎలా ఉంటుందంటే ఎఫిషియన్సీ వీక్. వేరేవాళ్లకు సంబంధించిన క్రెడిట్ చోరీ చేయడంలో మాత్రం పీక్. హైదరాబాద్ విషయంలో కూడా చంద్రబాబుది గతంలో ఇదే సేమ్ స్టోరీ. మాదాపూర్‌లో సైబర్ టవర్స్ అన్నది 6 ఎకరాల స్థలంలో ఒక చిన్న ప్రాజెక్టు. దానిపేరు హైటెక్ సిటీ. ఈ హైటెక్ సిటీకి కూడా పునాది రాయి వేసింది ఎవరు? ఎన్.జనార్దన్‌రెడ్డిగారు. కానీ చంద్రబాబుగారు దాన్ని ఎప్పుడూ చెప్పడు. ఆ ఒక్క 6 ఎకరాల్లో 1,40,800 చదరపు అడుగుల బిల్డింగ్. ఒకే ఒక్క బిల్డింగ్. తర్వాత ఎన్.జనార్దన్‌రెడ్డి వెళ్లిపోవడం, ఈయన ముఖ్యమంత్రిగా రావడం, దాన్ని గవర్నమెంట్ రంగంలో చేయడానికి ఎన్.జనార్దన్ రెడ్డి శ్రీకారం చుడితే దాన్ని క్యాన్సిల్ చేసి ఈయన ఎల్ అండ్ టీకి ఇచ్చి కట్టించారు. కానీ ఏకంగా హైదరాబాద్ అంతా నేనే కట్టానని ప్రొజెక్షన్ ఇస్తారు. విషయం ఏమిటంటే 2004లో చంద్రబాబు ఓడిపోయాడు. హైదరాబాద్ అన్నది చంద్రబాబు చేతుల్లో లేదు. 2004, 2009లలో నాన్నగారు గెలిచారు. తర్వాత మరో రెండుసార్లు కేసీఆర్ గారు గెలిచారు. అంటే దాని అర్థం ఏకంగా 20 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడుకు హైదరాబాద్ కు ఎటువంటి సంబంధం లేదు. అయినా కూడా ఈ 20 ఏళ్లలో జరిగిన అభివృద్ధి అంతా ఆయనదే అంటాడు. అయ్యా చంద్రబాబుగారూ.. 6 ఎకరాల్లో చిన్న బిల్డింగ్ కడితే, దాని పేరు హైటెక్ సిటీ అని పెడితే దానితో డెవలప్మెంట్ అనేది అయిపోతుందని అనుకోవడం మూర్ఖత్వం. దాని తర్వాత నువ్వు వెళ్లిపోయావు. దాని తర్వాత రాజశేఖరరెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రి అయ్యారు. ఓఆర్‌ఆర్ ఫేస్ 1. మొత్తం 126 కి.మీ. 2006లో మొదలుపెట్టి 2012లో పూర్తి చేశారు. అది హైదరాబాద్ సిటీనే మార్చేసింది. పీవీ నరసింహారావు ఎక్స్ ప్రెస్ వే. 11.6 కి.మీ. ఫ్లై ఓవర్. ఇండియాలోనే లార్జెస్ట్ ఫ్లై ఓవర్ అక్టోబర్ 2005లో మొదలుపెట్టి నవంబర్ 19, 2009కు పూర్తి చేశారు. జీఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు మార్చి 2005లో మొదలు పెట్టి 23, మార్చి 2008కి పూర్తి చేశారు. ఇవన్నీ రాజశేఖరరెడ్డిగారి హయాంలో స్టార్ట్ చేయడం, పూర్తి చేయడం.. 2004 నుంచి 2014 వరకు వైయస్సార్ గారి రెండు టర్ముల్లో అందులో మొదటి టర్ములోనే ఇవన్నీ పూర్తి అయ్యాయి. ఓఆర్‌ఆర్ ఒక్కటే 2012 దాకా పోయింది. ఆ తర్వాతే ఐటీ ఎగుమతులు గణనీయం: ఇవన్నీ జరిగాయి కాబట్టే చంద్రబాబు దిగిపోయే నాటికి 2003–04లో రాష్ట్రం నుంచి అప్పట్లో తెలంగాణ, ఆంధ్ర కలిసున్న రాష్ట్రం నుంచి ఐటీ, ఐటీ రిలేటెడ్ ఎక్స్ పోర్ట్స్ చూస్తే 5,660 కోట్లు. 5 ఏళ్లలో వైయస్సార్ గారు ముఖ్యమంత్రి కావడం, 2004 నుంచి 2009 ఐదే 5 సంవత్సరాల్లో ఇవన్నీ వైయస్సార్ గారు చేయగలిగారు కాబట్టే ఐటీ, ఐటీ ఎగుమతులు ఎంతో తెలుసా? 2008–09 వచ్చే సరికే రూ.32,509 కోట్లు. మరి ఎక్కడ రూ.5,600 కోట్లు ఎక్కడ రూ.32,509 కోట్లు? ఆ తర్వాత సెకండ్ టర్మ్ వచ్చే సరికే.. ఆయన చనిపోయినా కానీ ఆయన గెలిపించి ఇచ్చిన ప్రభుత్వం.. ఆ టైమ్ అయిపోయే సరికే 2013–14 వచ్చే సరికే ఐటీ ఎగుమతుల విలువ ఏకంగా రూ.57 వేల కోట్లు. హైదరాబాద్ అంతా నేనే కట్టేశాను. ఐటీ అంటే నేనే అని చెప్పుకునే చంద్రబాబు. ఒక్కసారి వాస్తవాలు చూడండి. సీ ద డిఫరెన్స్. వేరేవాళ్లు చేసిన దానికి వాళ్లకు క్రెడిట్ ఇవ్వాలి. దాని తర్వాత నాన్న తర్వాత కేసీఆర్ వచ్చారు. ఆయన రెండుసార్లు పదవిలో ఉన్నారు. ఆయన కూడా గొప్పగా నాన్న గారి దగ్గర నుంచి ఎక్కడైతే ఎండ్ అయ్యిందో ఆయన కూడా గొప్పగా స్టార్ట్ చేశాడు. ఆయన కూడా గొప్ప పరిపాలన చేశాడు. దాని వల్ల హైదరాబాద్ ఈరోజు ఐటీలో మేటిగా ఉంది. ఈరోజు ఐటీ ఎక్స్ పోర్ట్స్ తెలంగాణ నుంచి రూ.2 లక్షల కోట్లు. మరి ఎక్కడ రూ.5,660 కోట్లు నువ్వు వదిలేసింది? ఎక్కడ ఇవాళ రూ.2 లక్షల కోట్లు. మధ్యలో 20 ఏళ్లలో ఇంత జరిగితే.. అది కేవలం నేను నాన్న చేసినదే చెప్పాను. కేసీఆర్ గారు చేసింది చెప్పలేదు. అది చెప్పకనే మొత్తం నేనే చేసినా, హైదరాబాద్ మొత్తం నాదే అంటే ఎట్లుంటుంది? చంద్రబాబునాయుడుకు ఇది కొత్త కాదు. ఇది సహజంగా చంద్రబాబుకు ఉండే పబ్లిసిటీ స్టంట్. క్రెడిట్ వేరేవాళ్లకు ఎవరికైనా కూడా ఇవ్వడు. వేరేవాళ్లకు ఇవ్వాల్సిన డ్యూ క్రెడిట్ ఇవ్వకపోవడం చంద్రబాబుకు ఉన్న దుర్మార్గమైన నైజం. విశాఖ. ఉత్తరాంధ్ర గురించి ఆలోచించింది మేమే: విశాఖపట్నం గురించి ఇంత ఆలోచన చేసి, విశాఖపట్నం అన్నది ఎంతో ఇంపార్టెంట్ ప్రదేశంగా, ఆంధ్రరాష్ట్రం పెరగాలంటే, హైదరాబాదునో, బెంగళూరునో, చెన్నైనో తలదన్నే పరిస్థితి రావాలంటే విశాఖపట్నంలో, ఉత్తరాంధ్రలో ఏమేమి చేస్తే ఆ స్థాయిలోకి మనం పోగలగుతాం అని ఆలోచన చేసి అడుగులు వేశాం మేము.వైయస్సార్ సీపీ ప్రభుత్వం. అందులో భాగంగా మేం వేసిన అడుగులు.. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు. 2,700 ఎకరాల్లో చంద్రబాబు హయాంలో ఎంత అక్విజేషన్ చేశారో తెలుసా? కేవలం 377 ఎకరాలు. అంతే. వైయస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.900 కోట్లు ఖర్చు పెట్టాం ల్యాండ్ అక్విజేషన్‌కు, ఆర్ అండ్ ఆర్ కు. ల్యాండ్ కంప్లీట్ చేసి, ఎయిర్ పోర్టు నిర్మాణం మొదలు పెట్టి 30 శాతం పూర్తి చేశాం. ఇంకో సంవత్సరంలో ప్రాజెక్టు కూడా అయిపోతుంది. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళంలో మూలపేట కొత్త పోర్టు. ఉత్తరాంధ్ర దశ, దిశ మార్చాలంటే శ్రీకాకుళంలో ఒక పోర్టు రావాలి, వస్తేనే ఉత్తరాంధ్ర దశ, దిశ మారుతుందని మూలపేటలో గవర్నమెంట్ పోర్టు.. ల్యాండ్ అక్విజేషన్ పూర్తి చేసి, క్లియర్స్ అన్నీ తీసుకొచ్చి, నిర్మాణం మొదలు పెట్టి 30 శాతం పూర్తి చేశాం. విజయనగరంలో మెడికల్ కాలేజ్. 3 బ్యాచులు క్లాసులు కూడా జరిగాయి. కోర్సులు కూడా కంప్లీట్ అయ్యాయి. పాడేరు మెడికల్ కాలేజీ, క్లాసులు స్టార్ట్ అయ్యాయి. పార్వతీపురం మెడికల్ కాలేజీ, పనులు జరుగుతున్నాయి. నర్సీపట్నం మెడికల్ కాలేజీ పనులు జరుగుతున్నాయి. ఉద్దానంలో కిడ్నీ రీసెర్స్ సెంటర్. రూ100 కోట్లతో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ బిల్డింగ్. రూ.600 కోట్లు ఖర్చు చేసి హిరమండలం నుంచి సర్ఫేజ్ వాటర్ తీసుకొచ్చి డయాలసిస్ పేషెంట్లకు పర్మినెంట్ సొల్యూషన్ చూపించే కార్యక్రమానికి పనులు మొదలు పెట్టడమే కాదు పూర్తి చేశాం. సీతంపేటలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పార్వతీపురంలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దాదాపు పూర్తి. కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ దాదాపు పూర్తయ్యే దశలో ఉన్నాయి. సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీ పనులు జరుగుతున్నాయి. నక్కపల్లిలో ఇండస్ట్రియల్ హబ్, అన్నవరంలో ఒబెరాయ్ హోటల్ రిసార్ట్. ఒక 5 స్టార్ హోటల్ రిసార్టులు విశాఖపట్నంలో ఉండటం చాలా అవసరం అనిచెప్పి మే ఫేర్కు ఒబెరాయ్‌ని తీసుకొచ్చి అక్కడ 5 స్టార్ హోటల్ రిసార్టును మొదలుపెట్టించాం. డెస్టినేషన్ గా విశాఖపట్నం ఉండాలి అంటే 5 స్టార్ రిసార్టులు ఉండాలి అని చెప్పి. రుషికొండ వద్ద హై ఎండ్ టూరిజం రిసార్ట్. ఇట్స్ ఎ మాన్యుమెంట్ బిల్డింగ్ దేర్. ఇక్కడ చదరపు అడుగుకు రూ.10 వేలు పెట్టి కట్టిందే కడుతున్నారు. ఎన్నిసార్లు కట్టినా కట్టిందే కడుతున్నారు. డబ్బులు వేస్ట్ అవుతున్నాయి. ఎన్నిసార్లు కడతారో అర్థం కాదు. అదే సెక్రటేరియట్ రెండు సార్లు కడతారు, అదే అసెంబ్లీ రెండు సార్లు కడతారు, రూ.600 కోట్ల పైగా డబ్బు వేస్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరికీ కనపడుతోంది కానీ డబ్బులు వేస్ట్ అని ఎవడూ మాట్లాడడు. ఎందుకంటే ఎల్లో మీడియా మొత్తం వాళ్లే. అంతా దోచుకోవడం, పంచుకోవడం తినుకోవడం. చదరపు అడుగుకు బెంగళూరులో గానీ, హైదరాబాద్ లో గానీ, చెన్నైలో గానీ కడితే 5 స్టార్ ఫెసిలిటీస్‌తో ఫ్లాట్ కడితే చదరపు అడుగుకు రూ.4500 అవుతుంది. కానీ, ఇక్కడ అమరావతిలో అదే చదరపు అడుగును రూ.10 వేలకు కడుతున్నారు. అయినా ఎవడూ స్కామ్ అని చెప్పి అనడు. ఎందుకంటే స్కాములో వీళ్లంతా భాగస్వాములే. మా హయాంలో అదానీ డేటా సెంటర్ తద్వారా వచ్చిన గూగుల్, ఇన్ఫోసిస్, ఇనార్బిట్ మాల్, కైలాసగిరి సైన్స్ మ్యూజియం, రిషికొండ వద్ద టీటీడీ దేవాలయం, ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్.. ఇవన్నీ కొన్ని ప్రాజెక్టులు నేను చెబుతున్నా. ఇవన్నీ జరిగి.. విశాఖపట్నం నుంచి రోడ్డు– టు ది ఎయిర్‌పోర్ట్ అండ్ టు ది మూలపేట పోర్టు. సెంట్రల్ గవర్నమెంట్‌ను కన్వీన్స్ చేసి గట్కరీ గారితో స్టేట్‌మెంట్ ఇప్పించాం. ఇవన్నీ జరిగితే అదొక కారిడార్. ఇది విజన్. ఇవన్నీ పూర్తయితే పురోగతి అనేది కనిపిస్తుంది. నంబర్స్ కనిపిస్తాయి. లేకపోతే రూ.5650 కోట్లే పెద్ద నంబర్ అని డబ్బాలు కొట్టుకోవడమే. రాష్ట్రం పెరగాలంటే ఏం చేయాలనే విజన్ అనేది లేకుండా.. వీళ్లు ఏరకంగా ఉన్నారనేది ఇవన్నీ ఉదాహరణ. నాడు అనేక సంస్కరణలు. అభివృద్ధి పనులు: మా హయాంలో గొప్పగా చెబుతున్నా.. దేవుడి దయతో, ప్రజల ఆశీర్వాదాలతో ఐదేళ్ల కాలంలో రెండేళ్లు కోవిడ్ ఉన్నా కూడా.. కేవలం మా చేతుల్లో మూడు సంవత్సరాల టైమ్ మాత్రమే ఉన్నప్పటికీ.. గొప్ప గొప్ప సంస్కరణలు తేగలిగాం. స్కూళ్లు మార్చాం.. నాడు–నేడు అయితేనేమీ, డిజిటల్ క్లాస్ రూమ్స్, టోఫిల్ క్లాస్‌లు, 8వ తరగతి పిల్లల చేతుల్లో ట్యాబ్‌లు, సీబీఎస్‌ఈ కాదు ఐబీ సిలబస్ తీసుకువచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. విద్యా, వైద్యం, వ్యవసాయంలో అనూహ్య మార్పులు తీసుకువచ్చాం. గ్రామాల్లో సేవలు గడప వద్దకు తీసుకువచ్చాం. గవర్నమెంట్ సేవల్లో పారదర్శకత ఉండదనే భావన లేకుండా చేశాం. ప్రభుత్వ సేవలు లంచాలు లేకుండా పొందగలమనే అభిప్రాయం ప్రజల్లో స్వచ్ఛందంగా నిరూపించగలిగాం. గొప్పగా అందించగలిగాం. గొప్ప గొప్ప సంస్కరణలు తీసుకువచ్చాం. చాలా సంతోషంగా, గర్వంగా ఉన్నాం. మూడేళ్లలో ఎవరూ చేయలేని గొప్ప కార్యక్రమాలు దేవుడి దయతో చేయగలిగాం. అందుకే ఈరోజుకీ చిరునవ్వుతో మా పార్టీ క్యాడర్ ఏ గడప వద్దకు అయినా వెళ్లగలుగుతున్నారు. మేం చేసిన మహిళా సాధికారత, పలు రంగాల్లో సంస్కరణలు మాకు శ్రీరామరక్షగా నిల్చాయి. ఈరోజు ప్రజలు గొప్పగా మమ్మల్ని రిసీవ్ చేసుకునే పరిస్థితిలో గొప్పగా పరిపాలన చేయగలిగామని చెప్పగలుగుతున్నాం. ప్రభుత్వ ఉద్యోగులు. చంద్రబాబు పిల్లిమొగ్గలు: ఒకే ఒక్క డీఏ. 100 డ్రామాలు: చంద్రబాబు ప్రచారం నిజంగా ఎలా ఉంటుందంటే.. ఉద్యోగులకు ఇచ్చిన డీఏ చిన్న ఉదాహరణ. ఆయన సీఎం కుర్చీలోకి వచ్చి 18 నెలలు అవుతోంది. పెండింగ్‌లో 4 డీఏలు ఉన్నాయి. జనవరి 2004, జూలై 2024, డిసెంబర్ 2024, జూలై 2025 ఇలా 4 డీఏలు పెండింగ్. ఒక్క డీఏ కూడా ఇంతవరకు ఇవ్వలేదు. ఉద్యోగులంతా రోడ్డెక్కిన తరువాత అనేక డ్రామాలు చేస్తూ ఒక్క డీఏ ప్రకటించాడు. ఆ ప్రకటనే తప్ప.. ఇంత వరకు ఇచ్చింది లేదు. ఫస్ట్ దసరా అన్నాడు, తరువాత నవంబర్ అన్నాడు.. తరువాత దీపావళి అన్నాడు.. దానికి పెద్ద బిల్డప్ ఇచ్చారు. వాళ్లకు రావాల్సింది నాలుగు ఉంటే ఒక్క డీఏకి ఉద్యోగులంతా సంబరాలు అంటూ ప్రచారం నడిపారు. గిమ్మిక్కులు చేశారు. చివరకు ఇచ్చిన ఒక్క డీఏ జీవో వచ్చిన తరువాత చూస్తే ఈ డీఏ అరియర్స్ కూడా రిటైర్డ్ అయిన తరువాత ఇస్తామని చెప్పారు. 3.5 లక్షల మంది పెన్షనర్లకు డీఆర్ రెండేళ్ల తరువాత 2027–28లో ఇస్తామని ప్రకటించారు. దీనికి దీపావళి కానుక, సంబరాలు అంటూ ఏకంగా ప్రచారాలు చేశారు. చరిత్రలో ఎవరూ ఎప్పుడూ చేయలేదు ఇలా. డీఏ అరియర్స్ రిటైర్డ్ అయిపోయిన తరువాత ఇచ్చే కార్యక్రమం చరిత్రలో జరగలేదు. కానీ, చంద్రబాబు జీవో ఇచ్చాడు. కోవిడ్ లాంటి కష్టకాలంలో ఉన్నా కూడా ఉద్యోగుల విషయంలో వెనకడుగు వేయలేదు. మామూలుగా ఐదేళ్ల కాలంలో 10 డీఏలు ఇవ్వాలి కానీ, వైఎస్సార్ సీపీ హయాంలో 11 డీఏలు ఇచ్చాం. కోవిడ్ లాంటి కష్టకాలంలో ఉన్నా కూడా ఉద్యోగుల పక్షాన నిలిచి 11 డీఏలు ఇచ్చాం. చంద్రబాబునాయుడు అంతకుముందు ప్రభుత్వంలో కేవలం 8 డీఏలు మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక నాలుగు పెండింగ్ ఉంటే ఒకటి ఇస్తానన్నాడు.. ఆ ఒకటి కూడా డీఏ అరియర్స్ రిటైర్డ్ అయ్యాక అన్నాడు. పెన్షనర్లకు డీఆర్ రెండేళ్ల తరువాత 2027–28లో ఇస్తానని ప్రకటించాడు. చంద్రబాబు ఇచ్చిన జీవోపై ప్రతి ఉద్యోగి తిట్టడం మొదలుపెట్టారు. దీనికి పండగ చేసుకోవడం ఏంటీ..? గతంలో ఎప్పుడూ జరగలేదు ఇలా.. గతంలో ఎన్నడూ జరగనిది చంద్రబాబు చేస్తున్నాడు.. ఇంత అన్యాయమైన ముఖ్యమంత్రి ప్రపంచ చరిత్రలో ఎవరూ ఉండరని తిట్టడం మొదలుపడితే.. తిడుతున్నారని జీవో సవరించాడు. సవరించిందే కానీ, ఇంత వరకు పైసా ఇచ్చింది లేదు. ఇక పోలీస్ సోదరులకు ఇచ్చే సరెండర్ లీవ్స్ 4 పెండింగ్. ఒక్కో సరెండర్ లీవ్‌కు రూ.210 కోట్లు అవుతుందనుకుంటే.. అందులో రూ.105 కోట్లు ఇప్పుడిస్తాడట (అదీ ఇవ్వలేదు), మిగిలిన రూ.105 కోట్లు జనవరిలో ఇస్తానని చెప్పాడు. ఇస్తానదాంట్లో రూపాయి ఇవ్వలేదు.. మరి దీన్ని చూసి ఉద్యోగులంతా పండగ చేసుకోవాలంట!. ఎలా సంబరాలు చేసుకోవాలి?. నాలుగింట్లో ఒకటి.. ఆ ఒకటిలో సగం.. చెప్పిన సగం కూడా ఇవ్వలేదు.. మళ్లీ సంబరాలు చేసుకోవాలంటున్నాడు.. ఎలా పండగ చేసుకుంటారు ఎన్నికల్లో చంద్రబాబు తీపి తీపి మాటలతో ఎంప్లాయీస్‌కు వైకుంఠం చూపించాడు. పాపం వాళ్లు నిజంగానే మోసపోయారు. తీరా ఇప్పుడు వారిని మోసం చేసి నడిరోడ్డున నిలబెట్టి చంద్రబాబు వికత ఆనందం పొందుతున్నాడు. ఉద్యోగులకు పచ్చి దగా. వంచన: టీడీపీ మేనిఫెస్టోలో ఉద్యోగుల గౌరవాన్ని పునఃప్రతిష్ట చేస్తానని రాశాడు. తీరా ఇవాళ చూస్తే పచ్చ బిళ్లలు వేసుకొని గవర్నమెంట్ ఆఫీసుల్లోకి వెళ్లి.. టీడీపీ వాళ్లు దాడులు చేస్తున్నారు. ఏమైనా అంటే పొలిటికల్ గవర్నెన్స్ అని నిర్మోహమాటంగా అంటున్నారు. ఓపీఎస్ అంటూ ఎన్నికలకు ముందు నమ్మబలికాడు. మేం తెచ్చిన జీపీఎస్ ఈరోజు లేదు. ఓపీఎస్ లేదు. జీపీఎస్ కోసం మేము యాక్ట్ తెస్తే.. ఇతను రూల్స్ ఫ్రేమ్ చేసి రిలీజ్ చేసి ఉంటే.. జీపీఎస్ ఫలితాలు ఈపాటికే ఉద్యోగస్తులకు వచ్చేవి. అలాంటిది ఇవాళ ఉద్యోగస్థులకు జీపీఎస్ లేదు, ఓపీఎస్ లేదు.. త్రిశంక స్వర్గంలో ఉద్యోగులు ఉన్నారు. మరోవైపున మేము తెచ్చిన జీపీఎస్‌ను కొనియాడుతూ కేంద్ర ప్రభుత్వం దగ్గర్నుంచి అనేక రాష్ట్రాలు దీన్ని స్వీకరిస్తూ ముందుకు పోతున్నాయి. ఎన్నికలప్పుడు ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ అన్నాడు.. అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ అన్నాడు. ఎన్నికలు అయిపోయాయి. అధికారంలోకి వచ్చాడు. ఐఆర్ గురించి మాట కూడా మాట్లాడడు. పీఆర్సీ మరీ దారుణం. ఎక్కడ పీఆర్సీ నిర్ణయం త్వరగా వస్తే.. ఎక్కడ ఉద్యోగస్తుల జీతాలు పెంచాల్సి వస్తుందనే ఉద్దేశంతో.. మా ప్రభుత్వంలో వేసిన పీఆర్సీ చైర్మన్‌ను రద్దు చేసి వెళ్లగొట్టాడు. పీఆర్సీ కొత్త చైర్మన్‌ను నియమించలేదు. నియమిస్తే ఉద్యోగుల జీతాల పెంచాలి. ఐఆర్ ఇవ్వకపోవడం ఒక మోసం అయితే.. ఉద్యోగస్తులకు న్యాయంగా, ధర్మంగా పెరగాల్సిన జీతాలను కుట్రపూరితంగా అడ్డుకోవడం అన్నింటి కంటే దుర్మార్గం. ఉద్యోగులకు ఇవ్వాల్సిన పీఆర్సీ బకాయిలు, పెండింగ్ డీఏలు, జీపీఎఫ్, ఏపీజీఎల్‌ఐ, మెడికల్ రీయింబర్స్‌మెంట్‌లో సరెండర్ లీవ్స్ మొత్తం దాదాపుగా రూ.31 వేల కోట్లు. ఇంత వరకు బకాయిలు పడ్డాడు. దీని గురించి మాట్లాడడు. ఎన్నికల ముందు ప్రతి నెలా ఒకటో తేదీనే ఉద్యోగస్తులకు జీతాలు అన్నాడు. పెన్షనర్లకు పెన్షన్లు అన్నాడు. ఎన్నికలు అయిపోయాయి.. ఒక నెల ఇచ్చాడంతే.. ఈరోజు ఉద్యోగస్తుల పరిస్థితి ఏంటంటే.. నెలలో జీతాలు ఎప్పుడిస్తారో కూడా తెలియదు. మేము మా ప్రభుత్వ హయాంలో కోవిడ్ లాంటి సమస్యలు ఉన్నా.. రెండేళ్లు కోవిడ్ పరిస్థితులు ఉన్నా.. అయినా ఏరోజూ కూడా ఉద్యోగస్తుల జీతాల విషయంలో ఇబ్బందులు పడే పరిస్థితి తేలేదు. మా పరిస్థితుల్లో చంద్రబాబు ఉండి ఉంటే.. రాష్ట్రం అతలాకుతలం అయిపోయింది.. జీతాలు మీరు రెండు నెలలు వదిలేసుకోండి.. రాష్ట్రం కోసం కాంట్రిబ్యూట్ చేయండి అని పిలుపునిచ్చేవాడు డెఫినెట్‌గా. మరోవైపు అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు ప్రభుత్వ పథకాలు వర్తింపజేస్తానని హామీ ఇచ్చాడు. అసలు ఆ ఇచ్చే పథకాలే అరకొర. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్‌లు గాలికి ఎగిరిపోయాయి. మా పథకాలన్నీ రద్దు అయిపోయాయి. ఆ ఇచ్చేవే అరకొర.. వాటిల్లో కూడా కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ వాళ్లకు ఇవ్వడానికి చంద్రబాబుకు మనసు రావడం లేదు. అధికారంలోకి రాగానే వాలంటీర్లకు ఇచ్చే జీతం రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతానన్నాడు.. ఎన్నికల సమయంలో వాళ్లకు ఆశపెట్టి, ఉపయోగించుకొని, వాళ్లపై కుట్ర చేసి ఎన్నికలు అయిపోయిన తరువాత వాళ్లను రోడ్డు మీద పడేశాడు. రూ.5 వేల నుంచి రూ.10 వేలు దేవుడెరుగు.. ఉన్న ఉద్యోగాలన్నీ పీకేశాడు. 2.66 లక్షల మందిని రోడ్డునపడేశాడు. మేము అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే ఐఆర్ ఇచ్చి ఉద్యోగస్తుల జీతాలు పెంచాం. 2019 మే 30న ప్రమాణస్వీకారం చేస్తే.. జూన్ 8న 27 శాతం ఐఆర్ ప్రకటించి జూలై 1 నుంచి అమలు చేశాం. అది ఉద్యోగస్తుల మీద మాకున్న కమిట్‌మెంట్. ఉద్యోగులను క్రమబద్ధీకరించాం: మా ప్రభుత్వం రాగానే 52 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశాం. వారు దశాబ్దాలుగా ధర్నాలు చేస్తున్నా ఎవరూ పట్టించుకోలేదు. కాంట్రాక్టు ఎంప్లాయిస్‌ని రెగ్యులరైజ్ చేయడం మొదలుపెట్టాం. 10,117 మందిని గుర్తించాం. ఇందులో 3,400 మందిని రెగ్యులరైజ్ చేస్తూ ఆర్డర్స్ ఇచ్చాం. మిగిలిన వారికి అన్ని ప్రక్రియలు పూర్తి చేసి రెడీగా ఉన్నా ఎన్నికల ప్రక్రియ వల్ల ఆగిపోతే వారిని ఇంతవరకు చంద్రబాబు రెగ్యులరైజ్ చేయలేదు. కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాలు టైమ్ స్కేల్ ఇచ్చి జీతాలు పెంచడమే కాకుండా వారికి ప్రతినెలా ఒకటో తారీఖున జీతాలిస్తూ ప్రభుత్వమే అధికారికంగా ఏకంగా సర్క్యులర్ ఇచ్చాం. ఇంతవరకు ప్రభుత్వం సరŠుక్కలర్ జారీ చేసి మెడమీద కత్తిపెట్టుకునే కార్యక్రమం ఎప్పుడూ జరగలేదు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కష్టాన్ని దోచుకునే అరాచక విధానాలకు స్వస్తి పలికి దళారీ వ్యవస్థను తీసేసి వారి బతుకులు మార్చాలనే ఉద్దేశంతో ఆప్కాస్ అనే ఔట్‌సోర్సింగ్ కార్పొరేషన్ క్రియేట్ చేసి లక్ష మంది ఉద్యోగులకు ఒకటో తారీఖునే జీతాలిచ్చేలా దళారీ వ్యవస్థను తీసేసి మేలు చేశాం. ఈరోజు మళ్లీ ఆప్కాస్ ని నీరు గారుస్తున్నారు. చివరికి గుడుల్లో భాస్కర్ నాయుడు అనే చంద్రబాబు బంధువును తీసుకొచ్చి ఆప్కాస్ పరిధిలో ఉండే శానిటేషన్ వర్కులు కూడా వీళ్లే తీసుకున్నారు. ఆ ఉద్యోగుల జీతాలు పెంచాం: మేం అధికారంలోకి వచ్చిన వెంటనే ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతిలో పని చేస్తున్న వారందరీ జీతాలు పెంచాం. మేం అధికారంలోకి రాక ముందు ఏడాది వారి జీతాలకు అయ్యే ఖర్చు రూ.1100 కోట్లు ఉంటే మేం వచ్చిన వెంటనే రూ. 3300 కోట్లకు పెంచాం. కానీ నేడు చంద్రబాబు నాయుడు సచివాలయ ఉద్యోగుల వల్ల, ఆర్టీసీ ఉద్యోగుల వల్ల ఆప్కాస్ వల్ల జీతాలివ్వడం కష్టంగా ఉందని కథనాలు చెబుతున్నాడు. దీనర్థం ఏంటంటే 52 వేల మంది ఉన్న ఆర్టీసీ ఉద్యోగుల మీద చంద్రబాబు కన్ను పడింది. లక్ష ఆప్కాస్ ఉద్యోగుల మీద కన్నుపడింది. దాదాపు 1.35 లక్షల పైచిలుకు ఉన్న ఉద్యోగుల మీద కన్నుపడింది. ఒకసారి వీళ్లను క్లీన్ చేశాడంటే తర్వాత మిగిలిన వారిని కూడా స్లోగా క్లీన్ చేయొచ్చన్నది ఆయన దుర్భుద్ధి. విద్యాదీవెన, వసతి దీవెన పూర్తిగా ఆగిపోయింది: ఉద్యోగులకు ఎలాగూ చేయడం లేదు. పోనీ ప్రజలకు ఏమైనా చేస్తున్నాడా అంటే, అది కూడా గుండుసున్నా కనిపిస్తుంది. ఎప్పుడూ చూడని పరిస్థితులు ఈరోజు కనిపిస్తున్నాయి. విద్య, వైద్యం, వ్యవసాయం, గవర్నెన్స్, లా అండ్ ఆర్డర్.. మొత్తం అన్నీ తిరోగమనమే కనిపిస్తుంది. దేర్ ఈజ్ నథింగ్ దట్ చంద్రబాబు నాయుడు కెన్ సే దీనివల్ల నేను మేలు చేయగలిగాను అని. స్కూళ్లలో నాడు –నేడు పనులు ఆగిపోయాయి. గోరుముద్ద క్వాలిటీ పోయింది. మూడో తరగతి నుంచి చెప్పే టోఫెల్ క్లాసులు ఎత్తేశారు. ఇంగ్లిష్ మీడియం చదువులు గాలికి ఎగిరిపోయాయి. ఎనిమిదో తరగతి పిల్లలకు ఇచ్చే ట్యాబులు ఆగిపోయాయి. అమ్మ ఒడి అనేది అరకొరగా ఇచ్చారని నేను చెప్పాల్సిన పనిలేదు. విద్యాదీవెన, వసతి దీవెన పూర్తిగా ఆగిపోయింది. 7 త్రైమాసికాల ఫీజు రీయింబర్స్‌మెంట్ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఒక్కో క్వార్టర్‌కి దాదాపు రూ.700 కోట్లు చెల్లించాలి. దాదాపు రూ.4500 కోట్లు ఇవ్వాల్సి ఉంటే ఇచ్చింది కేవలం రూ. 700 కోట్లు. రెండేళ్లుగా వసతి దీవెన రూ.2200 కోట్లు అసలు ఇవ్వలేదు. గతంలో జనవరిలో ఇచ్చేవాళ్లం. జవనరి 2024, జనవరి 2025కి పెండింగ్‌లో పెట్టారు. వైద్యరంగం అధోగతి: వైద్య రంగం చూస్తే రూ.25 లక్షలు దాకా పేదలకు ఉచితంగా వైద్యం ఆరోగ్యశ్రీ పథకాన్ని నీరుగార్చేశారు. రూ.25 లక్షల వరకు ప్రతిపేదవాడికి ఉచితంగా వైద్యం అందించడానికి నెలకు రూ.300 కోట్లు ఖర్చవుతుంది. 17 నెలలుగా పెండింగ్‌లో పెట్టారు. దాదాపు రూ. 5100 కోట్లు చెల్లించాల్సి ఉంటే రూ. వెయ్యి కోట్లు కూడా ఇవ్వలేదు. రూ.4 వేల కోట్లు బకాయిలు. నెట్‌వర్క్ ఆస్పత్రులన్నీ చేతులెత్తేశాయి. ఈరోజు విజయవాడలో ధర్నా చేస్తున్నాయి. పేదవాడికి ఆరోగ్య భరోసా ఇవ్వాల్సిన ఆస్పత్రులు పేదవాడిని వదిలేసి చంద్రబాబు పుణ్యాన ధర్నా చేయాల్సిన దుస్థితి. ఆరోగ్య ఆసరా గాలికి ఎగిరిపోయింది. కుయ్ కుయ్ అంటూ రావాల్సిన 108, 104 అంబులెన్స్‌లు చంద్రబాబు ఆఫీసులో పనిచేసే తెలుగుదేశం పార్టీకి చెందిన డాక్టర్స్ వింగ్ అధ్యక్షుడికి చెందిన రూ.5 కోట్లు టర్నోవర్ కూడా లేని కంపెనీకి కాంట్రాక్టు ఇచ్చేశారు. ఇలా స్కాములు చేస్తుంంటే అంబులెన్స్‌లు ఎలా నడుస్తాయి? విలేజ్ క్లీనిక్‌లు, పీహెచ్‌సీలు, డిస్ట్రిక్ట్ ఆస్పత్రులు, జీరో వేకెన్సీ రిక్రూట్‌మెంట్ పాలసీలన్నీ గాలికి ఎగిరిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. మా హయాంలో డబ్ల్యూహెచ్‌వో జీఎంపీ ప్రమాణాలు కలిగిన మందులు ఆస్పత్రుల్లో అందుబాటులో ఉండేవి. ఇప్పుడు ఆ మందులు దేవుడెరుగు. దూదికి దిక్కులేదు. ఇవన్నీ ఒకవైపు ఉంటే మా హయాంలో తీసుకొచ్చిన 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి అందులో 7 మెడికల్ కాలేజీలు పూర్తి చేశాం. రూ.8 వేల కోట్లకు గాను రూ.3 వేల కోట్లు మా హయాంలోనే ఖర్చు చేశాం. మిగిలిన 10 మెడికల్ కాలేజీలు పూర్తి చేయడానికి సంవత్సరానికి వెయ్యి కోట్లు ఖర్చు చేస్తే సరిపోతుంది. కానీ వాటిని పూర్తి చేయడం ఇష్టం లేక సగంలో ఉన్న కాలేజీలను స్కాములు చేస్తూ ప్రైవేటుకి అమ్మడానికి సిద్ధమయ్యారు. ఇదీ కార్యాచరణ.అక్టోబర్ 28న ర్యాలీలు: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ కోటి సంతకాల కార్యక్రమం ముమ్మరంగా జరుగుతోంది. రచ్చబండ పేరుతో ప్రతి నియోజకవర్గంలో ముమ్మరంగా సాగుతున్న ఈ కార్యక్రమం నవంబర్ 22 దాకా జరుగుతుంది. ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తూ అక్టోబర్ 28న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రతి నియోజకవర్గంలో ర్యాలీలు చేయాలని పిలుపునిచ్చాం. అదేవిధంగా నవంబర్ 12న జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు జరుగుతాయి. అలాగే నవంబర్ 23న రాష్ట్ర వ్యాప్తంగా సేకరించిన సంతకాలను నియోజకవర్గ స్థాయిలో సేకరించిన సంతకాలను జిల్లా స్థాయికి ఫ్లాగ్ ఆఫ్ చేయించి పంపించడం జరుగుతుంది. నవంబర్ 24న కోటి సంతకాలు విజయవాడ పార్టీ ఆఫీసుకి వస్తాయి. ఆ తర్వాత గవర్నర్ గారి అపాయింట్‌మెంట్ తీసుకుని కోటి సంతకాలు తీసుకెళ్లి సబ్మిట్ చేస్తాం. చంద్రబాబు ప్రభుత్వంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు రెఫరెండం ఇచ్చారో గవర్నర్‌కి తెలియజేస్తాం. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణం: రాష్ట్రంలో ఇప్పటికీ డీఏపీ యూరియా దొరకని పరిస్థితులే కనిపిస్తున్నాయి. రాయలసీమ ప్రాంతంలో బుడ్డ శెనగ విత్తనం అంటారు. సాగుకు సిద్ధంగా ఉంది. గత నెల నుంచి సబ్సిడీ విత్తనాలు ఇస్తామని ప్రకటనలు చేశారే తప్ప ఇంతవరకు కార్యాచరణ లేదు. ఉల్లి రైతును గాలికొదిలేశారు. 60 రోజుల నుంచి కిలో రూ.3ల కన్నా దాటడం లేదు. ప్రభుత్వం క్వింటా రూ.1200 లకు ఇస్తామని చెప్పింది. ఎవరికిస్తున్నారో ఎవరికి తెలియదు. ఇచ్చిందీ లేదు. ప్రభుత్వంపైన రైతులు నిరసన తెలిపే సరికి హెక్టారుకు రూ.50 వేలు ఇస్తామని చెప్పారు. కానీ, ఇచ్చేదానికి విధివిధానాలు రూపొందించలేదు. ఎవరికీ ఇచ్చింది లేదు. ధాన్యానికి గతేడాది గిట్టుబాటు ధర లేక బస్తా రూ.1100 నుంచి రూ.1200లకు తెగనమ్ముకునే పరిస్థితి. ఈసారి పరిస్థితులు ఎలా ఉంటాయో అర్థంకాక రైతులు ఆందోళన చెందుతున్నారు. క్వింటా పత్తి గతంలో రూ.12 వేలు పలికితే ఇప్పుడు రూ.5500లు పలకడం లేదు. అరటి గతంలో రూ.28 వేలు గరిష్టంగా పలికితే ఇప్పుడు రూ.3500 పలుకుతోంది. కూలీ ఖర్చులు కూడా రావడంల లేదని రైతులు టమోటాను పొలాల్లోనే వదిలేస్తున్నారు. దెబ్బతిన్న ఏ సీజన్‌లో కూడా బీమా కానీ పంట నష్టపరిహారం కానీ ఇవ్వడం లేదు. అంతెందుకు ఇటీవల కురిసిన వర్షాలకు పంట నష్టం జరిగితే ఏ అధికారి కూడా వెళ్లి ఎన్యుమరేషన్ కూడా చేయడం లేదు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఇంత ఘోరంగా ఉంది. మీడియా ప్రశ్నలకు బదులిస్తూ.. నకిలీ మద్యం తాగితే ప్రజలకు ప్రాణాలకు ఎలాంటి ఇబ్బందీ లేదని కొన్ని మీడియా సంస్థలు వార్తలు రాశాయన్న దానిపై స్పందిస్తూ.. వీళ్లంతా దొంగల ముఠా సభ్యులు కాబట్టి ఈ మీడియా సంస్థలు.. దోచుకో, పంచుకో, తినుకో అనే దాంట్లో ఈనాడు, టీవీ5, ఆంధ్రజ్యోతి ఉన్నాయి. వీళ్లంతా సభ్యులు కాబట్టి నేచురల్‌గా ఆదాయం అంతా వాళ్లకే పోతోంది కాబట్టి ప్రజలకు ఆరోగ్యం ఎలా జరిగితే మాకేం అనే ఉద్దేశంతో ప్రజల్ని తప్పుదోవ పట్టించడం కోసం ప్రజల ఆరోగ్యం కన్నా వీళ్ల లాభాలే మిన్న కాబట్టి తప్పుదోవ పట్టించే క్రమంలో వాళ్లు అలాగే చెబుతారు. అల్టిమేట్ గా నలుగురు చనిపోయిన పరిస్థితులు రాష్ట్రంలో చూస్తున్నాం. కల్తీ మద్యం విచ్చలవిడిగా తయారవుతోంది అనేది కంటికి కనిపిస్తోంది. ఫ్యాక్టరీలతో సహా వీళ్ల పెట్టుబడుల్లో, ఆదాయాల్లో వీళ్లకు వీళ్లకు మనస్పర్దలు వచ్చిన చోట పట్టుబడుతున్నాయి. డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కనిపిస్తోంది. అమ్ముతున్నది కనిపిస్తోంది. అయినా వీళ్లకే మాత్రం స్పృహ కూడా లేదు. మేం గూగుల్ డేటా సెంటర్‌కు వ్యతిరేకం కాదు: గూగుల్ డేటా సెంటర్‌ను మేం ఎక్కడా వ్యతిరేకించడం లేదు. మద్దతు ఇస్తున్నాం. మేం ఇనీషియేట్ తీసుకున్నాం కాబట్టే ఇది జరిగింది. పర్యావరణం గురించి ఎవరో మాట్లాడుతున్నారనే దానికి నువ్వు నన్ను అడిగితే నేనేం చెప్పేది. రాష్ట్రం అన్నది ఏఐ యుగంలో ఉంది. ఏఐ యుగం, క్వాంటం కంప్యూటింగ్ ఈ యుగాల్లోకి పోతున్నాం. వీటన్నింటికీ హబ్ అనేది డేటా సెంటర్. డేటా సెంటర్ అనేది లేకపోతే ఫర్దర్ ఎవల్యూషన్ అనేది ఉండదు. డేటా సెంటర్ ఉంటేనే ఎకో సిస్టమ్ బిల్డ్ అవుతుంది. పవర్ రిక్వైర్మెంట్స్, వాటర్ గజిలింగ్ లాంటి కొన్ని సమస్యలు వచ్చినా సర్టైన్ కెపాసిటీ బిల్డ్ కావాల్సిన అవసరం అయితే ఉంది. అప్పటి దాకా ప్రతి ఒక్కరూ దానికి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ, ఇక్కడ తేడా ఏమిటంటే.. డేటా సెంటర్ల పరంగా డిఫరెన్స్ కనిపించదు. మనం చేసింది ఇంకా పెరుగుదలే ఈ ఫర్దర్ డేటా సెంటర్ యాడిషన్స్. కానీ మనం నాట్ ఓన్లీ డేటా సెంటర్, మీరు ఐటీ స్పేస్ కూడా కట్టాలి, తద్వారా 25 వేల ఉద్యోగాలు ఇవ్వాలని పెట్టగలిగాం. వితిన్ టైమ్ ఫ్రేములో ఇవన్నీ కట్టాలి, రావాలి అని అగ్రిమెంట్ చేశాం. అది కూడా ఇది వీళ్లు చేయగలిగితే ఇంకా బెటర్ గా ఎకో సిస్టమ్ అనేది ఫాస్ట్ గా గ్రో అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అంతా పొలిటికల్ గవర్నెన్స్: గ్రామ, వార్డు సచివాలయాల మంచితనం అనేది చంద్రబాబుకు అర్థం కావడం లేదు కాబట్టే చంద్రబాబు పరిస్థితి ఇలా ఉంది. ఈరోజు గవర్నెన్స్ అన్నది ఎందుకు ఫెయిల్ అయ్యింది అంటే దానికి ప్రధానమైన కారణం.. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఫెయిల్ కావడం. గ్రామ, వార్డు వాలంటీర్ల వ్యవస్థను తీసేయడం, పొలిటికల్ గవర్నెన్స్ ను తీసుకుని రావడం, ఎన్నికల హామీలకు ఈయన తూట్లు పొడవడం, ఈయనకు క్యారెక్టర్, క్రెడిబులిటీ లేదు కాబట్టి రాష్ట్రం ఈరోజు అతలాకుతలం అయిపోయిన పరిస్థితులు ఉన్నాయి. బాలకృష్ణ అసందర్భంగా మాట్లాడారు: బాలకృష్ణ అనే వ్యక్తి అసెంబ్లీలో అసందర్భంగా మాట్లాడారు. అసలు ఆయన అసెంబ్లీలో మాట్లాడాల్సింది ఏమిటి?. కానీ మాట్లాడింది ఏమిటి?. మద్యం సేవించి వచ్చిన వ్యక్తితో అసెంబ్లీలో మాట్లాడించే కార్యక్రమం చేస్తున్నారు. దీన్ని స్పీకర్ చూడాలి. తాగినోడు ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడంటే.. ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో చూడాల్సిన అవసరం ఉందని శ్రీ వైయస్ జగన్ అన్నారు.