న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఆంద్రప్రదేశ్ రాష్ట్రం పట్ల ఎందుకు సవతి తల్లి ప్రేమ చూపుతుందని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రశ్నించారు. న్యూఢిల్లీలోని పార్లమెంట్ ఆవరణలో ఎంపీలు పిల్లి సుభాష్ చంద్రబోస్, చింతా అనురాధా, వంగాగీత మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను ఆమోదించాలని ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర జలశక్తిమంత్రిని సీఎం వైయస్ జగన్, ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి పలుమార్లు కలిసి విజ్ఞప్తి చేశారు. పోలవరం విషయంలో ఇంకా పెండింగ్ పెడుతున్నారు. ఎందుకు ఏపీ పట్ల సవతి తల్లి ప్రేమ చూపుతున్నారో ఒకసారి ఆలోచన చేయాలి. ఇతర జాతీయ ప్రాజెక్టుల పట్ల కేంద్రం ఏవిధంగా నిబంధనలు అనుసరిస్తున్నారో గమనించాలి. పవర్ ప్రాజెక్టుల పట్ల దురదృష్టకరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాగునీటి వాటర్ కంపొనెంట్‌ను విడదీస్తూ పార్లమెంట్‌లో జీవో విడుదల చేయడం విచారకరం. ప్రధాని, జలశక్తి మంత్రి తగు చర్యలు తీసుకొని వెంటనే ఈ జీవోను ఉప సంహరించుకోవాలి. పోలవరం రివర్స్‌కాస్ట్ ఎస్టిమేషన్లు విడుదల చేయాలని కోరుతున్నాం. కేంద్రంలోని సీఎస్‌కు కూడా మా సీఎం పలుమార్లు లేఖలు రాశారు. ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. పోలవరం జాతీయ ప్రాజెక్టా? కాదా ఒకసారి లోచన చేయాలి. పోలవరం బకాయిలను కేంద్రం తక్షణమే విడుదల చేయాలి. పోలవరం ప్రాజెక్ట్ హెడ్‌క్వార్టర్స్ హైదరాబాద్‌లో ఉంది. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి అన్నింటికి అనువుగా ఉంటుంది. కార్యాలయాన్ని రాజమండ్రికి తరలించడం లేదు. ఎందుకీ సవతితల్లి ప్రేమ చూపుతున్నారో కేంద్రం ఆలోచన చేయాలి. ఆర్‌అండ్ ఆర్ ప్రాజెక్టు గురించి కేంద్రం ఆలోచన చేయాలి. గిరిజనులకు పరిహారం ఇచ్చే సమయంలో ఎందుకు కేంద్రం ఆలస్యం చేస్తుందో అర్థం కావడం లేదు. ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. గిరిజనులకు పరిహారం ఇవ్వకుండా నీరు ఇవ్వడం సాధ్యం కాదు. కేంద్రం ఈ విషయంలో కూడా ఆలోచన చేయాలి. ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ నిరుపేదలైన గిరిజనులకు ఇచ్చే విషయంలో అశ్రద్ధ చూపడం సరికాదు. ప్రధాని, జలశక్తి మంత్రి ఒక్కసారి ఆలోచన చేయాలి ప్రత్యేక హోదా అన్నది లాంగ్‌పెండింగ్ డిమాండ్‌గా మిలిగింది. ప్రత్యేక హోదా ఏపీ ప్రజల చిరకాల కోరిక. ఏపీ విడిపోయినప్పుడు ఆ రోజు ప్రధాని పార్లమెంట్ సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీని నెరవేర్చకుండా ఏపీ ప్రజల పట్ల సవతితల్లి ప్రేమను చూపుతున్నారు. కేంద్రం ఈ విషయంలో కూడా ఆలోచన చేయాలని ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రధాని నరేంద్ర మోదీని కోరారు.