చంద్రబాబు కొడుకు లోకేష్‌ ఏ మీడియంలో చదివాడో చెప్పాలి ?

వైయ‌స్ఆర్ సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి

 చిత్తూరు: ఆంగ్ల బోధనపై చంద్రబాబు నాయుడు విమర్శలు చేయడం సిగ్గుచేటని వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి ఫైర్‌ అయ్యారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు కొడుకు లోకేష్‌ ఏ మీడియంలో చదివాడో చెప్పాలని నిలదీశారు. ఇప్పుడు లోకేష్‌ కొడుకు ఏ మీడియంలో చదువుతున్నాడో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు కొడుకు, మనవడు ఇంగ్లీష్‌ మీడియంలో చదవొచ్చు.. కానీ పేద పిల్లలు మాత్రం ఇంగ్లీష్‌ మీడియంలో చదవకూడదా అని నిలదీశారు. విద్యకు సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఎంపీ మిథున్‌రెడ్డి గుర్తుచేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top