బడ్జెట్‌ సమావేశాల్లో పోలవరం అంశాన్ని లేవనెత్తుతాం

రఘురామకృష్ణరాజుపై తక్షణమే అనర్హత వేటు వేయాలి 

ఎంపీ మార్గాని భరత్‌

న్యూఢిల్లీ: బడ్జెట్‌ సమావేశాల్లో పోలవరం అంశాన్ని లేవనెత్తుతామని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ మార్గాని భరత్‌ పేర్కొన్నారు. పోలవరాన్ని ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేయాలని సీఎం వైయస్‌ జగన్‌ లక్ష్యంగా పెట్టుకున్నారని తెలిపారు. పోలవరం సవరించిన అంచనాలకు ఆమోదం తెలిపేందుకు కేంద్రంపై ఒత్తిడి తెస్తామని చెప్పారు. ఇటీవలే కేంద్ర అధికారులతో రాష్ట్ర ప్రతినిధులు సమావేశమై చర్చలు జరిపారని పేర్కొన్నారు. పోలవరం అంశంపై చర్చల్లో పురోగతి వచ్చిందన్నారు. ఏపీ పునర్‌ విభజన చట్టం పూర్తిగా అమలు చేయాలని ఎంపీ డిమాండు చేశారు. కడప స్టీల్‌ ప్లాంట్, రామయపట్నం పోర్టుకు నిధులు కేటాయించాలని కోరారు. ఏడాదిన్నర తర్వాత రఘురామకృష్ణరాజుపై అనర్హత పిటిషన్‌ను ప్రివిలేజ్‌ కమిటీకి పంపారని చెప్పారు. వచ్చే నెల 3న ప్రివిలేజ్‌ కమిటీ ఎదుట అన్ని విషయాలు వివరిస్తామని తెలిపారు. వైయస్‌ఆర్‌సీపీ గుర్తుపై గెలిచి టీడీపీకి రఘురామకృష్ణరాజు వంత పాడుతున్నారని విమర్శించారు. రఘురామకృష్ణరాజు వ్యవహారాన్ని ఎథిక్స్‌ కమిటీకి సైతం పంపించాలని కోరారు. రఘురామకృష్ణరాజుపై తక్షణమే అనర్హత వేటు వేయాలని ఎంపీ డిమాండు చే శారు.
 

Back to Top