బాబు, పవన్‌లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్‌షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్‌షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
మూడు రాజధానులకు మద్దతు వెల్లువ
20 Jan 2020 8:25 PM
రాష్ట్రవ్యాప్తంగా భారీ ర్యాలీలు
సీఎం వైయస్ జగన్‌కు ధన్యవాదాలు తెలుపుతూ సంబరాలు
తూర్పు గోదావరి: రాజధాని వికేంద్రీకరణకు అసెంబ్లీలో ఆమోదం లభించడంతో రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ శ్రేణులు భారీ బైక్ ర్యాలీని నిర్వహించారు. రాజమండ్రిలోని మోరంపూడి జంక్షన్ నుంచి క్వారీ సెంటర్ వరకు జరిగిన ఈ ర్యాలీలో స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా పిఠాపురంలో సైతం వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు సోమవారం పాదయాత్రను నిర్వహించారు.మరోవైపు రంపచోడవరంలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు రామన్న దొర, మంగా బొజ్జయ్య, పండా రామకృష్ణ తదితరుల పాల్గొన్నారు.
కాకినాడ: రాష్ట్ర అభివృద్ధికై సీఎం వైయస్ జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మూడు రాజధానుల బిల్లుకు మద్దతుగా వైఎస్సార్ సీపీ కార్యాలయ నుంచి బలాజీ చెరువు సెంటర్ వరకు భారీ బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో నగర వైయస్ఆర్ సీపీ అధ్యక్షుడు ఫ్రూటీ కుమార్, యాళ్ల పట్టాభి, రావూరి వెంకటేశ్వరరావు, నల్లబిల్లి సుజాత, బెండా విష్ణు, పెదబాబు పాల్గొన్నారు.
రామచంద్రపురం: మూడు రాజధానుల బిల్లుపై అసెంబ్లీలో అమోదం ప్రకటించడంతో హర్షం వ్యక్తం చేస్తూ వైఎస్సార్ సీపీ నాయకులు ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో పార్లమెంటరీ అధ్యక్షుడు తోట త్రిముర్తులు ఇతర నాయకులు పాల్గొన్నారు.
అమలాపురం: రాజధాని వికేంద్రీకరణ నిర్ణయానికి అసెంబ్లీ ఆమోదం అభించడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. అదేవిధంగా కుడుపూడి చిట్టబ్బాయి ఆధ్వర్యంలో అమలాపురంలో ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుడుపూడి సూర్యనారాయణ రావు, చెల్లుబోయిన శ్రీను, వంటెద్దు వెంకయ్య నాయుడు ఇతరులు పాల్గొన్నారు.