కడపలో వైయ‌స్ఆర్‌సీపీ విద్యార్థి–యువత ర్యాలీ పోస్టర్ ఆవిష్కరణ 

కడప: డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ నెల 28న నిర్వహించనున్న విద్యార్థి–యువత ర్యాలీకి సంబంధించిన పోస్టర్‌ను వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. విద్యార్థులు, నిరుద్యోగ యువత సమస్యలను కూటమి ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందన్నారు. డీఎస్సీ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపి అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన బకాయిలను వెంటనే విడుదల చేయడంతో పాటు ఎన్నికల హామీ మేరకు నిరుద్యోగ భృతిని అమలు చేయాలని డిమాండ్ చేశారు.

విద్యార్థుల హక్కులు, నిరుద్యోగ యువత భవిష్యత్తు కోసం వైయ‌స్ఆర్‌సీపీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. జూలై 28న జరిగే ర్యాలీలో విద్యార్థులు, యువత, నిరుద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఎస్సీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పులి సునీల్‌కుమార్, మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, విద్యార్థి, యువజన విభాగాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
 

Back to Top