ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లో ఉంటే కచ్చితంగా హతమార్చే వారు 

ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి సంచ‌ల‌న కామెంట్స్‌

నెల్లూరు:  టీడీపీ గూండాలు దాడి చేసే స‌మ‌యంలో మాజీ మంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ సీనియ‌ర్ నేత న‌ల్ల‌ప‌రెడ్డి ప్ర‌స‌న్న‌కుమార్‌రెడ్డి ఇంట్లో ఉండి ఉంటే క‌చ్చితంగా హ‌త‌మార్చేవార‌ని ఎమ్మెల్సీ చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ..`మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి పై జరిగిన దాడి తో రాష్ట్రం ఒక్కసారి ఉలిక్కి పడింది. రాజకీయాల్లో ఎదుటివారిని ఒక మాట అనే ముందు మనం 10 మాటలు పడేలా ఉండాలి. టీడీపీ ఎమ్మెల్యే అనుచ‌రులు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి చేసి బీభ‌త్సం సృష్టించారు. ఆ స‌మ‌యంలో ఆయ‌న ఇంట్లో ఉంటే కచ్చితంగా హతమార్చే వారు. మరో నాలుగేళ్లు తాము ఏమి చేసినా చెల్లుతుంది అని కూటమి నేతలు భావిస్తున్నారు. 7వ తేదీ ప్రసన్న ఇంటిపై దాడి జరిగితే 6 రోజులు తర్వాత 13వ తేదీ ఇంటిపై అనుమానస్పద దాడి అని కేసు కట్టారు. ముందు కేసు కట్టకుండా ఉంటే తాము నిరసన కార్యక్రమం చేపడతాం అని తెలిసి ఓ చిన్న కేసు కట్టారు. టీడీపీ పార్టీ కార్యాలయంపై దాడి చేశారు అనే అనుమానంతో వల్లభనేని వంశీని నాలుగు నెలలు జైల్లో ఉంచారు. ప్రశ్నించే వారిని చంపాలి, కొట్టాలి, నరకాలి అనే విధంగా కూటమి నేతలు ప్రవర్తిస్తున్నారు. అన్ని ఆధారాలతో దాడికి పాల్పడిన వారి ఫోటోలు, వీడియోలు యిచ్చినా పోలీసులు వారి పై కేసు నమోదు చేయలేదు` అని చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి ఆక్షేపించారు.

Back to Top