చంద్ర‌బాబు డైరెక్ష‌న్‌లోనే రౌండ్ టేబుల్ స‌మావేశం

బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పెద్ద‌పీట‌

ఎమ్మెల్యే టీజేఆర్ సుధాక‌ర్‌బాబు

తాడేప‌ల్లి: ప‌్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు డైరెక్ష‌న్‌లోనే నిన్నరౌండ్ టేబుల్ స‌మావేశం నిర్వ‌హించార‌ని వైయ‌స్ఆర్‌సీపీ అదికార ప్ర‌తినిధి, ఎమ్మెల్యే టీజేఆర్ సుధాక‌ర్‌బాబు పేర్కొన్నారు. చంద్ర‌బాబు దళితులపై కుట్రలు కుతంత్రాలు చేస్తున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. ఆదివారం తాడేప‌ల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. చంద్ర‌బాబు ఐదేళ్లు అధికారంలో ఉండి ద‌ళితుల‌పై దాడులు చేయించార‌ని మండిప‌డ్డారు. ద‌ళితులుగా పుట్టాల‌ని ఎవ‌రైనా అనుకుంటారా అన్న‌ది చంద్ర‌బాబు కాదా అని ఆయ‌న ప్ర‌శ్నించారు. అప్పుడే హ‌ర్ష‌కుమార్ రౌండ్ టేబుల్ స‌మావేశం ఎందుకు పెట్ట‌లేద‌ని నిల‌దీశారు.చంద్ర‌బాబుది కుట్ర‌పూరిత వైఖ‌ర‌ని తూర్పార‌బ‌ట్టారు.  చంద్రబాబు దళితులను వైయ‌స్ఆర్‌‌సీపీకి దూరం చేయాలనే కుట్ర చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. 

ద‌ళిత సంక్షేమానికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పెద్ద‌పీట‌
ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ద‌ళిత సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నార‌ని ఎమ్మెల్యే సుధాక‌ర్‌బాబు పేర్కొన్నారు. విజయవాడ నడిబొడ్డున సీఎం వైయ‌స్ జగన్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయిస్తున్నార‌ని తెలిపారు. వైయ‌స్ జగన్‌మోహన్‌ రెడ్డి పాలనలో దళితులు సంతోషంగా ఉన్నార‌ని సుధాక‌ర్‌బాబు పేర్కొన్నారు

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top