మానవత్వం పరిమళించి.. వృత్తి ధర్మం ఆచరించి

వైయ‌స్ఆర్ జిల్లా:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జ‌మ్ముల‌మడుగు ఎమ్మెల్యే డాక్టర్ మూలె సుధీర్ రెడ్డి చిలమకూరు నుండి నిడుజువ్వి కి వెళుతున్న సమయంలో  బైక్ ప్రమాదం లో గాయపడిన వ్యక్తిని చూసి అతనికి ప్రథమ చికిత్స అందించారు. అనంత‌రం చిలమకూరు ప్రభుత్వ ఆసుపత్రి కి వారి వెంట తన మనిషిని పంపించి బాధిత కుటుంబానికి సమాచారం అందించారు. వారు వచ్చే వరకు అసుప‌త్రి వ‌ద్దే ఉండి మెరుగైన చికిత్స అందించాలని ఆసుపత్రి సిబ్బందిని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆదేశించారు. తాను ఎమ్మెల్యే అయిన‌ప్ప‌టికీ కూడా మాన‌వ‌త్వంతో వైద్యం చేసి, వారి ప్రాణాలు కాపాడిన సుధీర్‌రెడ్డిని స్థానికులు  అభినందించారు. నాయ‌కుడంటే ఇలా ఉండాల‌ని కొనియాడారు.

తాజా ఫోటోలు

Back to Top