పేదలు  ఇబ్బందులు పడకూడదనే ఆర్థికసాయం

ఎమ్మెల్యే ఆర్కే రోజా

చిత్తూరు: లాక్‌డౌన్‌తో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడకుండా తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే రోజా అన్నారు. 'దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో ఇబ్బందులు పడుతున్న వారి సమస్యలు తీర్చడానికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ నాయకత్వంలో ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు కొనసాగిస్తోందన్నారు.  రేషన్‌కార్డు ఉన్న వారికి గ్రామ వాలంటీర్ల ద్వారా రూ.1,000తో పాటు ఉచితంగా రేషన్‌ అందిస్తున్నామని రోజా ట్వీట్ చేశారు. 

Back to Top