చంద్రబాబు పాలన రైతులకు చీకటి అధ్యాయం

వైయస్‌ జగన్‌ రైతు పక్షపాతి

ఎమ్మెల్యే ప్రసాదరాజు

అమరావతిః రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో  వ్యవసాయ,అనుబంధ శాఖలకు  28,866 కోట్లు  కేటాయించడం  గొప్ప శుభ పరిణామం అని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ప్రసాదరాజు అన్నారు. ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్‌ 2,27,974 కోట్లు ఉంటే ఒక రైతాంగానికే 28,866 కోట్లు కేటాయించడం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి రైతుల పట్ల చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు.  ఏపీలో 62 శాతం ప్రజలు వ్యవసాయం,అనుబంధ రంగాలపై ఆధారపడుతున్నారన్నారు.  రైతు అభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ముందుకెళ్తున్నారని తెలిపారు.

వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం  రైతు పక్షపాతి అని అన్నారు. రైతు ప్రభుత్వం  అంటే గుర్తుకువచ్చేంది  దివంగత మహానేత వైయస్‌ఆర్‌ అని, వారి స్ఫూర్తితో రైతుల సంక్షేమానికి  ప్రభుత్వం అంకితమవుతునందుకు గర్వకారణంగా ఉందన్నారు.గత ఐదేళ్లలో చంద్రబాబు పాలన  ఏపీ రైతులకు చీకటి అధ్యాయం అని పేర్కొన్నారు. చంద్రబాబు ఎప్పుడూ గద్దెనెక్కిన వ్యవసాయం సంక్షోభంలో పడుతుందన్నారు.  వైయస్‌ఆర్‌ పాలనలో రైతులకు ప్రతీరోజు పండగేనని అన్నారు. జలయజ్ఞం ద్వారా లక్షల ఎకరాల సాగు జరిగిందన్నారు. ఉచిత విద్యుత్‌పై తొలి సంతకం చేశారన్నారు.

 

Back to Top