వలంటీర్లకు ప్రమాద బీమా అందించిన‌ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా

రాజాన‌గ‌రం: రాష్ట్రంలోనే ప్రప్రథమంగా రాజానగరం నియోజకవర్గంలో ఉండే 1475 మంది వలంటీర్లకు ప్రమాద బీమాను‌ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అందించారు. రాజానగరం పట్టణములోని మాధవి ఫంక్షన్ హాల్ లో నియోజకవర్గంలోని మూడు మండలాల వలంటీర్లకు ప్రమాద బీమా పథకాన్ని జిల్లా కలెక్టర్ హరికిరణ్ చేతుల మీదుగా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ.. ప్ర‌భుత్వ ప‌ళ‌కాలు గ‌డ‌ప ముందుకే తీసుకువ‌చ్చే గొప్ప వ్య‌వ‌స్థ‌ను ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ తీసుకువ‌చ్చార‌న్నారు. మన వలంటీర్ వ్యవస్థ దేశానికే ఆదర్శమని, ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు మన వలంటీర్ వ్యవస్థను ఆయా రాష్ట్రాల్లో అమలు చేసేందుకు సన్నాహలు చేస్తున్నాయన్నారు. వలంటీర్ వ్యవస్థ ద్వారా తెల్లవారుజామున కోడికూసే సమయానికే పింఛ‌న్ ల‌బ్ధిదారుల చేతుల్లోకి చేరుతుంద‌న్నారు. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, పార్టీలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా వలంటీర్ వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలు అందిస్తున్నార‌ని, ఇచ్చిన ప్ర‌తి హామీని  ముఖ్యమంత్రి అమ‌లు చేస్తున్నార‌న్నారు. 

ముఖ్యమంత్రి ఆలోచనలకు, ఆశయాలకు అనుగుణంగా వలంటీర్ వ్యవస్థ పనిచేస్తుందని, ఇలాంటి వలంటీర్ వ్యవస్థకు, ఆ వలంటీర్ కుటుంబాలకు అండగా తాను ఉంటాన‌ని ఎమ్మెల్యే జ‌క్కంపూడి రాజా తెలిపారు. రాజానగరం నియోజకవర్గంలోని మహిళ వలంటీర్ కోడెలి లీలారాణి ప్రమాదవశాత్తు మృతిచెందడం చాలా కలచివేసిందని.. ఆ బాధ‌లో నుండే వలంటీర్లకు, వారి కుటుంబాలకు అండగా ఉండాలని ప్రమాద బీమా పథకం అందించాలని ఆలోచన చేసినట్లు ఎమ్మెల్యే తెలియచేశారు. ఈ ప్రమాద బీమా పథకాన్ని జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ ద్వారా నియోజకవర్గంలోని 1475 మంది వలంటీర్లకు అందిస్తున్నామని, మూడేళ్ల పాటు వారికి ఈ ప్రమాద బీమా వర్తిస్తుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజా తెలిపారు.వాలంటీర్లకు తాను ఎప్పుడూ అండగా, వారి కుటుంబ సభ్యుడిగా ఉంటానన్నారు.  

ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ ఇలాకియా, జెడ్పీటీసీలు వాసంశెట్టి పెద్ద వెంకన్న, కర్రీ నాగేశ్వరరావు, ఎంపీపీలు మందారపు సీతారత్నం వీర్రాజు, జోష్న, మండల కన్వీనర్లు డాక్టర్ బాబు ఉల్లి బుజ్జి బాబు, మెట్ల ఏసుపాదం, రాష్ట్ర హజ్ కమిటీ డైరెక్టర్ మహమ్మద్ ఇబాదుల్లాలతో పాటు వివిధ గ్రామాలకు చెందిన సర్పంచులు, మండల డివిజన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు

తాజా ఫోటోలు

Back to Top