చంద్రబాబు దగ్గర ఇరుక్కుపోయిన రాక్షసుడి కథ

 నవ్వులు పూయించిన జక్కంపూడి రాజా

ఘోర రాక్షసుడు శివుడి కోసం తపస్సు చేసాడు. శివుడు వచ్చి వరం కోరుకోమంటాడు. నువు ఇంత త‌్వరగా వస్తావనుకోలేదు కాస్త ఆగు ఆలోచించుకుని అడుగుతానంటాడు రాక్షసుడు. ఇంతలోనే అక్కడకొచ్చిన దేవతలు కొందరు అతడు ఘోరమైన రాక్షసుడు, అతడికేమీ వరాలు ఇవ్వకండి. ఇస్తే అంతా ఇబ్బంది పడాలని అన్నాడు. శివుడు ఆలోచనలో పడ్డాడు. ఆ రాక్షసుడిని ఆపుదామని ఆలోచించి సముద్ర తీరంలో ఉన్న ఇసుక రేణువులన్నీ లెక్కబెట్టుకుని రా అని చెప్పాడు. అయితే రాక్షసుడు లెక్కబెట్టుకుని త్వరగా వచ్చేస్తాడు. దీని తర్వాత శివుడు ఆకాశంలోని చుక్కలన్నీ లెక్కబెట్టుకుని రమ్మంటాడు. అదీ చేసేస్తాడా రాక్షసుడు. ఏం చెప్పినా వెంట వెంటనే చేసుకుని వచ్చేస్తున్న రాక్షసుడిని చూసి ఏం చేయాలో పాలుపోక శివుడు ఆలోచిస్తున్నప్పుడు ఓ వ్యక్తి వచ్చాడు. రాక్షసుడు తిరిగి రాకుండా ఉండేదుకు శివుడికి ఓ మంచి ఐడియా ఇచ్చాడు. అదేంటంటే ఈ రాక్షసుడిని వెళ్లి చంద్రబాబు అబద్ధాలు లెక్కపెట్టి రమ్మని చెప్పాడు. ఇక ఆ రాక్షసుడు ఇప్పటికీ ఎప్పటికీ రాడు. రాలేడు. శివుడిని వరం అడిగలేడు. బాబుగారి అనుభవం ఎలాంటిదంటే అబద్ధాలు ఆడటంలో దిట్ట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలంతా సిగ్గుతో తలదించుకునేలా మాట్లాడి నేడు కళ్లముందే నిజం కనిపిస్తున్నా నేను ఏమీ చేయలేదు, ఏమీ అనలేదు అంటూ సభలోనే, స్పీకర్ ముందే అబద్ధాలు ఆడేస్తున్నాడు. కోట్లు రూపాయిల ప్రజాధనాన్ని ఖర్చు పెడుతూ చంద్రబాబుకు బ్లాక్ కాట్ కమాండోస్ తో రక్షణ కల్పిస్తున్నారు. ఆయన రావాల్సన గేట్ నుంచి రాకుండా ఇంకో గేట్ నుంచి వచ్చాడు. ఇది కేవలం ఆయన పబ్లిసిటీ పిచ్చి కోసమే. ఆ పిచ్చ వల్లే పుష్కరాల్లో 28 మంది ప్రాణాలు తీసుకున్నాడు. అక్కడ కూడా రావాల్సిన గేటు నుంచి కాకుండా వేరే గేటు నుంచి వచ్చినందువల్లే అక్కడ అంత మంది ప్రాణాలు పోయాయి. మళ్లీ ఇవాళ అలాగే రావాల్సిన గేటు నుంచి కాకుండా వేరే గేటు నించి వస్తూ మళ్లీ ఎంత మంది ప్రాణాలు బలిపెడదామనుకుంటున్నాడు? ఇంకెంత మందిని పొట్టనపెట్టుకుందామనుకుంటున్నాడు? ఈ రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్కరూ చంద్రబాబుకు సిగ్గు, శరం, మానం, అభిమానం, చీమూ, నెత్తురూ ఉన్నాయని అనుకోరు. చంద్రబాబు అసెంబ్లీలో అరవమని బుచ్చయ్య చౌదరి భుజాలు గిల్లి గిల్లీ పెట్టడంతో ఆపరేషన్ చేయాల్సొచ్చిందట.
పార్టీని నడిపించే అధినాయకుడు తండ్రి స్థానంలో ఉంటాడు. మాకు తండ్రి స్థానంలో ఉన్న మా పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహనరెడ్డి నడుస్తున్న బాటలో మేమూ నడుస్తున్నాం. అందుకో ఉదాహరణ చెబుతాను. రాష్ట్ర విభజన విభాగం అధ్యక్షుడిగా పని చేస్తున్న సమయంలో రామచంద్రాపురంలో నాగరాజు అనే ఎస్సై నన్ను రోడ్డు మీద లాఠీతో ఇష్టం వచ్చినట్టుగా కొట్టాడు. కానీ నేను అధికారంలోకి వచ్చాక ఎదురెళ్లి మరీ అతడిని కౌగిలించుకుని వచ్చాను. 

Read Also: సీఎంకు మంచి పేరు వస్తుందనే టీడీపీ రాద్ధాంతం

Back to Top