సీఎంకు మంచి పేరు వస్తుందనే టీడీపీ రాద్ధాంతం

మార్షల్స్‌కు తక్షణమే క్షమాపణ చెప్పాలి

టూరిజం శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌

అసెంబ్లీ: ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వెళ్తున్నాయి.. ఎక్కడ సీఎం వైయస్‌ జగన్‌కు మంచిపేరు వస్తుందనే భయంతోనే తెలుగుదేశం పార్టీ సభలో రాద్ధాంతం చేస్తుందని టూరిజం శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు. 40 ఏళ్ల ఇండస్ట్రీకి మార్షల్స్‌తో ఎలా ప్రవర్తించాలో తెలియదా అని ప్రశ్నించారు. మార్షల్స్‌పై దాడికి దిగిన ప్రతిపక్షం వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. శాసనసభలో మంత్రి శ్రీనివాస్‌ ఏం మాట్లారంటే..
సీఎం వైయస్‌ జగన్‌కు ఎక్కడ మంచిపేరు వస్తుందో.. పథకాలు ప్రజల్లోకి వెళ్తున్నాయని తెలుగుదేశం పార్టీ భయపడుతుంది. ఇంగ్లిష్‌ మీడియం గురించి సభలో చర్చ జరిగింది.. చాలా చక్కగా ప్రజల్లోకి వెళ్లింది. చంద్రబాబు ఇంగ్లిష్‌ మీడియంపై మళ్లీ యూటర్న్‌ తీసుకున్నారు. ఈ రోజు మంచి బిల్లులు ప్రవేశపెట్టబోతున్నాం. సీఎం వైయస్‌ జగన్‌ వచ్చిన నాటి నుంచి రోజు ఏదో ఒక మంచి పని చేసి ప్రజల్లో మంచి పేరు సంపాదిస్తున్నారు. దాన్ని ఎట్టిపరిస్థితుల్లో ప్రజల్లోకి వెళ్లకూడదు. ఏదో రచ్చ చేయాలి అని ప్రతిపక్షం చూస్తోంది.

ఉన్మాది అనేది అసభ్యకర పదం కాదని చంద్రబాబు అంటున్నాడు. ఉన్మాది అసభ్యకర పదం కాకపోతే మేము మాట్లాడేందుకు కూడా చాలా పదాలు ఉన్నాయి. కానీ సభ్యతతో ప్రవర్తిస్తున్నాం. సభా సమయాన్ని టీడీపీ వృథా చేస్తోంది. రాజశేఖరరెడ్డిని చంపేశారు.. నువ్వెంత అని సీఎంను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడుతున్నాడు అంటే వైయస్‌ఆర్‌ను మీరే చంపేశారా..? ఏది చెబితే అది ప్రజలు నమ్ముతారని చంద్రబాబు అనుకుంటున్నాడు.

40 ఏళ్ల ఇండస్ట్రీ అంటున్నాడు.. సభలో ఎలా ఉండాలి, సభ ప్రాంగణంలో ఎలా ఉండాలనేది తెలియదా..? ప్రజల ధనంతో ప్రజా సమస్యలపై చర్చించేందుకు శాసనసభ నడుపుతుంటే ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తారా..? ఆ భాష ఏంటీ.. 40 ఏళ్ల ఇండస్ట్రీ, హైటెక్‌ సిటీ కట్టాను, ఐటీ తెచ్చాను, బిల్‌క్లింటన్‌ను తీసుకువచ్చాను అని చెప్పుకునే వ్యక్తికి మార్షల్స్‌ పట్ల ఎలా ప్రవర్తించాలో తెలియదా..? ఉద్యోగస్తులు అంటే చంద్రబాబుకు గిట్టదు.. తక్షణమే మార్షల్స్‌కు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని మంత్రి అవంతి శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు.

Read Also: చ‌ట్ట ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోండి

Back to Top